న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.
అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు.
ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment