ఈ రోజుల్లో సమయాన్ని ఆదా చేసే గాడ్జెట్స్‌కి మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరుగుతోంది. సమయంతో పాటు స్థలం కూడా ఆదా అయితే మరీ మంచిదంటున్నారు వినియోగదారులు. అలాంటి వారికోసమే ఈ డివైజ్. ఇందులో చక్కగా మూడు వెరైటీలను ఒకేసారి తయారుచేసుకోవచ్చు. 8 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవెన్‌తో పాటు పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌ను, పక్కనే కెటిల్‌ను ఒకే సమయంలో వినియోగించుకోవచ్చు.
ఓవెన్‌లో పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్.. గ్రిల్ ఐటమ్స్.. ఇలా ఎన్నో తయారు చేసుకోవడంతో పాటు పైన ఉన్న పాన్‌లో ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివి రెడీ చేసుకోవచ్చు. ఇక కుడివైపు టీ లేదా కాఫీ లేదా వేడినీళ్ల కోసం కెటిల్ డివైజ్ కనెక్టర్ ఉంటుంది. దాన్ని అవసరం లేకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. దాంతో స్థలం కలిసి వస్తుంది. కుడివైపు కెటిల్ డివైజ్‌కి ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు అదే హ్యాండిల్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించడానికి డివైజ్ ముందువైపు టైమింగ్, టెంపరేచర్‌కి సంబంధించిన 2 రెగ్యులేటర్స్, ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి.
ధర- 68 డాలర్లు(రూ.5,212)
చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733!
Comments
Please login to add a commentAdd a comment