strom
-
అమెరికాను గజగజలాడిస్తున్న బాంబ్ సైక్లోన్
చలికాలంలో వణుకు సహజం. కానీ, ఆ వణుకు ప్రాణంపోయేలా, క్షణాల్లో మనిషిని సైతం గడ్డకట్టించేదిగా ఉంటే!. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం.. తన దేశ పౌరులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలపు తుపాను వేగంగా వస్తున్నందున క్రిస్మస్కు కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్లాలనుకునే అమెరికన్లు వెంటనే బయలుదేరాలని ఆయన హెచ్చరించారు. మంచు తుపాను బలం పుంజుకోవడంతో.. అత్యంత అరుదైన పరిణామం ‘బాంబ్ సైక్లోన్’గా బలపడొచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా మంచు తుపాన్‌తో వణికిపోతోంది. -39(మైనస్) డిగ్రీల సెల్సియస్‌కు మెర్క్యూరీ మీటర్లు పడిపోతున్నాయి. అర్కిటిక్ బ్లాస్ట్.. విపరీతమైన చలిని, హిమపాతాన్ని, చల్లని గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటిదాకా ఐదుగురు మృత్యువాత చెందారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థతి ఎదుర్కొలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలు సైతం మంచు ప్రభావానికి గురికాగా.. క్రిస్మస్పై ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమైనది. మీరు చిన్నప్పుడు చూసిన మంచులాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించేది. చాలా తీవ్రమైన వాతావరణం.. ఓక్లహోమా నుంచి వ్యోమింగ్, మైనే వరకు కొనసాగనుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ దయచేసి స్థానిక హెచ్చరికలను పట్టించుకోవాలని ఒవల్ కార్యాలయం నుంచి జాతిని ఉద్దేశించి బైడెన్ కోరారు. మధ్య అమెరికా నుంచి తూర్పు వైపు వీచే ఈ శీతలగాలుల ప్రభావంతో.. 135 మిలియన్ల(సుమారు పదమూడు కోట్ల మంది) జనాభాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే.. 60 మిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపెట్టింది. బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే.. ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చట. అలాగే గాలి పీడనం 1003 మిల్లీబార్ల నుంచి 968 మిల్లీబార్లకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ . బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాలకు తీసుకొస్తుంది. 1979 నుంచి 2019 మధ్య.. ఉత్తర అమెరికాలో ఏడు శాతం మంచు తుపానులు బాంబ్ సైక్లోన్లుగా మారాయి. 1980లో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించారు. బాంబ్ సైక్లోన్ స్థితి చలికాలంలోనే కాదు.. అరుదుగా సమ్మర్‌లోనూ నెలకొంటుంది. వీటి ప్రభావంతో ఇప్పటిదాకా వందల నుంచి వేల మంది మరణించారు!. బాంబు సైక్లోన్ తుపాను అనేది.. చల్లని గాలుల తీవ్రతను బట్టి ఉంటుంది. దీంతో అమెరికాలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెంపరేచర్లు.. సున్నా కంటే చాలా తక్కువ ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి పడిపోవచ్చు. అంటే.. ఏదైనా సరే నిమిషాల్లో గడ్డకట్టుకుపోతుంది. క్రిస్మస్ తర్వాత నుంచి నెమ్మదిగా మొదలై.. కొత్త సంవత్సరం మొదటిరోజు నాటికి ఈ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. క్రిస్మస్ దగ్గర పడుతున్న వేళ.. ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. కెంచుకీ, జార్జియా, నార్త్ కరోలినా, ఒక్లాహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మేరీల్యాండ్, మిస్సోరీలు.. అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉనన్నాయి. మిన్నెసొటాలో జంట నగరాలు స్నో ఎమర్జెన్సీలను ప్రకటించుకున్నాయి. ఈశాన్య వాతావరణంతో పోలిస్తే.. బాంబ్ సైక్లోన్ ప్రభావం మరీ ఘోరంగా ఉంటుంది. -
న్యూయార్క్‌లో ఇడా తుపాను బీభత్సం
-
అదే జరిగితే ఇంటర్నెట్ బంద్
Solar Super Strom: ‘‘సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం’’ అంటూ గత కొంతకాలంగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం, సైంటిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జులై మధ్యలో ‘సౌర తుపాను’ దాటేసిందన్న కొన్ని మీడియా హౌజ్‌ల కథనాలు.. ఉత్తవేనని తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సౌర తుపాను ముప్పు మాత్రం భూమికి పొంచి ఉందని.. అది జరిగితే మాత్రం ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తోందని చెప్తున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి. ‘సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. ఇది కరోనా మహమ్మారిలాగే విరుచుకుపడొచ్చు’ అని ఆమె చెప్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని అబూ జ్యోతి చెబుతున్నారు. My SIGCOMM talk on the impact of solar superstorms on the Internet infrastructure is now online: https://t.co/L6Nl2Yygcs There were many interesting questions in the Q&A session. Paper: https://t.co/Wsv4RC2pbZ https://t.co/Y9ElvF7fTa — Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) August 29, 2021 సిగ్‌కామ్ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద ఆమె సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం విశేషం. చదవండి: సౌర తుపాన్‌తో అప్పుడు ఆఫీసులు కాలిపోయాయి కరోనా తరహాలోనే.. సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు చూపెడుతుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావొచ్చు అనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేం. ఒక రకంగా ఇది కరోనా మహమ్మారి లాంటిది. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదు. నష్టం కూడా ఊహించినదానికంటే భారీగానే ఉంటుంది అని ఆమె అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా సౌరతుపాను గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చని ఆమె అంటున్నారు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే చెప్తున్నారు. అయితే అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని చెప్తున్నారామె. సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. చదవండి: సౌర తుపాను వేగం ఎంతంటే.. -
గంటకు 16 లక్షల కి.మీల వేగంతో దూసుకొస్తున్న సౌర తుపాను
విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను నేడు లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి సబ్-సోలార్ పాయింట్లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో అందమైన ఖగోళ కాంతి దృశ్యాన్ని చూడనున్నారు. ఈ ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్న ప్రజలు రాత్రి పూట అందమైన అరోరాను చూసే అవకాశం ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం సౌర తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఇంకా రాను రాను దాని వేగం మరింత పెరగనుంది. ఈ సౌర తుఫానుల వల్ల ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం కలగవచ్చని నాసా తెలిపింది. స్పేస్ వెదర్ ప్రకారం, సౌర తుఫానుల కారణంగా భూమి బాహ్య వాతావరణం భారీగా వేడి చెందే అవకాశం ఉంది. ఇది ఉష్ణోగ్రతలు ఉపగ్రహాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇది జిపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే, విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఆటంకం కలుగుతుంది. ఈ సౌర తుపాను వల్ల ట్రాన్స్ ఫార్మర్ లు కూడా పేలే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీన భారీ సోలార్ ఫ్లేర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు. -
తీవ్ర తుపాను దిశగా ‘ఇటా’
మియామీ (యూఎస్): ఇటా తుపాను కరీబియన్‌లోని పలు ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ తుపాను మంగళవారం ఉదయానికి నికరాగ్వా, హోండూరస్ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. నికరాగ్వా, హోండూరస్, జమైకా, కేమన్ ఐలాండ్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 53కు చేరిన టర్కీ భూకంప మృతులు ఇజ్మిర్: టర్కీలోని ఇజ్మిర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 53కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 900 దాటింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కింద దాదాపు 34 గంటలు గడిపిన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పొంచివున్న ‘ఫొని’ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టుగానే ‘ఫొని’ తుపాను తీవ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుపానుగా మారి ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపం నుంచి ఒడిశా వైపు దూసుకెళ్తోంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను సోమవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. మంగళవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఒకటో తేదీ వరకు వాయవ్య దిశగా పయనిస్తూ పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడనుంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా మలుపు తిరిగి ఒడిశా తీరం వైపుగా కదులుతోంది. పెను తుపాను ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అదే తీవ్రతతో కొనసాగనుంది. ఇదే ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేపుతోంది. బంగాళాఖాతంలో మంగళవారం గంటకు 135 నుంచి 160, బుధవారం నుంచి శుక్రవారం (3వ తేదీ) వరకు 160–200 కిలోమీటర్లు, 4వ తేదీన 150–190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఒకటి, రెండు తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో గంటకు 60–85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ ఫొని తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉండనుంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, గురువారం నుంచి ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మే 4వ తేదీ వరకు పెనుగాలుల ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ కూడా హై అలర్ట్ ప్రకటించాయి. సుదీర్ఘ తుపాను.. ఫొని తుపాను ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చడమే కాదు.. దీని వేగం రోజుకో విధంగా ఉంటోంది. నెమ్మది నెమ్మదిగా కదులుతూ మరింత బలం పుంజుకుంటోంది. ఎక్కువ రోజులు సముద్రంలోనే ఉంటూ రోజురోజుకు తీవ్రతను పెంచుకుంటోంది. దాదాపు పది రోజులపాటు కొనసాగుతూ అరుదైన తుపానుగా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుపాను, తీవ్ర తుపానుగాను బలపడుతూ తీరాన్ని దాటతాయి. కానీ, ఈ ఫొని తుపాను అల్పపీడనంగా ఏర్పడిన రెండు రోజుకే తుపానుగా మారి వారం రోజుల పాటు బంగాళాఖాతంలోనే వివిధ రూపాలు మార్చుకుంటూ, బలం పెంచుకుంటూ సూపర్ సైక్లోన్ స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి తుపానులు అత్యంత అరుదని, ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘంగా కొనసాగిన తుపానులు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా అంతటా అప్రమత్తం: ఎల్వీ అంతకు ముందు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తుపాను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. ఇప్పటికే అందరు కోస్తా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేశామని ఆయన తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు, ఫైర్ సర్వీసెస్ తదితర ఏజెన్సీలను అప్రమత్తం చేశామన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా తెలియబరుస్తున్నామని సీఎస్ వివరించారు. కాగా, రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ కింద.. కరువు సహాయ చర్యల కింద రూ.500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఎన్నికల నియామవళితో ఆ నిధులు రాలేదని సీఎస్ చెప్పగా దానికి ఎన్నికల నియామవళి అడ్డురాదని ఆ నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయని కేబినెట్ కార్యదర్శి సిన్హా చెప్పారు. తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా సమీక్ష సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హాకు వివరించారు. ఈ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సిన్హా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలని, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సిన్హా భరోసా ఇచ్చారు. ఈ తుపాను మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నందున తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల నాలుగు తీరప్రాంత రాష్ట్రాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే వారిని తిరిగి తీరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. -
వైరల్ వీడియో: హోరు గాలిలో విమానం
లండన్ : హోరున తుపాను గాలులు. ఆకాశంలో ఎగురుతున్న విమానం కూడా ఊగిసలాడుతుందంటే.. తుపాను గాలుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు పైలెట్. కానీ కుదరలేదు. మరోవైపు తుపాను గాలులు విమానాన్ని కుదిపేస్తున్నాయి. పరిస్థితి చూసి ముందు భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై తన శాయశక్తుల ప్రయత్నించి.. ఎటువంటి ప్రమాదం లేకుండా విమానాన్ని మరో విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో జరిగింది ఈ సంఘటన. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం హైదరాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ప్రస్తుతం లండన్‌లో ఎరిక్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. హీత్రో విమానాశ్రయానికి చేరుకున్న విమానం మరో రెండు సెకన్లలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ తుపాను గాలులు విమానాన్ని కుదిపేశాయి. పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ కుదరలేదు. దాంతో విమానం రన్‌వేను తాకిన సెకన్ల వ్యవధిలోనే మళ్లీ టేకాఫ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని వేరే విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. We are live now on our Elite Channel from #Heathrow and witnessed this insane #TOGA ! Well done pilot! @British_Airways #BA276 #StormErik pic.twitter.com/WMEvJ4P387 — BIG JET TV (@BigJetTVLIVE) February 8, 2019 బిగ్ జెట్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విమానం ల్యాండింగ్ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.32 మిలియన్ల మంది చూశారు. అయితే.. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. -
తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి : వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం : తుపాను ప్రభావంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారనీ, తీవ్ర ఆస్తి, పంట నష్టాలు కూడా సంభవించాయనీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మాన నేతృత్వంలో తిత్లీ నష్టంపై కమిటీ తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించారు. భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ శుక్రవారం నుంచి బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తుందని పత్రికా ప్రకటనను జారీ చేశారు. -
ఇటలీ: కుప్పకూలిన పురాతన వంతెన
-
ఒమన్, యెమన్లను గడగడలాడిస్తున్న మెకును తుఫాను
-
కనీవినీ ఎరుగని బీభత్సం
రాజంపేట/ కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్ర వారం రాత్రి వర్ష బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళన లకు గురి చేసింది. ఇలాంటి దుర్ఘటనను తాము గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా వర్షం, ఈదురు గాలుల ధాటికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. 70 మంది గాయాల పాలయ్యారు. అధికారులు, పోలీసులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ముందస్తు చర్యలేవీ? శుక్రవారం సా.7 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు లేకపోవ డంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు.ఎందుకు అప్రమత్తం కాలేకపోయారని ప్రశ్నిం చినట్లు సమాచారం. మరోవైపు ఒంటిమిట్టలో కల్యాణ వేదిక, రామాలయం పరిసర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వల్ల జరిగిన నష్టంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా ఆలయ ధ్వజస్తంభంపైభాగంలో వంకరపోయింది. రామాలయం మూసివేత బలమైన ఈదురుగాలుల ధాటికి రామాల యంలో తాత్కాలిక నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో శనివారం భక్తులకు స్వామివారి దర్శనం సా. 4 గంటల వరకు లేకుండాపోయింది. సంప్రోక్షణ పేరుతో ఆలయ ద్వారాలను మూసివేసిశారు. కోదండ రాముడి ఆలయంలో కూలి పడ్డ చలువ పందిళ్లు తాత్కాలిక నిర్మాణాలవల్లే ప్రాణ నష్టం శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడంపై టీటీడీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో రూ.4.47 కోట్లతో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వత నిర్మాణాల గురించి టీటీడీ పట్టించుకోకపోవడంవల్లే భక్తులు బలి కావాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా వర్ష బీభత్సంవల్ల గాయపడిన వారు కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 80 మంది గాయపడగా, వీరిలో 32మంది కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో కోడల్ని కోల్పోయాం ‘‘నా పేరు సాంబశివరావు. మాది కృష్ణా జిల్లా పెడన మండలంలోని తెలుగుపాలెం. నాతోపాటు నా భార్య అరుణకుమారి, కోడలు ఎం.మీనాతోపాటు ఐదుగురం వచ్చాం. కల్యాణోత్సవంలో స్వామివారిని చూస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయాం. హఠాత్తుగా ఈదరుగాలులు, వర్షం ధాటికి స్తంభాలు నేలకూలాయి. కరెంటు పోయింది. బయట ఉన్న జనమంతా ఒక్కసారిగా లోపలికి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో నా కోడలు మీనా మృతి చెందింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించి తలంబ్రాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లాల్సిన మేము మృతదేహాన్ని తీసుకుని వెళ్లాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నా’’. -
గాలిలో అతలాకుతలమైన విమానాలు..
డసెల్డార్ఫ్(జర్మనీ) : యూరప్‌ను వణికించిన శక్తిమంతమైన తుపాను ఫ్రెడరిక్ ఎట్టకేలకు శాంతించింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలమైన జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీడయంతో దెబ్బతిన్న రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తుపాను ధాటికి తొమ్మిది మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం జరిగింది. వైరల్ వీడియో : ఫ్రెడరిక్ తుపాను సృష్టించిన బీభత్సం తాలుకు వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జర్మనీలోని ప్రఖ్యాత డసెల్డార్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాస్‌విండ్ ల్యాండింగ్ వీడియో ఒకటి వైరల్ అయింది. రన్‌వేపై ల్యాండ్ కావాల్సిన విమానాలు.. గాలిలోనే అతలాకుతలమైన దృశ్యాలను ఓ వీడియో గ్రాఫర్ తన కెమెరాలో చిత్రీకరించాడు. అంత ప్రతికూల పరిస్థితుల్లోనూ చాకచక్యంగా విమానాలను ల్యాండ్ చేసిన పైలట్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వణికిన విమానాలు వీడియో -
పిడుగుపాటుతో ఇద్దరి మృతి
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం తల్లికోట గ్రామ సమీపంలో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పి.గౌరమ్మ (35), పి.దుర్గారావు (40) పిడుగుపాటుతో అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురినీ విశాఖ కేజీహెచ్ తరలించారు. గాయపడ్డ వారి పేర్లు తెలియాల్సి ఉంది. -
తైవాన్‌లో టైఫూన్ బీభత్సం