భారత్‌-చైనా ఆర్థిక ప్రాజెక్టు..!! | Wuhan Summit: Joint Economic Project By India And China | Sakshi
Sakshi News home page

భారత్‌-చైనా ఆర్థిక ప్రాజెక్టు..!!

Published Sat, Apr 28 2018 12:04 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Wuhan Summit: Joint Economic Project By India And China - Sakshi

వుహాన్‌లోని ఈస్ట్‌ లేక్‌ వద్ద జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ

వుహాన్‌, చైనా : భారత్‌-చైనాలు సంయుక్త ఆర్థిక ప్రాజెక్టును చేపట్టేందుకు అంగీకరించాయి. చైనా పర్యటనలో ఆ దేశాక్షుడితో చర్చలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు చైనా ప్రపోజల్‌కు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

అప్ఘనిస్తాన్‌లో ఇరు దేశాలు ఈ ప్రాజెక్టును చేపడతాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. తాలిబన్ల ధాటికి కుదేలు అవుతున్న అప్ఘనిస్తాన్‌లో ఓ ఆర్థిక ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి. అయితే, ఈ ఆర్థిక ప్రాజెక్టు పాకిస్తాన్‌కు మింగుడు పడనివ్వకపోవచ్చు.

గతేడాది డిసెంబర్లో చైనా-పాకిస్తాన్‌-అప్ఘనిస్తాన్‌ల మధ్య త్రైపక్ష కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఈసీ ప్రాజెక్టును అప్ఘనిస్తాన్‌కు పొడిగించేందుకు చైనా ఆసక్తిని కనబరచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement