
ఎంత మోడ్రన్‌గా ఉన్నా.. ఆధునికంగా ఆలోచించినప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్ పేరెంట్స్ మార్పు అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. మద్యపానం మగవారికి మాత్రమే అని ఏళ్లుగా నమ్ముతున్న సమాజం మనది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతన్నప్పటికి నేటికి మన సమాజంలో నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒక వేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్ ఇలా ఉంటుందంటన్నారు మిషా మాలిక్.
కొలంబియాలో నివసిస్తున్న మిషా మాలిక్ రెండు రోజుల క్రితం తన ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా మద్యం సేవిస్తూంటుంది. మరో వైపు మిషా తల్లి.. కూతుర్ని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. ‘ఇది జరిగాక మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్ చేశారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ‘ఇండియన్ పేరెంట్స్ అంటేనే ఓవర్ కేరింగ్ అని నిరూపించుకున్నారం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
It was at this moment that my parents decided they were sending me back to India pic.twitter.com/MQ64wuYESO
— Misha Malik (@MishaMalik138) March 18, 2019