ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్న గాజాలో పాలస్తీనియన్లు పడుతున్న అంతులేని అగచాట్లకు నిదర్శనం ఈ ఫొటోలు. కనీసం ఆహారం సైతం దొరక్క వాళ్లు అలమటిస్తున్నారు. శుక్రవారం ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం సమీపంలోని ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఆహారం కోసం ఇలా పోటీ పడ్డారు. వారి దురవస్థ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తీవ్రత నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐరాస సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.
దాంతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలాకాలంగా వారంతా ఐరాస సాయంపైనే ఆధారపడి బతుకీడుస్తూ వస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతటి కారుచీకట్లలోనూ ఒక కాంతిరేఖ మిణుకుమంటోంది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలైనట్టు హమాస్ ప్రతినిధి బస్సెమ్ నయీమ్ తాజాగా చెప్పారు. పరస్పరం బందీల విడుదలతో 14 నెలల పై చిలుకు యుద్ధానికి త్వరలోనే ముగింపు వస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment