Free food supply
-
Lok Sabha Election 2024: ఇండోర్‌లో ఉచిత పోహా, జిలేబీ..
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్‌క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది. -
కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు
కష్టం వచ్చినప్పుడే ధైర్యం కావాలి.. ధైర్యమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. ఆలోచన పరిష్కార మార్గాలను చూపిస్తుంది.. సహాయమార్జించడం.. సహాయం అందించడం ఈ రెండూ ఆ మార్గాల్లోనివే!! పెద్ద విపత్తే వచ్చి పడింది.. ఆ రెండు అవసరాలకూ పరీక్ష పెడుతోంది.. కిందటి సారి ఇంచుమించు ఇదే సమయం, సందర్భంలో.. సొంతూళ్లకు కదిలివెళ్లిన పాదచారులకు అన్నం పెట్టి, సద్ది మూట ఇచ్చి, జేబుల్లో, కొంగు మూడిలో కొంత పైకం సర్ది, పిల్లలకు జోళ్లు, బట్టల జతలు పెట్టి, చేతిలో పళ్లు ఉంచి... దారెంట జాగ్రత్తలు చెప్పి సాగనంపిన మనసులు... బస్సులు మాట్లాడీ బాటసారులను బయలెల్లదీసిన మనుషులు.. ఇప్పుడూ కనిపిస్తున్నారు. కరోనాతో గడపదాటలేని కుటుంబాలు.. వీధి బహిష్కరణతో తలుపులు చాటేసుకున్న ఇళ్లు.. ఆక్సిజన్ అందక ఆగమాగం అవుతున్న జీవితాలు, వెంటిలెటర్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఆగిన బతుకులు.. బెడ్స్ దొరక్క బెంబేలెత్తుతున్న బంధువులు.. దొరికినా లక్షల్లో డబ్బు కట్టలేక.. మందుల్లేక.. ఉన్నా కొనే ఆర్థికపరిస్థితి సహకరించక.. మందులు, ఆసుపత్రి ఆగత్యంలేని.. బలవర్ధకమైన ఆహారం తినాల్సిన బాధితులు.. అన్నీ ఉన్నా వండుకునే శక్తిలేని పీడితులకు ఆపన్న హస్తం అందించే మనుషులు ఇప్పుడూ కనిపిస్తున్నారు. రియల్ హీరో రియల్ హీరో.. అనగానే సోనూ సూదే గుర్తొస్తాడు. కిందటేడు లాక్డౌన్ మొదలు ఇప్పటిదాకా అలుపు లేకుండా సేవలను అందిస్తున్నాడు. రియల్ హీరోగా కనిపిస్తున్నాడు. సామాన్యుడి నుంచి సెలబ్రటీస్ దాకా ఎవరికి కష్టం వచ్చినా సోనూ సూద్‌నే తలుచుకుంటున్నారు. ఇందుకు నిన్నమొన్నటి ఉదాహరణ.. 2021 ఐపీఎల్ రద్దు. ఇండియాలో చిక్కుకున్న విదేశీ ఆటగాళ్లను ఇంటికి చేర్చాలని ట్విట్టర్ వేదికగా సురేష్ రైనా సోనూసూద్‌ను కోరిన వెంటనే ‘ప్యాక్ యువర్ బాగ్స్’ అంటూ సంద్పించాడు సోనూ. ఇలా కరోనా కష్టకాలంలో సోనూ చేసిన సేవలు ఎన్నో! చిన్న పిల్లల చదువుకోసం స్మార్ట్ఫోనులు, నిరాశ్రయులకు ఆహారం, నిత్యావసర సరుకులు, బట్టలు.. ఎన్నని చెప్తాం స్వచ్ఛందంగా అతను చేస్తున్న పనులను! సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్స్‌ను విదేశాల నుంచి కొనుగోలు చేసి అవసరమైన వారికి పంపిస్తున్నాడు. ఇందుకు ఆయన తన ఆస్తులన్నింటిని అమ్ముకోగా, మరో పదికోట్ల ఆస్తులను తాకట్టు పెట్టాడు. ‘అర్థరాత్రి అపరాత్రి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్లలో కనీసం కొంతమందికైనా ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందించి వాళ్ల ప్రాణాలను కాపాడగలిగితే వంద కోట్ల సినిమా చేయడం కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ సంతృప్తి మిగులుతుంది’ అంటాడు సోనూ సూద్. అన్నదాత.. నిహారిక రెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ప్రస్తుతం ఆమె ఇల్లు ఓ మెస్‌ను తలపిస్తోంది. కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి కోసం ఆ ఇంటి వంటిగది విరామెరుగక వండుతూనే ఉంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్, బంజారా హిల్స్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌కు చెందిన సుమారు మూడు వందల పైగా మందికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడానికి తానే స్వయంగా వండి వడ్డిస్తోంది నిహారిక. ఈ బాధ్యతలో ఆమె కుటుంబమంతా పాలుపంచుకుంటోంది. ఆమె పిల్లలు కూడా ఆటలు, పాటలు అన్నీ మానేసి వంటపనిలో నిమగ్నమయ్యారు. కూరలు తరగడం, వండిన వంటను ప్యాక్ చేయడంలో తల్లికి తోడ్పడుతున్నారు. ఇలా తయారైన వంటను నిహారిక సోదరుడు, డ్రైవర్ కలసి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న వారికి అందిస్తున్నారు. ప్రొటీన్లు, ఇతర పోషక పదార్థాలు కలిగిన కూరలతోపాటు వెజిటేబుల్ సలాడ్, డ్రై ఫూట్స్ లడ్డూ కూడా ఉంటాయి మెనులో. హామ్ఐసోలేషన్లో ఉన్నవారు కరోనా పాజీటీవ్ రిపోర్ట్, ఇంటి చిరునామాను ఈ హెల్ప్‌లైన్ నెం. 9701821089కు పంపి, ఫోన్ చేస్తే .. ఆ చిరునామా వీళ్లు అందించగల దూరంలో ఉంటే ఆ తర్వాత రోజు నుంచే ఆ ఇంటికి వండిన ఆహారాన్ని పంపిస్తారు. కరోనాలో చదువు కోసం .. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాల్యం ఆన్లైన్ క్లాసులకే అంకితమై పోయింది. ఈ ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు తప్పనిసరయ్యాయి. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు, ఉన్నా ఆర్థికంగా వెనకబడిన పిల్లల కోసం ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందిస్తూ, అనాథశ్రయాల్లో గ్రూప్ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తోంది ‘ప్యూర్ ఆర్ఫన్ అండ్ రూరల్ ఎడ్యూకేషన్’ అనే స్వస్థంచ సంస్థ. 2016లో గిరిజన ప్రాంత పిల్లల చదువు కోసం ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మధ్యాహ్నభోజనం కోసమే బడికి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని తెలిసి.. పేద విద్యార్థులు, నిరాశ్రయులతోపాటు హోమ్ఐసోలేషన్లో ఉంటున్న కరోనా రోగులకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తోందీ సంస్థ. కరోనా వల్ల ఇబ్బంది పడిన వలస కూలీల కోసం ఈ సంస్థ బస్సులను ఏర్పాటు చేసి, సుమారు మూడు వేలమందికి పైగా కూలీలను వారి ఇళ్లకు చేర్చింది. వీరిలో నిండు గర్భీణీలూ ఉండటం గమనించి వారిని ఆసుపత్రిలో చేర్పించింది. ఈ కరోనా సమయంలో ఏదైనా సహాయం కావాలనుకునేవారు తమ హెల్ప్‌లైన్ నంబర్లు 7386120040, 7675940040 లకు ఫోన్ చేస్తే చాలు సహాయం అందించడానికి సిద్ధం అంటున్నారు ఈ సంస్థ సభ్యులు. నిరాశ్రయులకు ఆసరా.. నిత్యావసరాల సరఫరా అనాథల కోసం దశాబ్దం కిందట మొదలైన ‘దిశా ఫౌండేషన్’ ప్రస్తుతం తన సేవలను కరోనా బాధితుల కోసమూ విస్తరించింది. ప్రతి రోజూ వందల సంఖ్యలో మందులు, మాస్కులతో పాటు అవసరమైన వారికి నిత్యావసర సరుకులు, నిరాశ్రయులకు అహారం అందిస్తున్నారు. త్వరలోనే ఎల్బీ నగర్లో ఓ ఐసోలేషన్ సెంటర్‌నూ ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు గుంటూరులోని క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అందరూ ఒక్కటై ఇలాంటి సమయంలో నేను, నాది.. నా అనే ఆలోచనలు పోయి, మనం అనే భావన రావాలి. పది మందికి సాయం చేయలేకపోయనా కనీసం ఒక్కరికైనా సాయం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. కరోనా నుంచి కాపాడుకునే చర్యలు తీసుకోవాలి. – సుస్మిత జగ్గి రెడ్డి దిశా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ష్యాషన్ డిజైనర్. వృద్ధుల కోసం... కరోనా దాటికి రాలిపోతున్న వృద్ధులను చూసి చలించిపోయింది హిమజ. అందుకే వారి కోసం ఉచితంగా మందులు, ఆహారం పంపిణీ చే స్తోంది. అలా ఇప్పటి వరకు సుమారు పదిహేను వందల మందికిపైగా సహాయం అందించింది ఆమె. సేవా కార్యక్రమాలు ఆమెకు కొత్త కాదు. గత ఆరేళ్లుగా ఆనాథ పిల్లల కోసం కృషి చేస్తోంది. క్యాన్సర్ రోగులకు వైద్యసహాయంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు విగ్గులను అందిస్తోంది. కరోనా కష్టకాలంలో సేవలందిస్తోన్న మరికొన్ని హెల్ప్‌లైన్ నెంబర్లు.. ఎమ్మెల్సీ కవిత కార్యాలయం: 898569993 ఎల్హెచ్ఓ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం: 8374303020, 8688919729 చదవండి: గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు -
తిరిగివ్వొద్దు... పదిమందికి సాయపడండి!
ముంబైకి చెందిన హీనా మాండవియ కొడుకు హర్ష్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు భర్త కారు యాక్సిడెంట్లో మరణించారు. దీంతో కుటుంబ భారం హీనా మీద పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న హీనా కొంతమంది దాతల సాయానికి తోడు రెక్కల కష్టంతో కుటుంబాన్ని లాక్కొచ్చింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక తనను ఆదుకున్న దాతలకు డబ్బు తిరిగివ్వబోతే..‘‘డబ్బులు వద్దమ్మా.. ఆపదలో ఉన్న ఓ పదిమందిని ఆదుకోండి! అని చెప్పడంతో హీనా, హర్ష్‌లు ఇద్దరూ కలిసి వేలమంది నిరుపేదల ఆకలి తీరుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌కు చెందిన హీనా... భర్త చనిపోయాక, హర్ష్‌కు మంచి విద్యను అందించేందుకు ముంబైకు మారారు. జీవిక కోసం హీనా టిఫిన్లు తయారు చేసి ఇస్తే.. హర్ష్ ఇంటింటికి తిరిగి వాటిని విక్రయించేవాడు. వీరి టిఫిన్లు శుచిగా రుచిగా ఉండడం తో కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరిగింది. తల్లీ కొడుకులు పడుతున్న కష్టాన్ని గమనించిన ఒక కస్టమర్ అప్పట్లో కొంత సాయం చేశారు. ఆ డబ్బుతో ‘హర్ష్ థాలి అండ్ పరాటా’ పేరుతో ముంబైలో ఒక టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. మొదట్లో హీనా ఒక్కతే టిఫిన్ సెంటర్‌ను చూసుకునేది. హర్ష్ డిగ్రీ పూరై్తన తరువాత వ్యాపారాన్ని విస్తరించాడు. ఆన్లైన్ బిజినెస్ బాగా జరగడంతో వారి ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త సర్దుకున్నాయి. లాక్డౌన్ కాలంలో... గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది ఆకలితో అలమటించారు. ఇది చూసిన ఓ కస్టమర్ వందమందికి భోజనం పెట్టగలరా? అని అడగడంతో తల్లీకొడుకులు వెంటనే ఒప్పుకుని వందమందికి ఉచితంగా ఆహారం అందిం చారు. ఈ ప్రేరణతో హర్ష్ అదేరోజు సాయంత్రం ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తాం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొంతమంది దాతలు సాయం చేయడానికి ముందుకు రావడంతో వీరు రోజూ 100 నుంచి 150 మంది ఆకలి తీర్చేవారు. అప్పటినుంచి ఇప్పటివరకూ తల్లీకొడుకులు నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. ‘‘స్థోమత లేకపోయినప్పటికి అమ్మ నన్ను మంచి స్కూల్లో చదివించాలనుకుంది. మా పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూల్ డైరెక్టర్ మొత్తం ఫీజును మాఫీ చేశారు. చదువుకుంటూనే అమ్మకు టిఫిన్ల తయారీలో సాయపడేవాడిని. డిగ్రీ అయ్యాక నేను టì ఫిన్ సెంటర్ బాధ్యత తీసుకుని ఆన్లైన్లో వ్యాపారాన్ని విస్తరించడంతో మా ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఆర్థికపరిస్థితులు మెరుగు పడడంతో నా చిన్నప్పటి స్కూలు డైరెక్టర్ ఇంటికి వెళ్లి ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతగా కొంత డబ్బు ఇవ్వబోతే.. అతను ‘‘నాకు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వనక్కరలేదు. అయితే నాలా మీరు మరికొంత మందికి సాయం చేయండి’’ అని చెప్పారు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన మేము గతేడాది లాక్డౌన్ కాలంలో వంద ధాబాలలో ఫుడ్ తయారు చేయించి అడిగిన వారందరికీ ఆకలి తీర్చేవాళ్లం. ప్రస్తుతం కూడా పరిస్థితులు అప్పటిలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు కూడా నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం’’ అని హర్ష్ చెప్పాడు. -
కోవిడ్ బాధితులకు పఠాన్ సోదరుల సాయం
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముందుకొచ్చాడు. మహమ్మారి వల్ల పూట గడవడం కూడా కష్టమైన దక్షిణ ఢిల్లీ ప్రజలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు పఠాన్ తెలిపాడు. క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ (సీఏపీ) ద్వారా ఈ సేవా కార్యక్రమం జరగనున్నట్లు అతను స్పష్టం చేశాడు. ‘ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం ప్రస్తుతం మన ముందున్న కనీస బాధ్యత. అందుకే సీఏపీ ద్వారా దక్షిణ ఢిల్లీలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్, అతని సోదరుడు యూసుఫ్ పఠాన్ 4 వేల మాస్క్‌లను అందజేశారు. మార్చిలో రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్లో పాల్గొన్న ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. -
పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలం రేపుతుండగా చాలా రాష్ట్రాల్లో తీవ్ర ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా అమల్లో ఉంది. దీంతో పేదలు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల నుంచే పేదలకు ఆహార ధాన్యాలు ఐదు కిలోల చొప్పున అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద అందించనుంది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 79.88 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. చదవండి: కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే -
కరోనా: ఉచితంగా ఆహారం అందిస్తాం.. అంత్యక్రియలు చేస్తాం..
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): కరోనా బారిన పడిన నిరుపేదలకు ఆహారం అందించటం కోసం సత్తుపల్లి ఫుడ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని నిర్వాహకులు పఠాన్ ఆషాఖాన్ సోమవారం విలేకరులకు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మానవత్వంతో స్పందించటం అందరి బాధ్యతన్నారు. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైరస్ బారినపడిన వారికోసం ఫుడ్ బ్యాంక్ ఫోన్ నంబర్ 98495 99802ను సంప్రదించాలని, వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. నేరుగా బాధితుల ఇంటి వద్దకే వచ్చి ఆహారం అందజేస్తామన్నారు. -
కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం
దిల్సుఖ్నగర్: సేవయే తమ ధ్యేయమని ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలో నివాసం ఉండే తమ్మనాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తమ్మన శ్రీధర్, లక్ష్మి సుజాతలు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో కరోనా వచ్చిందని తెలిస్తే రోగుల బంధువుల కూడా దగ్గరికి రావడం లేదు. అలాంటిది కరోనా బాధితుల బాధను చూసి వారి ఆకలిని తీరుస్తున్నారు. అది కూడా ఉచితంగా అందిస్తున్నారు. తమ్మనాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బారినపడి ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజనం లేక ఇబ్బంది పడే వారికి లక్ష్మీ సుజాతే స్వయంగా వంట చేసి ఆహారం అందజేస్తున్నారు. ప్రసుత్తం ఆర్కేపురం వాసవి కాలనీలో 35 మంది బాధితులకు ఉచితంగా రోజుకు రెండు పూటలా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు తమకు సెల్ 9441128021లో ఫోన్ చేసి వివరాలు తెలిపితే ఇంటికే భోజనం పంపిస్తామని పేర్కొన్నారు. ( చదవండి: మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..! ) -
కరోనా రాకముందు 5 రూ... ఇప్పుడు ఫ్రీ!
-
15 రోజుల్లోగా పంపేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్ళే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని కోరింది. అందుకు ఈ సమయం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల తరలింపు, వారి పేర్ల నమోదు, ఉపాధి అవకాశాల కల్పన సహా అన్నింటిపైనా జూన్ 9న ఆదేశాలివ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. వలస కార్మికుల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు గతంలో ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికుల నుంచి బస్సుల్లోగానీ, రైళ్ళలోగానీ చార్జీలు వసూలు చేయరాదనీ, వారికి ఉచితంగా భోజనసదుపాయం కల్పించాలనీ సుప్రీంకోర్టు మే 28న ఆదేశించింది. తీర్పుని రిజర్వులో ఉంచిన కోర్టు, కోవిడ్ కారణంగా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కే.కౌల్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం కోరింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్త పథకాలు రూపకల్పన చేయాలని సూచించింది. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు జూన్ 3వ తేదీ వరకు 4,200 శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడిపినట్టు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చామనీ, 41 లక్షల మందిని బస్సుల ద్వారానూ, 57 లక్షల మందిని రైళ్ళ ద్వారా తరలించినట్టు మెహతా పేర్కొన్నారు. వలస కార్మికులకోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక రైళ్ళను నడిపినట్టు వెల్లడించారు. ఇంకా ఎంత మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు ఎన్ని రైళ్ళు అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. ఇకముందు కూడా వలస కార్మికుల అవసరాన్ని బట్టి వారిని తరలించేందుకు రైళ్ళు నడుపుతామని కోర్టుకి హామీ ఇచ్చారు. జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం కల్పించుకొని వలస కార్మికుల ప్రయోజనం కోసం చేపట్టాల్సిన కొన్ని చర్యలను వివరించింది. మొత్తం 22 లక్షల మందిలో ఇంకా 2.5 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే తరలించాల్సి ఉందని గుజరాత్ పేర్కొంది. ఇంకా ఢిల్లీలో 2 లక్షల మంది వలస కార్మికులుండగా 10 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి 5.50 లక్షల మంది వలస కార్మికులను తమ రాష్ట్రానికి చేర్చినట్టు ఉత్తరప్రదేశ్ విన్నవించింది. రాజస్తాన్ నుంచి 6 లక్షల మందిని, మహారాష్ట్ర నుంచి 11 లక్షల మందిని తరలించారు, ఇంకా 38 వేల మందిని తరలించాల్సి ఉంది. 28 లక్షల మంది బిహార్‌కి తిరిగి వచ్చినట్టు ఆ రాష్ట్రం పేర్కొంది. కోవిడ్‌కు ఉచిత చికిత్స చేస్తారా? ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’కింద కోవిడ్ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. దేశంలోని పేద, అట్టడుగు వర్గాల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ భారత్‌ని ప్రవేశపెట్టారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్–19 రోగులకు ఉచిత చికిత్సనందించాలని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లు కొందరికైనా ఉచిత చికిత్సనందించలేవా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, అవే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్ దారుడు, న్యాయవాది సచిన్ జైన్ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారించనుంది. ప్రైవేటులో కరోనా చికిత్స ఖర్చుకు పరిమితి విధించండి! ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై వారంలోగా స్పందించాలని జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్‌దారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. -
పొట్ట నింపుకునేందుకు పొడవాటి క్యూల్లో...
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆహారం అందుకునేందుకు పేదలు, అన్నార్తులు పడరాని పాట్లు పడుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని బద్లీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉచిత భోజనం కోసం 500 మంది ఉదయం ఆరు గంటలకే క్యూలో వేచిచూశారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 1200కు ఎగబాకింది. ఉచిత భోజనంలో పప్పు, అన్నం, కూర అందిస్తున్నారు. లంచ్ కోసం త్వరగా క్యూలో నిలుచునేందుకు తాము కొన్నిసార్లు ఉదయం ఆరు గంటలకే వస్తామని ఓ ఆటో రిక్షా డ్రైవర్ చెప్పుకొచ్చారు. లాక్డౌన్ అమలుతో జీవనోపాధి కోల్పోయిన అలాంటి వారందరికీ ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం కడుపు నింపుతోంది. పేదలకు ఉచిత లంచ్, డిన్నర్ సరఫరా కోసం ఢిల్లీ అంతటా 2500కు పైగా కేంద్రాల్లో ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 1 నుంచి రోజుకు పది లక్షల మందికి సరిపడా భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్రస్ధాయిలో పరిస్థితి గమనిస్తే చాలామంది ఉచిత భోజనం లభించక వెనుతిరిగిన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాను కొన్నిసార్లు గంటల తరబడి వేచిచూసినా తన వంతు వచ్చేసరికి భోజనం అయిపోతోందని క్యూలో నిల్చున్న ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవం వివరించారు. లంచ్‌కు కొద్దిగంట ముందే తాను ఖాళీ టిఫిన్ బాక్స్‌ను క్యూలో ఉంచుతున్నానని, అప్పటికీ తన వరకూ వచ్చేసరికి ఆహారం ఉంటుందా అనేది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉచిత భోజన పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకూ 1154 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. చదవండి : ఢిల్లీలో మళ్లీ భూకంపం -
టిఫిన్‌దాత సుఖీభవ.. థాంక్యూ రాజన్న
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): చదువుపై ధ్యాసపెట్టిన విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి మర్యాల రాజన్న అందిస్తున్న అల్పాహారం ఎంతో దోహదపడుతోంది. పరీక్షల్లో మంచిర్యాంకులు సాధించాలనే తపనతో..విద్యార్థులు అదనపు తరగతుల్లో మునిగి ఆకలితో ఉంటున్నారు. కోనాపూర్ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న విద్యార్థులకు నాలుగేళ్లక్రితం ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఏడాది మరిన్ని పాఠశాలలకు విస్తరించారు. ప్రస్తుతం మొత్తం 759 మంది విద్యార్థులకు ఈ ఏడాది అల్పాహారం అందించనున్నారు. నాలుగేళ్లక్రితం మొదలైన కార్యక్రమం పదోతరగతి విద్యార్థులతోపాటు, ఇంటర్ విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2016–17 సంవత్సరంలో 129 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలురాయగా వీరికి నాలుగునెలలపాటు అల్పాహారం అందించారు. ఆ తరువాత 2017–18లో 119 మంది, 2018–19లో 99 మంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో 88 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూరుస్తున్నారు. సారంగాపూర్, బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సారంగాపూర్, బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం మూడేళ్లక్రితం ప్రారంభించి, ఇంటర్ మొదటి, రెండోసంత్సరం విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ ఏడాది సారంగాపూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 115 మంది, ఇంటర్ రెండో సంవత్సరంలో 77 మంది విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. బీర్పూర్ జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో 163 మంది, ఇంటర్ రెండోసంవత్సరంలో 181 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూర్చుతున్నారు. . సారంగాపూర్ మండలంలోని ఇతర ఉన్నత పాఠశాలల్లో.. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు గడిచిన మూడేళ్లుగా అల్పాహారం అందిస్తుండగా, ఈ ఏడాది 52 మందికి అందిస్తున్నారు. రంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 మందికి, అర్పపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19 మందికి, రేచపల్లి ఉన్నత పాఠశాలలో 51 మంది పదోతరగతి విద్యార్థులకు నాలుగునెలలపాటు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. మా మంచి రాజన్న కోనాపూర్ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న జగిత్యాలలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. విద్యాభివృద్ధికి కొంత ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో నాలుగునెలలపాటు అల్పాహారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల సహకారంతో నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అల్పాహారంలో అటుకులు, ఉప్మా, మరమరాలు, మక్క అటుకుల వంటివి అందిస్తున్నారు. వీటిని రుచికరంగా తయారు చేయడానికి అందులోకి కావాల్సిన వస్తువులు పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తున్నారు. కలెక్టర్ ఉత్తేజం స్ఫూర్తి నింపింది కలెక్టర్ పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు రావాలని పిలుపునివ్వడం స్ఫూర్తినిచ్చింది. మనకున్న దానిలో కొంతైన ఇతరులకు ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత మంచి చేస్తాడనేది నా నమ్మకం. అందుకే ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా కొనసాగిస్తా. – మర్యాల రాజన్న చదువుపై శ్రద్ధ పెంచుతుంది రాజన్న సార్ మా కళాశాలలో అల్పాహారం అందిస్తున్నారు. టైంకు తినడంతో మాకు చదువుపై శ్రద్ధపెరుగుతుంది. రాజన్న కుటుంబానికి అంతా మంచి జరగాలి. – తిరుపతి, బైపీసీ, రెండోసంవత్సరం, సారంగాపూర్ థాంక్యూ రాజన్న భవిష్యత్‌లో మేము ఉన్నతంగా ఎదిగితే..మేము రాజన్న సార్ చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఉంది. మాకు అందించే అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. – నవ్య, ఎంపీసీ రెండో సంవత్సరం సారంగాపూర్ జూనియర్ కళాశాల -
స్విగ్గీ కొత్త ప్రయోగం.. కస్టమర్లకు భలే ఆఫర్
దేశీయ అతిపెద్ద ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సరికొత్త ప్రయోగానికి స్వీకారం చుట్టింది. స్విగ్గీ సూపర్ పేరిట కొత్తగా పెయిడ్ మెంబర్షిప్ ప్రొగ్రామ్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఈ ప్రొగ్రామ్‌లో భాగంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. రోజుల్లో ఎన్నిసార్లైనా ఉచిత డెలివరీలను, మీ ప్రాంతాల్లో ఉన్న అన్ని రెస్టారెంట్ల నుంచి చేపట్టుకోవచ్చు. ఉచిత డెలివరీనే కాకుండా.. సూపర్ స్విగ్గీ కస్టమర్లు ఎలాంటి ధర పెంపు లేకుండా ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాక ప్రియారిటీ కస్టమర్ కేర్‌ను స్విగ్గీ ఆఫర్ చేస్తుంది. స్విగ్గీ సూపర్ 1 నెల, 3 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఆప్షన్ల్లో అందుబాటులో ఉంటుంది. నెల సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ.99 నుంచి రూ.149 మధ్యలో ఉంటుంది. 3 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర వివరాలను స్విగ్గీ ఇంకా బహిర్గతం చేయలేదు. స్విగ్గీ సూపర్‌పై అదనపు ప్రయోజనాలను ఈ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ అందించనుంది. స్విగ్గీ సూపర్ ద్వారా 2 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని స్విగ్గీ యోచిస్తోంది. ఇప్పటికే 7 పట్టణాల్లో పరిమిత సంఖ్యలో పలువురు కస్టమర్లకు స్విగ్గీ మెంబర్‌షిప్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మెంబర్షిప్ ఆఫర్ ప్రయోగాత్మక దశలో ఉందని, అతి త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ సూపర్ మెంబర్షిప్ ప్రొగ్రామ్‌లో ఎక్స్‌క్లూజివ్ రెస్టారెంట్-స్పెషిఫిక్ ఆఫర్లను కస్టమర్లు పొందవచ్చు. కాగా ఫుడ్ డెలివరీ యాప్‌ల పరంగా చూస్తే జొమాటో లాంటి ఇతర యాప్‌ల నుంచి స్విగ్గీ గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. ప్రస్తుతం స్విగ్గీ తీసుకొచ్చిన ఈ మెంబర్షిప్ ప్రొగ్రామ్‌తో జొమోటో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్రొగ్రామ్లకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. మరి ఈ మెంబర్షిప్ ప్రయోగం స్విగ్గీకి ఎంత వరకు సక్సెస్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే. -
పెట్రోల్ బంకు యాజమాన్యం వినూత్న ప్రయోగం
సాక్షి, బెంగళూరు : పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వాహనదారులు మండిపడటం సహజం. అయితే, పెట్రోల్ మంటలు చల్లార్చలేము కానీ మీ ఆకలి మంటలు తీర్చుతామంటూ ముందుకొచ్చారు ఓ పెట్రోల్ బంకు యజమాని. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంకులోనికి వెళితే మాత్రం కేవలం మీ వాహనానికి మాత్రమే కాదు మీ ఆకలి తీర్చే ఇంధనం కూడా లభిస్తుంది. అది కూడా ఫ్రీగా. ‘మీరు మీ ట్యాంకును నింపుకోండి – మేము మీ కడుపు నింపుతాము’ (యు ఫిల్ యువర్ ట్యాంక్! వి ఫిల్ యువర్ టమ్మీ) పేరిట ఇందిరానగర్‌లోని వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టారు. రోడ్ల పైనే సగం సమయం.... బెంగళూరు వాసులు తమ తమ ఇళ్లలో కంటే నగర రోడ్ల పైనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. కారణం నగరంలో ఎప్పుడూ రద్దీగా కనిపించే రోడ్లు. కార్యాలయానికి సమయానికి చేరుకోవాలన్నా, పాఠశాలకు తొందరగా వెళ్లాలన్నా ఏది ఏమైనా, ఎంత తొందరగా ఇంటి నుండి బయలు దేరినా గంటల పాటు నగర రోడ్ల పై పడిగాపులు కాయాల్సిందే. ఈ ఉరుకులు, పరుగులతోనే చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌ని, భోజనాన్ని కూడా వదిలేస్తుంటారు. దీంతో ఇక సాధారణంగానే అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఎంత సమయం తక్కువగా ఉన్నాకూడా తమ వాహనాలకు ఇంధనాన్ని నిలుపుకునేందుకు పెట్రోల్ బంకు దగ్గర మాత్రం ఓ ఐదు నుండి పది నిమిషాల పాటు తప్పక వేచి ఉండాల్సిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఆ సమయంలోనే వారికి కాస్తంత భోజనం కూడా అందజేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ కార్యక్రమం. పైలెట్ ప్రాజెక్టుగా....నెల రోజులు ఉచితంగా.... ఇందిరానగరలోని వెంకటేశ్వర సర్వీస్ సెంటర్ యజమాని ప్రకాష్‌రావు ఆలోచన నుండి పుట్టినదే ఈ కార్యక్రమం. ‘పెట్రోల్ బంకుల వద్ద ఉంటే ఖాళీ స్థలంలో ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అధికారులు అంగీకరించారు. ఇక పైలెట్ ప్రాజెక్టుగా ఈ పెట్రోల్ బంకులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మా వినియోగదారులకు ఉచితంగా భోజనాన్ని అందిస్తాం. ఆ తరువాత కొంత మొత్తాన్ని వసూలు చేస్తాం. మా వద్ద శాఖాహార, మాంసాహార భోజనాలతో పాటు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అల్పాహారం, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమకు ఏ పదార్థాం కావాలో చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆహారాన్ని ప్యాక్ చేసి అందిస్తాం. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే 100 ఐఓసీ పెట్రోలు బంకులకు ఈ కార్యక్రమానికి విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని సంస్థ ప్రతినిధి ప్రకాష్‌రావు తెలిపారు. ప్రత్యేక కిచెన్ కూడా....... ఇక ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో నిపుణులైన చెఫ్‌లు అన్ని రకాల వంటలను తయారుచేస్తారు. అక్కడ తయారు చేసిన వంటకాలను పెట్రోల్ బంకులో అందుబాటులో ఉంచుతారు. ఇక బేకరీ ప్రాడక్ట్స్ తయారీ కోసం ఇస్కాన్‌తో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సందర్భంలో వినియోగదారులు కాని వారు కూడా కొంత మేరకు డబ్బులు చెల్లించి, ఇక్కడ ఆహారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. -
బడుగులే నిర్ణేతలు
మధ్యప్రదేశ్‌లో ఫలితాలపై ప్రభావం చూపనున్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు బీజేపీ నుంచి నెమ్మదిగా కాంగ్రెస్ వైపు చూపు మధ్యప్రదేశ్‌లో 35 ఎస్సీ, 47 ఎస్టీ నియోజకవర్గాలు మధ్యప్రదేశ్ నుంచి ప్రవీణ్, సాక్షి ప్రతినిధి: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులే జయాపజయాలను నిర్ణయించనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 230 నియోజకవర్గాల్లో 35 ఎస్సీ, 47 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1998 వరకు కాంగ్రెస్‌కు బాసటగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో దాదాపు 90 శాతం నియోజకవర్గాలు 2003 ఎన్నికల నాటికి బీజేపీ వైపు మొగ్గు చూపాయి. అయితే, ఈ నెల 25న జరగనున్న ఎన్నికల్లో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గాల్లో కొంతమేరకు అభివృద్ధి చేసినా, ఇప్పటికీ పలు గ్రామాలకు మౌలిక వసతులు లేవు. రాష్ట్ర రాజధానికి దూరంగా సరిహద్దుల్లోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అధికంగా ఉన్న బేతుల్, చింద్వాడ, సివోని, బాలాఘాట్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను ‘సాక్షి’ బృందం సందర్శించింది. గత పదేళ్లలో బీజేపీ సర్కారు ఈ గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం, పాఠశాలలను మాత్రమే సమకూర్చగలిగింది. అయితే, గ్రామాలకు విద్యుత్కాంతులు రావడంలో కేంద్రం వాటా కూడా ఉంది. పదేళ్ల బీజేపీ పాలనపై ఎస్సీ, ఎస్టీలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఇది మాత్రమే చాలదని వారు చెబుతున్నారు. వ్యవసాయానికి విద్యుత్తు, రోడ్డు మార్గాల విషయంలో తమ ప్రాంతాలు నేటికీ వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉచిత విద్యుత్తు, ఉచిత ఆహార పంపిణీ హామీలతో కాంగ్రెస్ సాగిస్తున్న ప్రచారం వారిని ఊరిస్తోంది. ఉచిత విద్యుత్తు, ఉచితంగా ఆహారం ఇస్తే మంచిదేనని, అయితే, కాంగ్రెస్ ఇస్తుందో లేదోనని సంశయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ రానున్న పదిరోజుల్లో ఈ ప్రాంతాల్లోకి తన మేనిఫెస్టోను బలంగా తీసుకువెళ్లగలిగితే బీజేపీకి కష్టకాలం తప్పకపోవచ్చు. విద్యలో ఇంకా వెనుకబాటే: మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు విద్యలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం 6, 9, 11 తరగతుల్లో చేరే విద్యార్థులకు సైకిళ్లు సమకూర్చడంతో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయి తే, ఇంటర్ పూర్తిచేశాక డిగ్రీ కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు బస్సులు, ఆటోలను ఆశ్రయిం చి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అయినా, ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు చేరుకునేందుకు వారికి మూడు నాలుగు కిలోమీటర్ల కాలినడక తప్పదు. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుంది: సుష్మా జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజానుకూలత రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆమె అన్నారు. గత పదేళ్లలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చూపిన నిబద్ధత కారణంగా తమ పార్టీపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన ఆమె కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటికి కరెంటిస్తే సరిపోతుందా? ఇంటికి 22 నుంచి 24 గంటల వరకు కరెంటు వస్తోంది. పొలాలకు రావొద్దా? బీజేపీ మా పల్లెల్లో వెలుగులు తెచ్చినా, ఇంతవరకే సరిపోదు. కాంగ్రెస్ ఉచితంగా కరెంటు ఇస్తామని చెబుతోంది. అయితే, ఇస్తుందో లేదో తెలియదు.. ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. -తారాసింగ్ ఖట్రే, మోహన్పూర్, బైహ్రా నియోజకవర్గం, బాలాఘాట్ జిల్లా ఇల్లు ఇచ్చింది.. కానీ కూలీ సరిపోదు.. ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చింది. అయితే, మాకు పొలం లేదు. కొంతైనా భూమి, పాడిపశువులను ఇస్తే వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటాం. - సంతూ మార్కామ్, కూలీ, ఉక్వా, బైహ్రా నియోజకవర్గం 3 కిలోమీటర్లు నడిచేవెళుతున్నా.. నేను జిల్లా కేంద్రంలో బీఏ మూడో సెమిస్టర్ చదువుతున్నా. రోజూ మూడు కిలోమీటర్లు నడిచివెళ్లాల్సిందే. అక్కడి నుంచి మళ్లీ ప్రైవేటు బస్సుల్లో వె ళ్లాలి. ప్రభుత్వ పరంగా బస్సు సౌకర్యం లేదు. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. -రాఖీ పవార్, బీఏ థర్డ్ సెమిస్టర్, బేతుల్ జిల్లా ప్రైవేటు కాలేజీల్లో ఖర్చు ఎక్కువ అమ్మా నాన్నలు చిన్నకారు రైతులు. నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతున్నా. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వం మాకు ప్రైవేటు కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలి. -సప్న వంజారే, బీఎస్సీ థర్డ్ సెమిస్టర్, బేతుల్ జిల్లా