Two Month Old Baby Girl Found Dead Inside Microwave Oven in Delhi - Sakshi
Sakshi News home page

కన్నతల్లి నిర్వాకం... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి

Mar 22 2022 5:19 PM | Updated on Mar 22 2022 7:31 PM

 Two Month Old Baby Girl Found Dead Inside Microwave Oven In Delhi - Sakshi

న్యూఢిల్లీ: కడుపులో ఉన్నది ఆడిపిల్ల అన్న అనుమానంతోనూ లేక స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతోనే చంపేసేవాళ్లు కొందరూ. మరికొందరు పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వదిలి వెళ్లిపోయేవారు మరికొందరూ. ఏది ఏమైన ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఘటనలకు అంతే లేదు అన్నట్లుగా జరుగుతున్నాయి. అచ్చం అలానే ఢిల్లీలో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో నివాసం ఉంటున్న గుల్షన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌లకు జనవరి నెలలో అనన్య అనే పాప పుట్టింది. ఏమైందో మరి ఏం కష్టం వచ్చిందో ఆ తల్లిక తెలియదు గానీ రెండు నెలల పసికందుని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టింది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆమె తన కొడుకుతో కలసి గదిలోకి వెళ్లి తలుపుకి తాళం వేసుకుని ఉండిపోయింది.

కాసేపటికి అనుమానంతో ఆమె అత్తగారు తలుపుతట్టగా తలుపు తీయకపోడంతో  ఇరుగు పోరుగు అంతా వచ్చి తలుపు పగలుగొట్టి చూడగానే తల్లి కొడుకులిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే వారి వద్ద పాప కనిపించలేదు. వారంతా చుట్టూ గాలించిన ఎంతకీ పాప కనిపించలేదు. కాసేపటికి ఏదో అనుమానంతో మైక్రోవేవ్ ఓవెన్‌ తెరిచి చూడగా పాప మృతి చెంది ఉంది.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి వచ్చి విచారించడం మొదలు పెట్టారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో పాప తల్లే ప్రధాన నిందుతురాలని తేలిందని పోలీసులు తెలిపారు. అంతే కాదు ఆ పాప తల్లి ఆడపిల్ల పుట్టడంతో తీవ్రంగా కలత చెందిందని, పైగా ఈ విషయమై భర్తతో  పోరాడిందని సంబంధికులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఆ దంపతులను అదుపులోకి  తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు  చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బెనిటా మేరీ జైకర్ తెలిపారు.

(చదవండి: టీఎంసీలో కుమ్ములాట? కీలక నేత హత్య.. ఆపై ఏడుగురు మృతిపై అనుమానాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement