క్రిస్మస్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది. క్రైస్తవుల లోగిళ్లలో, చర్చిలలో క్రిస్మస్ ట్రీ వెలుగు జిలుగులతో కళకళలాడుతూ ఉంటుంది. మరి ఈ వృక్షం చరిత్రలో ఎలా ప్రసిద్ధిగాంచింది. ఈ ట్రీ హిస్టరీ ఏంటి.. దీని జన్మస్థానం ఎక్కడ.. వివిధ దేశాల్లో వీటిని ఏ పేరుతో పిలుస్తారు తదితరఆసక్తికర అంశాలపై ప్రత్యేక కథనం.– హిమాయత్‌నగర్
తొలిసారిగా జర్మనీలో..
క్రిస్మస్ ట్రీని మొదటిసారిగా 1510లో క్రిస్మస్ రోజు జర్మనీలో లాటివియా అనే ప్రాంతంలోని ‘దిగా’ అనే గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. వీటి కోసం తొలుత ‘కీనిఫిర్లు, ఫైన్, ఫిర్ స్రూసీ’ తదితర జాతుల చెట్లను అప్పట్లో వినియోగించేవారు. మధ్యయుగం నాటి నాటికల్లో క్రిస్మస్ ట్రీ స్వర్గం నుంచి వచ్చిందిగా పేర్కొంటూ ‘ట్రీæ ఆఫ్ ప్యారడైజ్’గా అభివర్ణించారు. ఆరు లేదా ఏడడుగుల మొక్కలను క్రిస్మస్ ట్రీకి ఉపయోగించడంఆనవాయితీ.
విద్యుద్దీపాలతోఅలంకరించిన జాన్సన్..
1782లో థామస్ ఆల్వా ఎడిసన్ సహాయకుడు ఎడ్వర్డ్ జాన్సన్ తొలిసారిగా క్రిస్మస్ ట్రీని విద్యుద్దీపాలతో అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. కాలగమనంలో ఎక్కువగా ట్రీకి లైటింగ్ ఏర్పాటు చేయడం, దానిపై శాంతాక్లాజ్ వంటివి అమర్చడం, కొవ్వొత్తులు పెట్టి ఎంతో ఆకర్షణగా కనిపించేలా ముస్తాబు చేస్తున్నారు. మనిషి జీవితంలో చెడు నుంచి రక్షణ ఇచ్చి వెలుగును నింపుతుందనే సిద్ధాంతాన్ని వివరిస్తుంది క్రిస్మస్ ట్రీ.
ఆన్‌లైన్‌లోనూఅందుబాటులో..
గూగుల్‌లో క్రిస్మస్ ట్రీ అని సెర్చ్ చేస్తే చాలు. అవి అందుబాటులో ఉన్న వెబ్‌సైట్స్ అన్నీ తారసపడతాయి. ఆన్‌లైన్‌లో అడుగు ట్రీ రూ.199కే లభిస్తోంది. కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో ట్రీ మన ఇంటికే వచ్చేస్తుంది.
మార్కెట్లో భారీక్రిస్మస్ ట్రీస్ లభ్యం
నగరంలోని పలు స్టోర్స్‌లో క్రిస్మస్ ట్రీస్‌ను విక్రయిస్తున్నారు. ఇవి అడుగు పొడవు నుంచి సుమారు 30 అడుగుల వరకు ఉన్నాయి. అడుగు ట్రీ రూ.299కి లభిస్తుండగా.. ఐదడుగుల ట్రీ రూ.880, 20 అడుగులు రూ.87వేలు, 30 అడుగుల ట్రీ రూ.1.20 లక్షల్లో లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment