సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఏపీలో ఆన్‌లైన్ ద్వారా కూరగాయల డోర్ డెలివరీకి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న ఈ గడ్డు సమయంలో వినియోగదారులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఏపీ ఈ-పాస్ పద్ధతి దరఖాస్తుదారులకు సహాయకారిగా నిలిచిందని పేర్కొంది. త్వరలో ఏపీ వ్యవసాయశాఖతో కలిసి తాజా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీ ప్రారంభిస్తామని తెలిపింది. కాగా, కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీకి స్విగ్గీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి : గుడ్‌న్యూస్: ‘కరోనా ఫ్రీ’గా మరో రాష్ట్రం
2/2: Soon we will be delivering fresh Fruits and Vegetables at your doorstep in partnership with Department of Agriculture Marketing Andhra Pradesh so that you can stay home and stay safe.
— Swiggy (@swiggy_in) April 20, 2020
Comments
Please login to add a commentAdd a comment