లండన్ : హోరున తుపాను గాలులు. ఆకాశంలో ఎగురుతున్న విమానం కూడా ఊగిసలాడుతుందంటే.. తుపాను గాలుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు పైలెట్. కానీ కుదరలేదు. మరోవైపు తుపాను గాలులు విమానాన్ని కుదిపేస్తున్నాయి. పరిస్థితి చూసి ముందు భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై తన శాయశక్తుల ప్రయత్నించి.. ఎటువంటి ప్రమాదం లేకుండా విమానాన్ని మరో విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో జరిగింది ఈ సంఘటన. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం హైదరాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ప్రస్తుతం లండన్‌లో ఎరిక్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. హీత్రో విమానాశ్రయానికి చేరుకున్న విమానం మరో రెండు సెకన్లలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ తుపాను గాలులు విమానాన్ని కుదిపేశాయి. పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ కుదరలేదు. దాంతో విమానం రన్‌వేను తాకిన సెకన్ల వ్యవధిలోనే మళ్లీ టేకాఫ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని వేరే విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
We are live now on our Elite Channel from #Heathrow and witnessed this insane #TOGA ! Well done pilot! @British_Airways #BA276 #StormErik pic.twitter.com/WMEvJ4P387
— BIG JET TV (@BigJetTVLIVE) February 8, 2019
బిగ్ జెట్ టీవీ తన ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విమానం ల్యాండింగ్ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.32 మిలియన్ల మంది చూశారు. అయితే.. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం మాత్రం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment