
నల్గొండ: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మొక్కను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును హై కమిషనర్‌కు కలెక్టర్ పమేలా సతప్పతి వివరించారు.
అనంతరం బ్రిటీష్ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదగిరిగుట్టకు వెళ్లి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.