చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది.
వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment