
అమ్మాయిలకు తయారవ్వడానికి మించిన పెద్ద పని మరొకటి ఉండదు. అందరిలోనూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అందరికంటే ముందు రెడీ అవ్వడం మొదలు పెట్టినా.. చివరి వరకు కూడా మెరుగులు దిద్దుతూనే ఉంటారు.. జనరల్‌గానే అమ్మాయిలకురెడీ అవ్వడమంటే పిచ్చి.. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎంతలా తయారవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం రెడీ అవుతున్న ఓ పెళ్లి కూతురు తన మేకప్ ఆర్టిస్ట్‌తో చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: రిసెప్షన్‌కు వింతైన ఆహ్వానం.. రూ. 7 వేలు తీసుకుని రావాలంటూ ఏకంగా..
అస్మిత అనే యువతి తన పెళ్లి రోజు కావడంతో అందంగా ముస్తాబవుతోంది. ఆమెను మేకప్ ఆర్టిస్ట్ సుందరంగా తీర్చిదిద్దుతున్న సమయంలో పెళ్లికూతురికి ఓ సందేహం వచ్చింది. ‘నేను వేసుకుంది వాటర్ ప్రూఫ్ మస్కరానేనా. ఏడిస్తే మేకప్ చెదిరిపోదు కదా’ అని ప్రశ్నించింది. దీనికి ఆమె అవును అని సమాధానం ఇస్తూ అస్మిత ఏడవాలి కాబట్టి అలా అడుగుతున్నావా అని ప్రశ్నించింది. దీంతో ‘అవును నేను చాలా ఏడ్వాలి’ అని పెళ్లికూతురు క్యూట్‌గా బదులిచ్చింది. అంతేగాక తను చాలా ఏడవాలని, లేకపోతే తన తల్లి కొడుతుందని చెబుతోంది. వరల్డ్ ఆఫ్ బ్రైడ్స్ అనే ఇన్‌స్టా పేజీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
చదవండి: ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment