జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే హమాస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
హమాస్ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోకి గ్లైడర్‌ల పైనుంచి చొచ్చుకు వచ్చి దాడి చేసే హమాస్ దళాలకు మురాద్ అబు మురాద్ శిక్షణ ఇచ్చేవారని వెల్లడించాయి.
ఇదిలా ఉంటే... పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 600 చిన్నారులతో 1,900 పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు.
ఇదీ చదవండి: 'భారత వాలంటీర్‌లతో ఇజ్రాయెల్‌కు మరో ఆర్మీ '
Comments
Please login to add a commentAdd a comment