ఇటీవల కాలంలో బయట తినడం ప్రజలకు అలవాటుగా మారింది. రుచితో పాటు కాస్త శుచిగా ఉంటే చాలు ఆ పుడ్‌ని తెగ లాగించేస్తుంటారు భోజన ప్రియులు. ఈ తరహా నిబంధనలు పాటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న జాబితాలో డోమినాస్ పిజ్జా, కేఎఫ్‌సీ వంటి విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఎంత ఫేమ్ ఉన్న కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థకున్న మంచి పేరు, గుర్తింపు కూడా ఒక్క సెకనులో పొగుట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక ఫోటో వల్ల ఓ ప్రముఖ సంస్థ పేరు నెట్టింట నెగిటివ్‌గా మారింది.
ఆ ఫోటోలో ఏముంది..
పిజ్జా అంటే గుర్తుకు వచ్చే పేరు డొమినోస్. టేస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెండుగా ఉంటుందని కస్టమర్లు అక్కడికి ఎగబడుతుంటారు. అయితే బెంగళూరులోని డొమినోస్ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థ పేరును మసక బారేలా చేస్తోంది. హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. కాకపోతే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్ బ్రష్‌లు, ఫ్లోర్ క్లీనింగ్ వస్తువును ఉంచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ఇదేనా మీ క్వాలిటీ పుడ్ అని డొమినోస్ సంస్థ పై మండిపడుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు
ఈ ఘటనపై స్పందిస్తూ.. డొమినోస్ ఎప్పుడూ పుడ్ విషయంలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ రెస్టారెంట్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Photos from a Domino's outlet in Bengaluru wherein cleaning mops were hanging above trays of pizza dough. A toilet brush, mops and clothes could be seen hanging on the wall and under them were placed the dough trays.
— Tushar ॐ♫₹ (@Tushar_KN) August 14, 2022
Please prefer home made food 🙏 pic.twitter.com/Wl8IYzjULk
చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు
Comments
Please login to add a commentAdd a comment