
చైనా నుంచి పాక్ తీరం వరకు ఎకనామిక్ కారిడార్?
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాలు పలు ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. వీటిలో చైనాలోని పశ్చిమాన ఉన్న కష్గర్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ తీర ప్రాంతమైన గ్వాదర్ వరకు మల్టీబిలియన్ డాలర్ ఎకానమిక్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.
అంతే కాకుండా పాకిస్తాన్లో శక్తి, అవస్థాపన రంగాల మీద చైనా 46 బిలియన్ డాలర్లని పెట్టుబడి చేయనుంది. ఆసియా ఖండం మీద చైనా ప్రభావం పెంచుకునేందుకు ఈ చర్య దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.