ఓవెన్ కొంటున్నారా.. | Buying Oven | Sakshi
Sakshi News home page

ఓవెన్ కొంటున్నారా..

Published Fri, Sep 4 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

ఓవెన్ కొంటున్నారా..

ఓవెన్ కొంటున్నారా..

సాక్షి, హైదరాబాద్: కేవలం ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసుకునేందుకు ఓవెన్‌ను కొంటున్నారా...! లేక కుటుంబ సభ్యులందరికీ సరిపడే పదార్థాలను రెగ్యులర్‌గా తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారా...? ఓవెన్ కొనేముందు కుటుంబ సభ్యులతో చర్చించాల్సిన విషయమిది. అప్పుడే ఓవెన్ సెజైంతో తెలుస్తుంది.
- బేసిక్ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
- రీ హీట్ కోసమైతే బేసిక్ ఓవెన్ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్ విత్ గ్రిల్ కొనడం మంచిది.
- మెకానికల్ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు.
- సింగిల్ టచ్ రోటరీ ప్యానల్ కూడా మెకానికల్ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది.
- ఎలక్ట్రానిక్ ప్యానల్ ఉన్న ఓవెన్‌లో విద్యుత్ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది.
- అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారికి టాక్‌టైల్ కంట్రోల్ ఓవెన్‌లు ఎంతో సహాయపడతాయి.
- చిన్నపిల్లలున్న ఇంట్లో చైల్డ్ సేఫ్టీ లాక్, ఎలక్ట్రానిక్ లాక్ ఉన్న ఓవెన్లను తీసుకోవడం ఉత్తమం.
- బజాజ్, శామ్‌సంగ్, కెన్‌స్టార్, ఎల్జీ వంటి రకరకాల బ్రాండెడ్ కంపెనీలు ఓవెన్లను అందిస్తున్నాయి. వీటి ధరలు రూ.5-40 వేల వరకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement