economic corridor
-
హమాస్ దాడులకు ఆ ఎంవోయూ కారణం కావొచ్చు!
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కూడా దాడులకు ఒక కారణం అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం..) ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్‌తో కలిసి పాతిక్రేయ సమావేశం నిర్వహించిన బైడెన్.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల గురించి స్పందించారు. హమాస్ దాడుల వెనక భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రకటన కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దీనికి సంబంధించి రుజువులు మా దగ్గర లేకున్నా.. అది నేను నమ్ముతాను. ఇజ్రాయెల్ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్ విషయంలో వెనక్కి తగ్గం అని బైడెన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా.. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ కోసం అవగాహన తాఖీదు(ఎంవోయూ) జరిగింది. భారత్‌తో పాటు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్‌యూనియన్‌లు ఆ ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆసియా, పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్ మధ్య ఆర్థిక మెరుగైన అనుసంధానం కోసం.. ముఖ్యంగా ఆర్థిక ఏకీకరణ ద్వారా కారిడార్ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ఎంవోయూ కుదర్చుకున్నాయి ఆయా దేశాలు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను రెండు ప్రత్యేక కారిడార్లుగా విభజించారు. తూర్పు కారిడార్ భారత్ నుంచి పశ్చిమ మధ్య ఆసియాను అనుసంధానిస్తుంది. అలాగే.. ఉత్తర కారిడార్ పశ్చిమ ఆసియాతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్‌ను అనుసంధానిస్తుంది. తాజాగా ఈ కారిడార్‌పై బైడెన్ స్పందిస్తూ.. ఇది రెండు ఖండాల మధ్య పెట్టుబడి అవకాశాలను పెంపొదిస్తుందంటూ ప్రశంసలు సైతం గుప్పించారు. ముఖ్యంగా సుస్థిరమైన మిడిల్ ఈస్ట్ నిర్మాణానికి ఈ కారిడార్ గుండా ఏర్పాటయ్యే రైల్వే పోర్ట్ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారాయన. మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకి చేరుకుంది. హమాస్‌ను తుడిచిపెట్టేంత వరకు విశ్రాంతి తీసుకునేది లేదంటూనే.. గాజాపై దాడుల్ని ఉధృతం చేయాలని తమ రక్షణ దళాన్ని ఆదేశించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ. మరోవైపు ఇజ్రాయెల్ బంధీల ద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని హమాస్ భావిస్తోంది. -
అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా
న్యూఢిల్లీ: భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్ ఆలోచన భారత్ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఈ మార్గం ద్వారా భారత్ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను భారత్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్‌తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది. జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. హైదరాబాద్ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు. -
ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు ధీటుగా, దేశాల మధ్య వేగవంతమైన అనుసంధానమే ధ్యేయంగా భారత్, అమెరికా తదితర దేశాలు ప్రతిష్టాత్మక ఆర్థిక నడవా(ఎకనామిక్ కారిడార్)ను తెరపైకి తీసుకొచ్చాయి. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ నూతన ప్రాజెక్టును భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు శనివారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై వారు సంతకాలు చేశారు. ఈ కారిడార్‌తో ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య భౌతిక అనుసంధానం మాత్రమే కాదు, ఆర్థిక అనుసంధానం సైతం మరింత పెరుగుతుందని నిర్ణయానికొచ్చారు. దేశాల నడుమ అనుసంధానాన్ని ప్రోత్సాహిస్తూనే అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కనెక్టివిటీని ప్రాంతీయ సరిహద్దుల వరకే పరిమితం చేయాలని తాను అనుకోవడం లేదన్నారు. దేశాల నడుమ పరస్పర నమ్మకం బలోపేతం కావాలంటే అనుసంధానం పెరగడం చాలా కీలకమని స్పష్టం చేశారు. రెండు భాగాలుగా ప్రాజెక్టు ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో రెండు వేర్వేరు కారిడార్‌లో ఉంటాయి. ఇందులో ఈస్ట్ కారిడార్ ఇండియాను, పశి్చమ ఆసియా/మధ్య ప్రాచ్యాన్ని కలుపుతుంది. ఉత్తర కారిడార్ పశి్చమ ఆసియా/మిడిల్ఈస్ట్ను యూరప్‌తో అనుసంధానిస్తుంది. సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఇదొక సీమాంతర షిప్–టు–రైలు ట్రాన్సిట్ నెట్వర్క్. దీంతో దేశాల నడుమ నమ్మకమైన, చౌకైన రవాణా సాధ్యమవుతుంది. వస్తువులను సులభంగా రవాణా చేయొచ్చు. రైలు మార్గం వెంట డిజిటల్, విద్యుత్ కేబుల్స్, క్లీన్ హైడ్రోజన్ ఎగుమతి కోసం పైపులు ఏర్పాటు చేస్తారు. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది చరిత్రాత్మకమని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివరి్ణంచారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. -
నాగ్‌పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న తొలి ఎకనమిక్ కారిడార్‌కు పూర్తిగా లైన్ క్లియర్ అయింది. నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ కారిడార్ తెలంగాణ – ఏపీ మధ్య 306 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.10 వేల కోట్ల ని«ధులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఆదీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) పచ్చజెండా ఊపింది. ఈ రోడ్డును తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం కావటంతో టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, చివరి మూడు ప్యాకేజీలకు తాజాగా ఎస్ఎఫ్సీ ఓకే చెప్పి నిధులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ (మంచిర్యాల) నుంచి విజయవాడకు పూర్తిగా కొత్త (గ్రీన్‌ఫీల్డ్) యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండున్నరేళ్లలో ఈ జాతీ య రహదారి రెడీ అవుతుందని జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంటోంది. మహారాష్ట్ర–తెలంగాణ–ఆంధ్ర: ఓవైపు పర్యావ రణ అభ్యంతరాలు, మరోవైపు భూసేకరణపై ప్రజల నిరసనలు, అలైన్మెంట్ మార్చాలంటూ రాజకీయ నేతల ఒత్తిళ్లు.. వెరసి ఈ ఎకనమిక్ కారిడార్‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్డు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు వరసలకు విస్తరిస్తున్నారు. ఇక్కడివరకు పాత రోడ్డు (బ్రౌన్‌ఫీల్డ్ హైవే) కొత్తగా మారుతుందన్నమాట. మంచిర్యాల నుంచి కొత్తగా భూసేకరణ జరిపి పూర్తి కొత్త రోడ్డుగా నిర్మిస్తారు. 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసలుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విజయవాడకు ఉన్న రోడ్డు పైనే ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్డు బాగా రద్దీగా మారింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రానున్నందున.. నాగ్‌పూర్ నుంచి వచే ట్రాఫిక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వాహనాలు దీని మీదుగానే ముందుకు సాగేందుకు వీలవుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇదీ ప్యాకేజీల స్వరూపం ప్యాకేజీ 1,2,3 మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.406 కి. మీ నిడివి. వ్యయం రూ.3,440.94 కోట్లు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు పనులు దక్కాయి. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు.. మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర. ప్యాకేజీ 4, 5, 6 వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108.24 కి.మీ నిడివి. వ్యయం రూ.3,397.01 కోట్లు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్ మదింపు జరుగుతోంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం. ప్యాకేజీ 7, 8, 9 ఖమ్మం నుంచి విజయవాడ వరకు 89.42 కి.మీ నిడివి. వ్యయం రూ.3,007 కోట్లు. స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఈ ప్యాకేజీకే నిధులు మంజూరు చేసింది. ఇక టెండర్లు పిలవాల్సి ఉంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో టెర్రరిస్టు దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన పడుతోంది చైనా. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)లో పని చేస్తున్న తమ దేశీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీపెక్ ప్రాజెక్టులో పని చేస్తున్న చైనీయుల కోసం బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఇటీవల కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఘటనతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా కార్మికులకు భద్రత కల్పించటం డ్రాగన్‌కు తలనొప్పిగా మారింది. ప్రాజెక్టుల వద్ద భద్రత బలగాలు, దర్యాప్తు దళాలను బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు సీపెక్‌కు చెందిన 11వ జాయింట్ కోఆపరేషన్ కమిటీ(జేసీసీ) తెలిపింది. ‘ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా ఉద్యోగులు బయటకి పనుల కోసం వెళ్లేందుకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు.’అని వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. బులెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించటం చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లయిందని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు -
ఎకనమిక్ కారిడార్‌కు భూసేకరణ పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: రాయపూర్–విశాఖ ఎకనమిక్ కారిడార్‌కు భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ కారిడార్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని చెప్పారు. అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల సీఎస్‌లు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాయపూర్–విశాఖపట్టణం ఎకనమిక్ కారిడార్, కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సమీర్‌శర్మ మాట్లాడుతూ ఎకనమిక్ కారిడార్ కోసం 798 హెక్టార్లకుగాను 561 హెక్టార్ల భూమిని ఇప్పటికే అప్పగించినట్లు చెప్పారు. రోడ్‌సైడ్ ఎమినిటీస్‌కు మరో 50 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణకు అడ్వాన్స్ పొజిషన్ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేస్తున్నట్లు తెలిపారు. సహజవాయువు పైపులైను ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మొదటిదశ పూర్తయిందని చెప్పారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు రెండోదశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ తెలిపారు. -
పాక్–చైనా బస్సు సర్వీస్.. వయా పీవోకే!
బీజింగ్: ఈ నెల 3వ తేదీ నుంచి చైనా, పాక్‌ల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు కాస్గర్– పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం లాహోర్ మధ్య ఈ బస్సు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా ఈ బస్సును నడపాలన్న నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవోకే కూడా తమదే అని పేర్కొంటున్న భారత్.. ఆ భూభాగం గుండా బస్సు సర్వీసు నడపడం తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగకరమని తెలిపింది. సీపెక్ ప్రాజెక్టు చైనా–పాక్ దేశాల ఆర్థిక సహకారానికి సంబంధించింది మాత్రమేననీ, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదని చైనా తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటి చైనా పర్యటన ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా బస్సు సర్వీసు నిర్ణయం వెలువడటం గమనార్హం. -
పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ సూపర్ పంచ్
-
భారత్-చైనా ఆర్థిక ప్రాజెక్టు..!!
వుహాన్, చైనా : భారత్-చైనాలు సంయుక్త ఆర్థిక ప్రాజెక్టును చేపట్టేందుకు అంగీకరించాయి. చైనా పర్యటనలో ఆ దేశాక్షుడితో చర్చలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు చైనా ప్రపోజల్‌కు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అప్ఘనిస్తాన్‌లో ఇరు దేశాలు ఈ ప్రాజెక్టును చేపడతాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. తాలిబన్ల ధాటికి కుదేలు అవుతున్న అప్ఘనిస్తాన్‌లో ఓ ఆర్థిక ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి. అయితే, ఈ ఆర్థిక ప్రాజెక్టు పాకిస్తాన్‌కు మింగుడు పడనివ్వకపోవచ్చు. గతేడాది డిసెంబర్లో చైనా-పాకిస్తాన్-అప్ఘనిస్తాన్‌ల మధ్య త్రైపక్ష కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఈసీ ప్రాజెక్టును అప్ఘనిస్తాన్కు పొడిగించేందుకు చైనా ఆసక్తిని కనబరచింది. -
భారత్, పాక్ మధ్య చైనా గొడవేమిటీ?
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పీచమణచడానికి భారత్ ఎలాంటి దాడులకు సాహసించినా పాకిస్థాన్‌కు తాము అండగా నిలబడతామని చైనా బహిరంగంగానే ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఆర్థికంగా మూడవ బలమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను కాదని, బలహీనమైన పాకిస్థాన్‌కు చైనా అండగా నిలబడడానికి బలమైన కారణం ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్’. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులే. ఇరుదేశాల మధ్య ఈ ఎకనామిక్ కారిడర్ చైనా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా బలూచిస్థాన్‌లోని గ్వాడర్ రేవు వరకు విస్తరించి ఉంది. ఇరు దేశాల ప్రయోజనార్థం ఇరుదేశాల భారీ పెట్టుబడులతో నిర్మిస్తున్నప్పటికీ ఈ కారిడర్ వల్ల పాకిస్థాన్కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం. ఈ కారిడార్ కింద నిర్మిస్తున్న మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు 5,100 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని ప్రస్తుత అంచనాలు తెలియజేస్తున్నాయి. వీటిలో 3,300 కోట్ల డాలర్లను విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు ఖర్చు పెడుతుండగా, మిగతా సొమ్మును జల,రోడ్డు,రైలు మార్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఉన్నాయి.వీటితో తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్ సమస్య పూర్తిగా సమసిపోతుంది. ఈ ఎకనామిక్ కారిడార్‌లో ఇరుదేశ ప్రభుత్వాలు పెట్టుబడులు పెడుతున్నప్పటికీ పాకిస్థాక్ను అవసరమైన పెట్టుబడులను రాయతీలపై చైనా ఎగ్జిమ్ బ్యాంక్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాలే సమకూర్చాయి. ఈ కారిడార్‌లో భాగంగా కరాచీ-లాహోర్ మధ్య 11,000 కిలోమీటర్ల మోటార్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రావల్పిండి-చైనా సరిహద్దుకు మధ్య కరకోరమ్ హైవేను అభివృద్ధి చేస్తున్నారు. కరాచి-పెషావర్ మధ్య 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు రైల్వే లైన్‌ను కూడా పునరుద్ధరిస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్టులు సహా ఈ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులన్నీ పాకిస్థాన్‌కు ఉపయోగపడే ప్రాజెక్టులుగానే కనిపిస్తున్నప్పటికీ ఈ మార్గాల గుండా ఆసియా, ఆఫ్రికా, పశ్చిమ యూరప్, ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న మధ్యప్రాచ్య మార్కెట్‌కు తమ సరకులను చేరవేసేందుకు ఈ మార్గాలన్నీ చైనాకు ఉపయోగపడేవే. ప్రపంచ మార్కెట్‌కు ముఖద్వారాలుగా నిలుస్తున్న దుబాయ్, సింగపూర్ దేశాలకు ఈ మార్గాల గుండా చైనా సులభంగా సరకులను చేరవేయవచ్చు. ఇప్పుడు చైనా అమెరికాను కూడా అధిగమించి దుబాయ్, సింగపూర్ దేశాలతో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ కారిడార్ పూర్తయితే చైనా ప్రపంచంలోనే ఆర్థికంగా నెంబర్ వన్ బలమైన దేశంగా ఆవిర్భవిస్తుంది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరగుపడుతుంది. ఇరు దేశాల మధ్య ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. ఎకనామిక్ కారిడార్ వెంట పర్యాటక కేంద్రాలను, హోటళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్ కారణంగా పాకిస్థాన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే ఊపందుకొందని, స్థలం విలువలు నిరుడుకన్నా రెట్టింపు అయ్యాయని పాక్‌లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఆర్బీ ఆసోసియేట్స్’ సీఈవో అతిఫ్ ఆలమ్ తెలిపారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు అడ్డంకులు కలిగించే ఎలాంటి పరిణామాలను చైనా కోరుకోదు. అంటే పాకిస్థాన్‌లో అంతర్గత అశాంతి పరిస్థితులనుగానీ, భారత్, పాక్ మధ్య యుద్ధాన్నిగానీ చైనా కోరుకోదన్నమాట. పాక్‌పైన భారత్ దాడి చేయొద్దని ఆశించే చైనా నిజంగా భారత్ దాడలకు దిగితే పాక్పైపు నుంచి మనపై దాడులు చేయదు. సంధి కుదుర్చేందుకే ప్రయత్నిస్తుంది. ఇరుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో దౌత్యపరమైన హెచ్చరికలకు పాల్పడుతోంది. చైనా, పాక్ కారిడార్‌కు బలూచిస్థాన్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగడం చాలా ముఖ్యం. అక్కడ అశాంతిని రెచ్చగొడతామనే బెదిరింపులతో భారత్ కూడా ఆ దేశాలను దారికి తీసుకరావచ్చు. -
చైనీయుల కోసం పాక్ బలగాల మోహరింపు!
-
చైనీయుల కోసం పాక్ బలగాల మోహరింపు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)కు దాయాది దేశంలో పెద్ద ముప్పే ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. అన్ని కాలాల్లోనూ పాక్ తమకు మిత్రదేశమేనని చైనా గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ దేశంలో మాత్రం సీపీఈసీ లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క చైనా కార్మికుడి కోసం ఇద్దరు సైనికులను పహారా పెట్టిమరీ రక్షణ కల్పిస్తోంది పాకిస్థాన్. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు కోసం 7,036 మంది చైనా కార్మికులు పనిచేస్తుండగా.. వారికి ఏకంగా 14,503మంది పాక్ సైనికులు భద్రత కల్పిస్తుండటం విశేషం. పంజాబ్‌లో జిహాదీ ఉగ్రవాదుల ముప్పు అధికంగా ఉండటంతో ఇక్కడ చైనా కార్మికులకు భారీ భద్రత కల్పిస్తున్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి తాజాగా సమర్పించిన లెక్కల ప్రకారం చైనీయులకు పంజాబ్‌లో 6,364 మంది, బలూచిస్థాన్‌లో 3134 మంది, సింధ్‌లో 2654 మంది, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 1912 మంది, ఇస్లామాబాద్‌లో 439 మంది సైనికులు భద్రత కల్పిస్తున్నారు. పాకిస్థాన్ పీపుల్ పార్టీ సభ్యుడు షాహిదా రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. చైనాలోని కాష్గర్ నుంచి బలూచిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవు వరకు రెండువేల కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న సీపీఈసీతో పాకిస్థాన్ రూపురేఖలు మారిపోతాయని ఆ దేశ ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, బలూచిస్థాన్ జాతీయవాదులు, తాలిబన్ ఫ్యాక్షన్ గ్రూపులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండటం పాక్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. -
చైనా నుంచి పాక్ తీరం వరకు ఎకనామిక్ కారిడార్?
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాలు పలు ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. వీటిలో చైనాలోని పశ్చిమాన ఉన్న కష్గర్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ తీర ప్రాంతమైన గ్వాదర్ వరకు మల్టీబిలియన్ డాలర్ ఎకానమిక్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అంతే కాకుండా పాకిస్తాన్లో శక్తి, అవస్థాపన రంగాల మీద చైనా 46 బిలియన్ డాలర్లని పెట్టుబడి చేయనుంది. ఆసియా ఖండం మీద చైనా ప్రభావం పెంచుకునేందుకు ఈ చర్య దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.