
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ త్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం నేటికీ ఆచరణీయమని తెలిపారు.