
దేశీయ అతిపెద్ద ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సరికొత్త ప్రయోగానికి స్వీకారం చుట్టింది. స్విగ్గీ సూపర్ పేరిట కొత్తగా పెయిడ్ మెంబర్‌షిప్ ప్రొగ్రామ్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఈ ప్రొగ్రామ్‌లో భాగంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. రోజుల్లో ఎన్నిసార్లైనా ఉచిత డెలివరీలను, మీ ప్రాంతాల్లో ఉన్న అన్ని రెస్టారెంట్ల నుంచి చేపట్టుకోవచ్చు. ఉచిత డెలివరీనే కాకుండా.. సూపర్ స్విగ్గీ కస్టమర్లు ఎలాంటి ధర పెంపు లేకుండా ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాక ప్రియారిటీ కస్టమర్ కేర్‌ను స్విగ్గీ ఆఫర్ చేస్తుంది. స్విగ్గీ సూపర్ 1 నెల, 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆప్షన్‌ల్లో అందుబాటులో ఉంటుంది. నెల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ.99 నుంచి రూ.149 మధ్యలో ఉంటుంది. 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర వివరాలను స్విగ్గీ ఇంకా బహిర్గతం చేయలేదు.
స్విగ్గీ సూపర్‌పై అదనపు ప్రయోజనాలను ఈ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ అందించనుంది. స్విగ్గీ సూపర్ ద్వారా 2 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని స్విగ్గీ యోచిస్తోంది. ఇప్పటికే 7 పట్టణాల్లో పరిమిత సంఖ్యలో పలువురు కస్టమర్లకు స్విగ్గీ మెంబర్‌షిప్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మెంబర్‌షిప్ ఆఫర్ ప్రయోగాత్మక దశలో ఉందని, అతి త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ సూపర్ మెంబర్‌షిప్ ప్రొగ్రామ్‌లో ఎక్స్‌క్లూజివ్ రెస్టారెంట్-స్పెషిఫిక్ ఆఫర్లను కస్టమర్లు పొందవచ్చు.
కాగా ఫుడ్ డెలివరీ యాప్‌ల పరంగా చూస్తే జొమాటో లాంటి ఇతర యాప్‌ల నుంచి స్విగ్గీ గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. ప్రస్తుతం స్విగ్గీ తీసుకొచ్చిన ఈ మెంబర్‌షిప్ ప్రొగ్రామ్‌తో జొమోటో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రొగ్రామ్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. మరి ఈ మెంబర్‌షిప్ ప్రయోగం స్విగ్గీకి ఎంత వరకు సక్సెస్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment