జెరూసలెం: గాజాలో ఆహారం కోసం ఎగబడిన సమయంలో జరిగిన కాల్పుల్లో 104 మంది మృతి చెందిన ఘటనపై ఇజ్రాయెల్ స్పందించిది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం అర్ధరాత్రి ఒక ప్రకటన చేసింది. పశ్చిమ గాజాలోని అల్ నబుసి ప్రాంతానికి ఆహారం పంచడానికి ట్రక్కులు వచ్చినప్పుడు అక్కడి జనం ఒక్కసారిగా ఎగబడ్డారని తెలిపింది. ఆహారం తీసుకువచ్చిన ట్రక్కుల కింద పడి నలిగిపోవడంతో పాటు తొక్కిసలాట కారణంగానే ఈ ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు తెలిపింది.
దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విటర్)లో వీడియోలు విడుదల చేసింది. ‘ సాయం చేసే ట్రక్కులు రాగానే వాటిపై ఒక్కసారిగా వందల మంది ఎగబడ్డారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు వాహనాలను జనం మీదకు ఎక్కించారు. ఈ కారణంగా పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోయారు’అని ఇజ్రాయెల్ తెలిపింది.
“We recognize the suffering of the innocent people of Gaza. This is why we are seeking ways to expand our humanitarian efforts.”
— Israel Defense Forces (@IDF) February 29, 2024
Watch the full statement by IDF Spokesperson RAdm. Daniel Hagari on the incident regarding the humanitarian aid convoy the IDF facilitated. pic.twitter.com/m6Pve3Odqw
అయితే ఆహారం కోసం ఎగబడ్డ సమయంలో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడం వల్లే 104 మంది మృత్యువాత పడ్డారని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కాల్పులను పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఖండించారు. ఇదొక భయంకరమైన ఊచకోత అని ఆయన అభివర్ణించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజాపై బాంబులతో విరుచుకుపడటమే కాక గాజాను దాదాపు ఆక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment