అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. బుధవారం నాడు ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరోసారి అటవీ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. కాస్టిక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇప్పుడవి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి.
మరోమారు చెలరేగిన ఈ మంటలు కేవలం రెండు గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. శాంటా అనాలో వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదు. కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 19 వేల మందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో చెలరేగిన మంటల కారణంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా శాన్ డియాగో, ఓషన్‌సైడ్ సమీపంలో దక్షిణాన మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అగ్నిమాపక శాఖ అదుపు చేసిందన్నారు. లాస్ ఏంజిల్స్‌లో వీస్తున్న గాలుల కారణంగా మంటలు పదే పదే ఎగసిపడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ గంటకు 20 నుండి 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
దీని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాప దళానికి, వైమానిక దళానికి ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు వారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 22 వేల ఇళ్లు బూడిదయ్యాయి.
ఇది కూడా చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..
Comments
Please login to add a commentAdd a comment