Indian girl
-
కెనడా డ్రీమ్స్ : వాక్-ఇన్ ఓవెన్లో శవమై తేలిన వాల్‌మార్ట్ ఉద్యోగి
కెనడాలోని హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్లో వాల్‌మార్ట్ ఉద్యోగి, ఇండియాకు చెందిన సిక్కు యువతి శవమై తేలడం దిగ్భ్రాంతి రేపింది. మృతురాలిని ఈ బేకరీలోనే పనిచేస్తున్న 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్‌గా మారిటైమ్ సిక్కు సొసైటీ ధృవీకరించింది. కౌర్ మృతదేహాన్ని తొలుత గుర్తించిన ఆమె తల్లి అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. బతికి ఉండగానే ఓవెన్లో వేసి కాల్చారనే అనుమానాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కలలతో కెనడాకు వచ్చిన అందమైన యువతి అత్యంత విషాదంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. హాలిఫాక్స్ వాల్‌మార్ట్ ఆమె మరణంపై విచారంపై ప్రకటించింది. కాగా ఇండియాకు చెందిన కౌర్ , ఆమె తల్లి మూడేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. కౌర్ తండ్రి, సోదరుడు భారతదేశంలోనే ఉన్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ గత రెండేళ్లుగా మమ్‌ఫోర్డ్ రోడ్ వాల్‌మార్ట్‌లో పని చేస్తున్నారు. ఇద్దరూ స్థానిక సిక్కు కమ్యూనిటీలోమంచి పేరు తెచ్చుకున్నారు. అక్టోబర్ 19, శనివారం, కౌర్ తల్లి వాల్‌మార్ట్ స్టోర్ తెరిచి ఉండగానే బేకరీ డిపార్ట్మెంట్లో కాలిపోయిన తన బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఇంత విషాదకరమైన నష్టానికి క్షమించండి అంటూ మారిటైమ్ సిక్కు సొసైటీ అధ్యక్షుడు హర్జిత్ సెయాన్ ప్రకటించారు. మరోవైపు అంత్యక్రియల ఖర్చులకు సహాయం, కౌర్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను కెనడాకు తరలించేందుకు గోఫండ్‌బీ కేవలం 10 గంటల్లో (గురువారం మధ్యాహ్నం నాటికి దాదాపు ఒక లక్ష, 30వేల డాలర్ల ఫండ్‌ను సేకరించింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. కౌర్ మరణం ఎలా సంభవించిందని అనేదానిపై ఇంకా ఎలాంటి క్లూ లభించలేదని హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసు అధికారి మార్టిన్ క్రోమ్‌వెల్ చెప్పారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. -
మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?
ఎంత సన్నగా ఉందో! గాలొస్తే ఎగిరిపోతుంది!! అని హేళన చేసేవారామెను. ఆ మాటలు విన్న ప్రతిసారి తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యేది. స్కూల్లో తోటివిద్యార్థులు పదేపదే తనపై వేసే జోకులను మౌనంగా భరిస్తూ, సిగ్గుతో తలదించుకుని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయి హర్నాజ్ కౌర్ సంధు. హర్నాజ్ ఫీల్ అయిన ప్రతిసారి కుటుంబం మద్దతుగా నిలవడంతో.. మోడలింగ్‌లో రాణిస్తూ, సినిమాల్లో నటిస్తూ ఏకంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకునే స్థాయికి ఎదిగింది. నేడు (డిసెంబర్ 12న) ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో డెబ్భయ్యవ ‘విశ్వసుందరి’ (మిస్ యూనివర్స్) – 2021 పోటీలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఇండియాకు రెండుసార్లు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా నుంచి సుస్మితా సేన్, లారా దత్తా, సెలీనా జైట్లీ, నేహా దుపియాలు పోటీపడ్డారు. కానీ 1994లో సుస్మితాసేన్, 2000 లో లారా దత్తాలు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో లారాదత్త ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటం తెచ్చింది. ఆ తరువాత ఇప్పటిదాకా మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ రాలేదు. అయితే లారాదత్త కిరీటం గెలుచుకున్న ఏడాదే జన్మించిన ‘మిలీనియం గర్ల్’ హర్నాజ్ కౌర్ సంధు.. ప్రస్తుతం భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు బరిలో నిలిచింది. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకునేందుకు ఆరాటపడుతుంటే... భారతీయులందరూ మిలీనియం గర్ల్ మిస్ యూనివర్స్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మిలీనియం గర్ల్ 21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది ‘మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా’ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ రెండు టైటిల్స్ గెలుచుకున్న తరువాత...2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్–12 జాబితాలో నిలిచింది. ఇదే ఏడాది “మిస్ ఇండియా పంజాబ్‌గా’కూడా నిలిచింది. మంచి పాపులారిటీ రావడంతో ద ల్యాండర్స్ రూపొందించిన మ్యూజిక్ వీడియో “తార్తల్లి’లో నటించింది. ఆ తరువాత అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ దివా యూనివర్స్ ఇండియా–2021’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్కిన్, మిస్ బీచ్ బాడీ, మిస్ బ్యూటీఫుల్, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ ఫోటోజెనిక్, మిస్ టాలెంటెడ్‌గా నిలిచింది. ఈ కిరీటం ద్వారానే ‘మిస్ యూనివర్స్–2021కు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది హర్నాజ్. నటిగానూ.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెబుతోన్న హర్నాజ్ కిరీటాన్ని సాధించాలని ఆశిద్దాం. -
ముఖచిత్ర మకుటం
మూడేళ్ల వయసులో తల్లి అడిగింది. ‘బేబీ.. సిక్ అయిన వాళ్లకు నువ్వెలా నయం చేస్తావ్?’ అని. ‘మ్యూజిక్ వినిపిస్తాను’ అంది గీతాంజలి! పియానో చక్కగా ప్లే చేస్తుంది ఇప్పటికీ తను. గీతాంజలికి ఇప్పుడు పదిహేనేళ్లు. మ్యూజిక్లోంచి సైన్స్ చేసే మ్యాజిక్‌లోకి వచ్చేసింది. సైంటిస్ట్, ఇన్వెంటర్ తనిప్పుడు! స్కూల్‌కి వెళ్లొస్తూనే ప్రపంచాన్ని మలుస్తోంది. భూగోళంపై ఎన్నో సమస్యలు. వాటి పరిష్కారానికి ఒక టీమ్‌ని నిర్మిస్తానంటోంది.. ఈ ‘టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్’. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టైమ్’ పత్రిక తరచు కొన్ని ప్రత్యేకమైన ముఖచిత్రాలతో వెలువడుతుంటుంది. ఈ సోమవారం మరింత ప్రత్యేకమైన ముఖచిత్రంతో కొత్త సంచిక మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఆ ప్రత్యేకత ‘టైమ్’ పత్రిక వల్ల ఆ ముఖచిత్రానికి వచ్చింది కాక, ముఖచిత్రం వల్ల టైమ్ పత్రికకు వచ్చినది! ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా పదిహేనేళ్ల భారతీయ బాలిక గీతాంజలీరావును ‘టైమ్’పత్రిక ఎంపిక చేయడమే అందుకు కారణం. ‘టైమ్’ కే ఒక కిరీటం అయినట్లుగా ముఖచిత్రంపై ఆత్మవిశ్వాసపు దృక్కులతో మందస్మిత గంభీరంగా కూర్చొని ఉంది చిన్నారి గీతాంజలి. ఆన్లైన్లో గీతాంజలితో ఏంజెలీనా. ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌తో ‘టైమ్’ ఇలా ఒక ముఖచిత్రాన్ని వెయ్యడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది చిన్నారుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించి, విశ్లేషించి, వడపోసి గీతాంజలిని ఎంపిక చేసింది టైమ్. గీతాంజలి కొన్ని సామాజిక, నిత్యజీవితావసరాల్లో మిళితమై ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టింది. అవే ఆమెను తక్కిన చిన్నారుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘‘ప్రపంచాన్ని ఎవరైతే మలుచుతారో వారిదే ఈ ప్రపంచం. ప్రపంచం ఏ విధమైన అస్థిరతలో ఉన్నా, అందుకొక పరిష్కారాన్ని చూపే చిన్నారులు ప్రతి తరంలోనైనా ఉంటారు’’ అని టైమ్ వ్యాఖ్యానించింది. ∙∙ గీతాంజలిని ‘టైమ్’ పత్రిక.. సైంటిస్ట్, ఇన్వెంటర్ అని పేర్కొంది. అయితే సైంటిస్టుగా, ఇన్వెంటర్‌గా నేరుగా ల్యాబ్‌లోకి వెళ్లి కూర్చోలేదు గీతాంజలి. మొదట ఆమెక్కొన్ని ఆలోచనలు వచ్చాయి. మంచినీటి కాలుష్యాన్ని తగ్గించడం, కలుషిత కారకాలు అసలే లేకుండా చేయడం మొదటి ఆలోచన. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన ఆలోచన అది. స్కూలు పిల్లల్లో ‘సైబర్ బుల్లీయింగ్’ను కనిపెట్టి ‘ఎడిట్’ చెయ్యడం పన్నెండేళ్ల వయసు లో ఆమెకు వచ్చిన రెండో ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్యలో అనేక ఆలోచనలు చేసింది గీతాంజలి. ‘టెడ్ఎక్స్ టాక్’ షో లో గీతాంజలితో బాలీవుడ్ షారుక్‌ఖాన్ (గత ఏడాది) వీటన్నిటినీ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నియంత్రించే పద్ధతుల్ని కనిపెట్టింది! తాగు నీటిలో ఉండే సీసం ఆరోగ్యానికి హాని చేసే రసాయన మూలకం. సీసం ప్రకృతి సిద్ధంగానే నీటిలో కలిసి ఉంటుంది. అయితే మోతాదుకు మించి ఉంటే ప్రమాదం. ఎలా తెలుస్తుంది మనకు, మన తాగే నీటిలో సీసం ఎంత ఉందన్నది?! దాన్ని తెలుసుకునేందుకు గీతాంజలి ‘టెథిస్’ అనే పరికరాన్ని కనిపెట్టింది! అసలైతే తాగునీటిలో సీసం సున్నా శాతం ఉండాలి కానీ, అది సాధ్యం కాదు కనుక పాయింట్ 24 మైక్రో మోలార్స్ కంటే మించకుండానైతే చూసుకోవాలి. టెథిస్‌తో అలా చూసుకోవడం, జాగ్రత్త పడటం సాధ్యమౌతుంది. బావికో, చెరువుకో వెళ్లి మంచినీళ్లను తోడుకునో, నింపుకునో తెచ్చుకునే కాలం నుంచి, ప్లాంట్ల నుంచి కొనుక్కునే కాలం లోకి ఏనాడో వచ్చిపడ్డాం. నీటిని అమ్మే పెద్ద పెద్ద ప్లాంట్ల వాళ్లు నీటి నుంచి సీసాన్ని తొలగించామనే చెబుతారు. అయితే నిజంగానే తొలగించారా, ఏ మేరకు తొలగించారు అని గీతాంజలి కనిపెట్టిన టెథిస్‌తో తెలుసుకోవచ్చు. టెథిస్ను క్యాన్లలోని నీటికి తాకిస్తే చాలు. మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న సెన్సర్ ద్వారా ఆ నీటిలో సీసం ఎంత మోతాదులో ఉన్నదీ డిస్ప్లే అవుతుంది. యు.ఎస్.లోని కొలరడోలో ఉంటున్న గీతాంజలికి ఈ ‘టెథిస్’ థాట్ 2014లో వచ్చింది. ఆ యేడాది మిషిగాన్‌లోని ఫ్లింట్ సిటీలో పురాతన కాలం నాటి పైపుల నుంచి సీసం నిల్వలు వచ్చి తాగునీటిలో కలవడంతో అనేకమంది జబ్బునపడటం ఆ చిన్నారిలో ఆలోచనలు రేపింది. అలాగే ‘సైబర్ బుల్లీయింగ్’పై నిఘాకు గీతాంజలి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను కనిపెట్టడానికి కూడా స్కూల్లో తను చూసిన సంఘటనలే ప్రేరణ. లావుగా ఉన్నారని, పీలగా ఉన్నారని, బ్లాక్ పీపుల్ అని ఇలా సాటి విద్యార్థులను ఏడిపించేవారి నుంచి మనసు గాయపడకుండా తప్పించుకోవడం కోసం ‘కైండ్లీ’ అనే ఒక యాప్‌ను, క్రోమ్ ఎక్స్టెన్షన్ అనుసంధానం చేస్తూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వృద్ధి చేసింది! ప్రధానంగా ఈ రెండు ఆవిష్కరణలు గీతాంజలిని ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిపాయి. ∙∙ గీతాంజలి తల్లిదండ్రులు ఉండేది కొలరడోలోని ‘లోన్ ట్రీ’ ప్రాంతంలో. గీతాంజలి అక్కడే పుట్టింది. ప్రస్తుతం అక్కడి ‘స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచ్’లో చదువుతోంది. బాల్యం నుంచే తనకు కొత్తకొత్త విషయాలను కనుక్కోవడం పై ఆసక్తి. కనుక్కునే అవసరాన్ని మాత్రం ఆమె చూసిన నిజ జీవిత ఘటనలు కలిగించాయి. జెనిటిక్స్ ఇంజినీరింగ్ చదువుతానని అంటోంది. వ్యసనాల మీద, ఉద్యోగాలలో స్త్రీ, పురుష వేతనాల్లోని వ్యత్యాసాల మీద ఈ వయసుకే ప్రసంగాలు కూడా ఇచ్చింది! ‘‘సమాజాన్ని అన్ని విధాలా ఆరోగ్యవంతంగా పునర్నిర్మించగల జ్ఞానం, వివేకం ఉన్న చిన్నారులే ఈ భూగోళం భవిష్యత్తు’’ అని టైమ్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచిన సందర్భంగా గీతాంజలిని ఇంటర్వ్యూ చేసిన నటి ఏంజెలీనా జోలీ ఆమెను ప్రశంసిస్తూ అన్నారు. మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది గత ఏడాది కూడా ఇదే సమయానికి గీతాంజలి వార్తల్లో ఉంది. నవంబర్ 2 న షారుక్ ఖాన్ బర్త్‌డే. అదే రోజు స్టార్ ప్లస్‌లో ‘టెడ్ టాక్స్ ఇండియా సీజన్ 2 – నయీ బాత్ ప్రీమియర్ మొదలైంది. ‘డోంట్ కిల్ ఐడియాస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ టెక్నాలజీ–ఎంటర్టైన్మెంట్–డిజైన్ (టి.ఇ.డి) టాక్ షో ప్రసారం అవుతుంటుంది. ఆ షోకి వ్యాఖ్యాత షారుక్‌ఖాన్. ఆ రోజు గెస్ట్ స్పీకర్ గీతాంజలీరావు. అవును స్పీకర్! అలా అమెరికాలో ఉన్న గీతాంజలికి ముంబైలో ఉన్న షారుక్ ఖాన్‌ను కలిసే అవకాశం వస్తే, ముంబైలో ఉన్న షారుక్‌కు అమెరికాలో ఉండే గీతాంజలిని కలిసే అవకాశం వచ్చింది. నిజంగా అవకాశంలానే ఫీల్ అయ్యారు షారుక్. ఆమె కనిపెట్టిన టెథిస్ పరికరం గురించి విని చాలా సంతోషపడిపోయారు. ‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’ అని ప్రశంసించారు. టెథిస్ అంటే స్వచ్ఛమైన జలం అని అర్థం. గ్రీకుపురాణాల్లోని ఒక సముద్రం పేరు కూడా. ‘నా పిల్లలకీ చెబుతాను’ గీతాంజలి టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అవగానే హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ టైమ్ తరఫున గీతాంజలిని ఇంటర్వ్యూ చేశారు. ప్రధానంగా ఆమె ‘సైబర్ బుల్లీయింగ్’ని అడ్డుకునేందుకు గీతాంజలి కనిపెట్టిన ‘కైండ్లీ’ యాప్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ ఫోన్ టెక్స్టింగ్లో బుల్లీయింగ్ని సూచించే పదాలను గీతాంజలి రూపొందించిన యాప్ డిలీట్ చేసి, ఆ తర్వాతే సెండ్ చేస్తుంది. అలా అప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వయసు పిల్ల అంత టెక్నాలజీని కనిపెట్టడం ఏజెలీనాకు మురిపెంగా అనిపించింది. ‘అయితే ఈ యాప్ గురించి నా పిల్లలకీ చెబుతాను’ అని ఆమె అన్నారు. ‘నీ లక్ష్యం ఏమిటì గీతాంజలీ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘భూగోళంపై సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపెట్టే ఒక యంగ్ టీమ్‌ని నిర్మించడం’’ అని చెప్పింది గీతాంజలి. -
ఆమె వాలెట్‌ను అప్పగించిన పాక్ డ్రైవర్..
దుబాయ్ : ఓ భారత విద్యార్థినికి పాకిస్తాన్ టాక్సీ డ్రైవర్ సాయం చేశాడు. ఆమె పోగొట్టుకున్న వాలెట్‌ను తిరిగి ఇచ్చి.. ఇబ్బంది పడకుండా ఆదుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాచెల్ రోజ్ విద్యార్థిని కుటుంబం దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే డిగ్రీ పూర్తిచేసిన రోజ్.. ప్రస్తుతం యూకేలోని లాంకాస్టర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల హాలీడే కోసం దుబాయ్ వచ్చిన రోజ్.. అక్కడ ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. జనవరి 4వ తేదీన బుర్జుమాన్ దగ్గర్లో సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో రోజ్ ఫ్రెండ్‌తో కలిసి పాకిస్తాన్‌కు చెందిన ఖాదీమ్ టాక్సీ ఎక్కారు. అయితే అదే సమయంలో మరో కారులో వారి స్నేహితులు ఉండటం చూసిన రోజ్.. వెంటనే కారులో నుంచి దిగిపోయారు. వారి వద్దకు వెళ్లే తొందరలో తన వాలెట్‌ను ట్యాక్సీలో మరిచిపోయారు. రోజ్ వాలెట్లో ఎమిరేట్స్ ఐడీ, యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, క్రెడిట్ కార్డు, కొంత మొత్తంలో డబ్బులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత తన వాలెట్ పోగొట్టుకున్న సంగతి గుర్తించిన రోజ్ ఆందోళన చెందారు. తిరిగి యూకేకు వెళ్లే సమయం దగ్గర పడటంతో (జనవరి 8) ఆమె ఒత్తిడికి లోనయ్యారు. అంతేకాకుండా 13న ముఖ్యమైన పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే రోజ్ వద్ద కనీసం వీసాకు సంబంధించిన కాపీ కూడా లేకపోవడంతో ఆమె యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అధికారులు మాత్రం.. తిరిగి వీసాకు దరఖస్తు చేసుకోవాల్సిందిగా రోజ్‌కు సూచించారు. దీంతో రోజ్ తన వాలెట్ కోసం పోలీసులను ఆశ్రయించారు. రోజ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె కారు ఎక్కిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. అయితే రోజ్ ఎక్కిన కారు నెంబర్‌ను మాత్రం సరిగా గుర్తించలేకపోయారు. రోజ్ కారు ఎక్కి.. వెంటనే దిగిపోవడంతో డ్రైవర్ మీటర్‌ను స్టార్ట్ చేయలేదు. దీంతో ఆర్టీఏ కాల్ సెంటర్ ద్వారా డ్రైవర్ ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఆమె వాలెట్‌ను గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు రోజ్ దిగిపోయిన తరువాత ఖాదీమ్ రెండు ట్రిప్పులు పూర్తి చేశాడు. ఆ తర్వాత కారులో వాలెట్‌ను గుర్తించిన అతడు.. దానిని ఓపెన్ చేసి చూశాడు. కానీ అందులో రోజ్‌ను సంప్రదించడానికి అవసరమైన ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆర్టీఏ కాల్‌సెంటర్‌కు కాల్ చేసిన ఖాదీమ్.. తనకు లభించిన వాలెట్లోని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆమె అడ్రస్ కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో అది సాధ్యపడలేదు. ఇందుకోసం ఇతర విభాగం అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాలని భావించాడు. కానీ మరో ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సూచన మేరకు ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాడు. అయితే అవన్నీ విఫలం అయ్యాయి. చివరకు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆర్టీఏ కాల్ సెంటర్ నుంచి ఖాదీమ్‌కు ఫోన్ వచ్చింది. అతడు చెప్పిన వివరాలు.. తమకు వచ్చిన ఫిర్యాదుకు సరిపోలడంతో ఆర్టీఏ కాల్ సెంటర్ అధికారులు అతనికి రోజ్ అడ్రస్ చెప్పారు. దీంతో ఖాదీమ్ వాలెట్‌ను రోజ్‌కు అందజేశాడు. తన కుమార్తె వాలెట్ తిరిగి లభించడంతో ఆనందంతో రోజ్ తండ్రి ఖాదీమ్‌కు 600 దినార్లు ఇవ్వగా తిరస్కరించాడు. రోజ్‌ను సోదరిగా భావించి ఆ డబ్బును తీసుకోలేదని ఖాదీమ్ తెలిపారు. అయితే రోజ్ కుటుంబం ఖాదీమ్‌ను అభినందిస్తూ.. ఆర్టీఏకు లేఖ రాసింది. -
పక్కా దేశీ పేరెంట్స్ అనిపించుకున్నారుగా..!
ఎంత మోడ్రన్‌గా ఉన్నా.. ఆధునికంగా ఆలోచించినప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్ పేరెంట్స్ మార్పు అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. మద్యపానం మగవారికి మాత్రమే అని ఏళ్లుగా నమ్ముతున్న సమాజం మనది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతన్నప్పటికి నేటికి మన సమాజంలో నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒక వేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్ ఇలా ఉంటుందంటన్నారు మిషా మాలిక్. కొలంబియాలో నివసిస్తున్న మిషా మాలిక్ రెండు రోజుల క్రితం తన ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా మద్యం సేవిస్తూంటుంది. మరో వైపు మిషా తల్లి.. కూతుర్ని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. ‘ఇది జరిగాక మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్ చేశారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ‘ఇండియన్ పేరెంట్స్ అంటేనే ఓవర్ కేరింగ్ అని నిరూపించుకున్నారం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. It was at this moment that my parents decided they were sending me back to India pic.twitter.com/MQ64wuYESO — Misha Malik (@MishaMalik138) March 18, 2019 -
పాటలతో గిన్నిస్ బుక్కులోకి..
దుబాయ్: అసమాన ప్రతిభకనబరిస్తేనే గిన్నిస్ బుక్‌లో చోటు దక్కుతుంది. అందుకే తన వయసు 12 ఏళ్లే అయినా.. ఏకంగా 85 భాషల్లో పాటలు పాడి, గిన్నిస్బుక్కులో చోటుదక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది సుచేతా సతీష్. దుబాయ్‌లోని ఇండియన్ హైస్కూల్లో ఏడోతరగతి చదువుతున్న భారతీయ బాలిక సుచేత డిసెంబరు 29న ఈ రికార్డుపాట పాడనుంది. ఇప్పటికే ఎనభై భాషలలో పాడడం నేర్చుకుందట. వీటిని నేర్చుకోవడానికి అమెకు ఒక సంవత్సరం పట్టిందట. అయితే డిసెంబరు 29 నాటికి మరో ఐదు భాషల్లో పాడడం నేర్చుకొని, 85 భాషల్లో పాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలోనే పుట్టిపెరిగిన సుచేతాకు హిందీ, మళయాలం , తమిళం వచ్చు. అంతేగాక స్కూల్లో జరిగే పోటీల్లో ఇంగ్లిష్‌లో పాటలు పాడేదట. ఈ సందర్భంగా సుచేతా మాట్లాడుతూ... ‘నా మొదటి పాట జపాన్ భాషలోనిది. మా నాన్నగారి స్నేహితురాలు జపాన్‌కు చెందిన డెర్మాటాలజిస్ట్. రోజు నా స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు నేను ఆమె దగ్గర జపనీస్ సాంగ్ నేర్చుకున్నాన’ని తెలిపింది. సాధారణంగా తనకు ఒక పాట నేర్చుకోవడానికి రెండు గంటల సమయం పడుతుందని, ఒక వేళ సులభంగా పలకగలిగితే దానిని అర్ధగంటలో నేర్చుకోగలనని చెబుతోంది. ప్రెంచ్, హంగేరియన్, జర్మన్ భాషలు తనకు బాగా కష్టంగా అనిపించాయని, అయినా ఆ భాషల్లో కూడా పాటలు పాడుతున్నానని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేశిరాజు శ్రీనివాస్ 2008లో 76 భాషలలో పాటలు పాడిన రికార్డుకు ఇప్పటిదాకా గిన్నిస్ బుక్కులో చోటుంది. ఆ రికార్డును చెరిపేసి, తనపేరిట సరికొత్త రికార్డును నెలకొల్పుతానని సుచేత నమ్మకంగా చెబుతోంది. -
భారత సంతతి బాలికకు య్ంగ్ సైంటిస్ట్ అవార్డు
-
భారతీయ బాలికకు అంతర్జాతీయ అవార్డు
హేగ్: యూఏఈకి చెందిన పదహారేళ్ల భారతీయ బాలికకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. వాతావరణ సమన్యాయం, పర్యావరణ క్షీణతపై చేసిన పోరాటానికి గాను పర్యావరణ కార్యకర్త కెహకాషన్ బసును ఈ అవార్డు వరించింది. నెదర్లాండ్స్‌లోని హేగ్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతూ పర్యావరణ సంబంధిత వ్యాధులతో ప్రతి ఏటా ముప్ఫై లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తున్నారని, పర్యావరణ సమస్యలతో చాలామంది బాలలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో పర్యావరణ సమస్యలపై పోరాడే కెహకాషన్ బసు వంటివారి అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా, సురక్షితంగా ఎదిగేందుకు చక్కటి పర్యావరణం అవసరమని.. ఇది వారి హక్కు అని అన్నారు. ఈ హక్కు కోసం కెహకాషన్ బసు పోరాటం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. బాలల స్థిరమైన భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మావంటి వారందరిపై ఉందని బసు చాటిచెప్పిందన్నారు. ఈ సందర్భంగా బసు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పురస్కారం కోసం 49 దేశాల నుంచి 120 నామినేషన్లు రాగా.. అందులో గ్రీన్‌హోప్ వ్యవస్థాపకురాలైన బసు ఎంపిక కావడం విశేషం. ఆమ్స్టర్డామ్కు చెందిన గ్లోబల్ చిల్డ్రన్స్ ఎయిడ్ గ్రూప్ ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని 2005 నుంచి నిర్వహిస్తోంది. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ప్రవాస బాలిక
దుబాయ్: ప్రతిష్టాత్మక బాలల శాంతి బహుమతి రేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారత సంతతి బాలిక కేకాషణ్ బసు(16) నిలిచింది. బాలల హక్కులు, స్థితిగతులు మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు రేసులో ఉన్న తుది ముగ్గురిలో ఆమె కూడా నిలిచింది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా 120 ఎంట్రీలు వచ్చాయి. ఆదివారం(నవంబర్ 20) ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. తుది పోటీలో ఉన్న ముగ్గురూ బాలల హక్కుల కోసం పోరాటాలు చేశారు. ప్రతీ యేటా ఈ అవార్డు గ్రహీతలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల ముందు తమ సందేశం వినిపించే అవకాశం లభిస్తుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డును 2006 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ అందించనున్నారు. ఈ కార్యక్రమం హేగ్‌లోని హాల్ ఆఫ్ నైట్స్‌లో జరగనుంది. కేకాషణ్ బసు ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించింది. 2012లో ‘గ్రీన్ హోప్’ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా చెత్త సేకరణ, బీచ్‌లను శుభ్రం చేయడం, అవగాహనా సదస్సులను నిర్వహించడం వంటివి చేస్తుండేది. ఆమె ఇంతకు ముందు ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంది. -
పాపం.. అమెరికాకు వెళ్లిన మూడునెలలకే
న్యూయార్క్: అమెరికాలో భారత్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆశదీప్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. న్యూయార్క్‌లోని ఇంట్లో ఈ అమ్మాయి బాత్‌టబ్‌లో శవమై కనిపించింది. పోలీసులు కౌర్ సవతి తల్లి అర్జున్ పర్దాస్పై హత్యకేసు నమోదు చేశారు. ఆశదీప్ మృతదేహంపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పర్దాస్ (55) చిన్నారి గొంతునులిమి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆశదీప్కు స్నానం చేయించేందుకు పర్దాస్ బాత్రూమ్కు తీసుకెళ్లిందని, తర్వాత ఆమె మాత్రమే బయటకు వచ్చిందని ఇంట్లోఉన్నవారు చెప్పారు. ఎంతసేపటికీ ఆశదీప్ బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చి బాత్రూమ్కు వెళ్ల చూడగా, మృతదేహం కనిపించిందని తెలిపారు. ఆ తర్వాత పర్దాస్ అక్కడి నుంచి పారిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆశదీప్ మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లింది. ఆ అమ్మాయి తల్లి భారత్‌లోనే ఉంటోంది. కాగా ఆశదీప్ తల్లి, తండ్రి సుఖ్జిందర్ సింగ్ విడాకులు తీసుకున్నారు. న్యూయార్క్‌లో సుఖ్జిందర్ రెండో భార్య పర్దాస్తో కలసి ఉంటున్నాడు. ఇదే ఇంట్లో మరో జంట నివస్తోంది. సవతి తల్లి దగ్గర ఉండటం ఆశదీప్కు ఇష్టం ఉండేదికాదని బంధువులు చెప్పారు. పర్దాస్ ఎప్పుడూ కొడుతుందని, చిత్రహింసలు పెడుతుందని ఆశదీప్ చెప్పిందని తెలిపారు. -
హమ్మయ్య.. భారత చిన్నారి దొరికింది
మనామా: బహ్రెయిన్ లో భారత బాలిక కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఐదేళ్ల సారా ను కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు విడిపించడంతో 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం రాత్రి హూరా ప్రాంతంలో చిన్నారిని కిడ్నాప్ చేశారు. సారాను కారులో ఉంచి తల్లి మంచినీళ్ల బాటిల్ కొనుక్కురావడానికి వెళ్లగా దుండగులు కారుతో పాటు చిన్నారిని ఎత్తుకుపోయారు. సారా తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పాపను విడిపించారు. నిందితులు బహ్రెయిన్ వ్యక్తి(38), ఆసియా మహిళ(37)గా వెల్లడించారు. వారి పేర్లు చెప్పలేదు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిచామని, 25 పహారా వాహనాలను రంగంలోకి దింపి కిడ్నాపర్లను పట్టుకున్నామని కాపిటల్ గవర్నేట్ పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది తెలిపారు. హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించామని చెప్పారు. సారాకు ఎటువంటి ముప్పు తలపెట్టలేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఆమె మేనమామ అనిశ్ చార్లెస్ తెలిపాడు. హూరా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి పాపను తమకు అప్పగించారని చెప్పారు. తల్లిని చూడగానే సారా పరిగెత్తుకుని వెళ్లి ఆమెను అమాంతంగా కౌగిలించుకుంది. కూతుర్ని తల్లి గుండెలకు హత్తుకున్న దృశ్యాలు అక్కడున్న వారిని కదిలించాయి. సారా కిడ్నాప్ వెనుక ఆమె తండ్రి హస్తం ఉందని అనీశ్ చార్లెస్ అనుమానం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న సారా తండ్రి ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. వీరిద్దరికీ సారా ఒక్కతే సంతానం. కాగా, సారా కిడ్నాప్ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. చిన్నారిని సురక్షితంగా విడిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
నిలబడడం కోసం చావడానికైనా రెడీ
-
గీత వచ్చేసింది
-
భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు
తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో 14 ఏళ్ల భారతీయ బాలికను చంపేశాడో పాకిస్థానీ కుర్రాడు. అతడి వయసు కూడా 14 ఏళ్లే. ఈ దారుణం దుబాయ్‌లో జరిగింది. ఆమెను చంపిన తర్వాత ఆత్మాహుతి చేసుకున్నాడు. బాలిక తల్లి ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఆ కుర్రాడు బాలిక ఉండే ఫ్లాట్‌కు వెళ్లాడు. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఆమెను కత్తితో పొడిచి పొడిచి చంపేసిన తర్వాత.. ఇద్దరి మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ ఫ్లాట్ లోని బెడ్రూం మొత్తం కూడా తగలబడిపోయింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వాళ్ల బంధువులకు అందిస్తామని పోలీసులు చెప్పారు. గదిలో ద్రవ ఇంధనం ఉందని అంటున్నారు. ఆ బాలిక మంచి డాన్సర్ కావాలని అనుకునేదని, ప్రముఖ భారతీయ నృత్యబృందంలో ఆమె సభ్యురాలని తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!
భారత దౌత్యవేత్త కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేసి, ఆమెను ఒకరోజు జైల్లో కూడా పెట్టిన అమెరికన్ అధికారులు.. ఆమెకు నష్టపరిహారంగా రూ. 1.4 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. టీచర్‌కు అసభ్య ఈమెయిళ్లు పంపిందన్న అనుమానంతో కృతికా బిశ్వాస్ అనే బాలికను స్కూలు నుంచి సస్పెండ్ చేయడమే కాక, ఒకరోజు జైల్లో కూడా పెట్టారు. దాంతో ఆమె న్యూయార్క్ నగర అధికారుల మీద, విద్యాశాఖ మీద కోర్టులో కేసు పెట్టింది. ఇదంతా 2011లో జరిగింది. దీనిపై విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కోల్టెల్ అధికారులను ఆమెకు పూర్తి సంతృప్తి కలిగేలా 1.4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో కేసులన్నింటినీ ఉపసంహరించుకునేందుకు బిశ్వాస్ అంగీకరించారు. కృతికా బిశ్వాస్కు, భారత దౌత్యవేత్తలకు, భారతదేశానికి పరువుకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు కోర్టు అధికారులను మందలించినట్లు బిశ్వాస్ న్యాయవాది రవి బాత్రా తెలిపారు. బిశ్వాస్ చాలా గౌరవప్రదమైన విద్యార్థిని అని సెటిల్మెంట్ సమయంలో అధికారులు పేర్కొన్నారు. తనకు ఇన్నాళ్లు అండగా నిలబడినందుకు భారత అమెరికన్ సమాజం, మాజీ రాయబారులు ప్రభు దయాళ్, మీరాశంకర్, మాజీ క్లాస్మేట్లు, టీచర్లు.. అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. -
ఎవరెస్ట్ వీరులులకు అభినందనలు
-
ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు తేజాలు