జెరూసలెం: మిత్రదేశమైన అమెరికాపై ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మంత్రి బెన్ గ్విర్ విరుచుకుపడ్డారు. అమెరికా తమ మిత్ర దేశమే అయినప్పటికీ ఇజ్రాయెల్‌కు ఏది మంచిదైతే తాము అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు.
‘ప్రస్తుతం గాజా నుంచి వందలు వేల సంఖ్యలో జరుగుతున్న జనాభా వలసల వల్ల ఇజ్రాయెల్ పౌరులకు గాజాకు తిరిగి వేళ్లే అవకాశం దక్కుతుంది. మేం అమెరికాను ఎంతగానో గౌరవిస్తాం. అంతమాత్రాన అమెరికా జెండాలో ఇజ్రాయెల్ మరో స్టార్ కాదలుచుకోలేదు’అని ఇజ్రాయెల్ మంత్రి అన్నారు.
గాజా జనాన్ని అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ పౌరులు వెళ్లడాన్ని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి కూడా సమర్థించుకున్నారు. గాజాలో ఉన్న 20 లక్షల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోసి రేపులు, మర్డర్లు చేద్దామనే ఉద్దేశంతోనే నిద్ర లేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా,గాజాకు జనాభా బదిలీ చేయడమేనే ఆలోచన విద్వేషపూరితమైన, బాధ్యతా రహితమైనదని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. గాజా అనేది పాలస్తీనా భూ భాగంలో అంతర్భాగమని, అది అలాగే కొనసాగుతుందని అమెరికా తెలిపింది. అమెరికా చేసిన ఈ ప్రకటనపైనే ఇజ్రాయెల్ మండిపడుతోంది.
ఇదీచదవండి.. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత మృతి
Comments
Please login to add a commentAdd a comment