లండన్: అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. శనివారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఎయిర్‌బస్ A350 విమానాన్ని అనుకోకుండా ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్ అధికారులు తెలిపారు.
Just witnessed a plane crash at Heathrow! A tug pushing back a Virgin 787, crashed the wing into a BA A350 #Heathrow #BritishAirways #VirginAtlantic pic.twitter.com/9VmiP6uwQr
— Alex Whittles (@PurpleFrogAlex) April 6, 2024
ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.
Accident at #heathrow involving a #virginatlantic #boeing787 and a #britishairways #A350 #bigjettv @BigJetTVLIVE pic.twitter.com/Hm5Vh6ehrc
— specialise cyclists (@slaytor_roger) April 6, 2024
Comments
Please login to add a commentAdd a comment