బెంగళూరు : లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాలలో చిక్కుక్కుపోయిన వలస కార్మికులు తమ, తమ ఊళ్లకు చేరుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. జిల్లా కేంద్రాల, బెంగళూరు నుంచి కేఎస్‌ఆర్టీసీ(కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్)బస్సులో కార్మికులను తమ తమ ఊళ్లకి తరలిస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం వెల్లడించారు.
(చదవండి : కోవిడ్-19 : పాత్రికేయులకు రూ 10 లక్షల బీమా)
ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం నేటి నుంచి మూడు రోజుల(ఆది, సోమ, మంగళ వారం)మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కేవలం వలస కార్మికులను మాత్రమేనని, ఇతరులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రాలు, బెంగళూరు నుంచి వలస కార్మికులు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ప్రయాణ ఖర్ఛులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే బస్సు స్టాప్‌లలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా, సామాజిక దూరం పాటించేలా చూసుకోవాలని సూచించారు.
కాగా, కర్ణాటకలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 601 సోకింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 25 మంది మృతి చేందారు.
Comments
Please login to add a commentAdd a comment