ఇటీవల పెళ్లి వేడుకల్లో మద్యం తాగి వచ్చిన పెళ్లి కొడుకులు సృష్టించిన హంగామా గురించి విన్నాం. దీంతో అర్థంతరంగా పెళ్లిళ్లు ఆగిపోయి లబోదిబోమన్న వారిని చూశాం. వాటికి భిన్నంగా ఇక్కడొక నవ వధువు మద్యం తాగి పోలిస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. వారు ఎంతగా కంట్రోల్ చేసేందుకు యత్నించినా ఆగకపోగా నేను రెండో పెళ్లి చేసుకుంటా అంటూ అరుస్తూనే ఉంది.
అసలేం జరిగిందంటే.. మద్యం మత్తులో ఉన్న ఒక నవ వధువు పోలిస్ స్టేషన్‌కి వెళ్లి పెద్ద హంగామా సృష్టించింది. రెండో పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. నాకు రెండో పెళ్లి కావాలి అంటూ స్టేషన్‌లోని కాగితాలను, ఫోన్‌లను విసిరేసింది. చివరికి ఓ లేడి కానిస్టేబుల్ అదుపు చేసి గదిలోకి లాక్కెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు మొదటి పెళ్లి ఆమెకు బాధ కలిగించిందేమో! అందుకే ఇలా చేసిందని ఒకరూ, ఆ అమ్మాయి చాలా ఆవేదనలో ఉందని మరొకరు కామెంట్లు చేశారు. తప్పతాగి ఇలా చేయడమేంటని మరొక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
"Do shaadi karenge Do Shaadi"
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 30, 2023
Woman demands marriage with lover soon after her wedding with a man
Police watches as mute spectators
Feeling so bad for her Husband
EQUALITY ! pic.twitter.com/S6zbiqE731
(చదవండి: కాఫీ షాప్ పార్కింగ్ ఆఫర్..రూ 60 కోసం పదేళ్లు పోరాడి గెలిచాడు)
Comments
Please login to add a commentAdd a comment