పాపం.. అమెరికాకు వెళ్లిన మూడునెలలకే | Indian girl found dead in US, step-mother charged with murder | Sakshi
Sakshi News home page

పాపం.. అమెరికాకు వెళ్లిన మూడునెలలకే

Published Sun, Aug 21 2016 3:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

పాపం.. అమెరికాకు వెళ్లిన మూడునెలలకే - Sakshi

పాపం.. అమెరికాకు వెళ్లిన మూడునెలలకే

న్యూయార్క్: అమెరికాలో భారత్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆశదీప్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. న్యూయార్క్లోని ఇంట్లో ఈ అమ్మాయి బాత్టబ్లో శవమై కనిపించింది. పోలీసులు కౌర్ సవతి తల్లి అర్జున్ పర్దాస్పై హత్యకేసు నమోదు చేశారు.

ఆశదీప్ మృతదేహంపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పర్దాస్ (55) చిన్నారి గొంతునులిమి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆశదీప్కు స్నానం చేయించేందుకు పర్దాస్ బాత్రూమ్కు తీసుకెళ్లిందని, తర్వాత ఆమె మాత్రమే బయటకు వచ్చిందని ఇంట్లోఉన్నవారు చెప్పారు. ఎంతసేపటికీ ఆశదీప్ బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చి బాత్రూమ్కు వెళ్ల చూడగా, మృతదేహం కనిపించిందని తెలిపారు. ఆ తర్వాత పర్దాస్ అక్కడి నుంచి పారిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  

ఆశదీప్ మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లింది. ఆ అమ్మాయి తల్లి భారత్లోనే ఉంటోంది. కాగా ఆశదీప్ తల్లి, తండ్రి సుఖ్జిందర్ సింగ్ విడాకులు తీసుకున్నారు. న్యూయార్క్లో సుఖ్జిందర్ రెండో భార్య పర్దాస్తో కలసి ఉంటున్నాడు. ఇదే ఇంట్లో మరో జంట నివస్తోంది. సవతి తల్లి దగ్గర ఉండటం ఆశదీప్కు ఇష్టం ఉండేదికాదని బంధువులు చెప్పారు. పర్దాస్ ఎప్పుడూ కొడుతుందని, చిత్రహింసలు పెడుతుందని ఆశదీప్ చెప్పిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement