aerial
-
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంగీకారం తెలిపారు. దాంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెర్టిపోర్ట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ జోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టాక్సీ పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయనున్నారు. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎయిర్ కండిషన్డ్ వెర్టిపోర్ట్లను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీల సహకారం తీసుకోనున్నారు. జాబీ ఏవియేషన్, సైపోర్ట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు తమ సేవలందించనున్నాయి. జాబీ ఏవియేషన్ విమానాల తయారీ, కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. స్కైపోర్ట్ మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రస్తుత రవాణా వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సర్వీసులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుజాబీ ఏవియేషన్ తయారు చేసిన ఏరియల్ టాక్సీ ఎస్4 మోడల్ సున్నా ఉద్గారాలతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. అది నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. దీని గరిష్ట వేగం 321 కిమీ/గం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్4 ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్టీఏ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ), దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ), స్కైపోర్ట్, జాబీ ఏవియేషన్‌లు ఏరియల్ టాక్సీ సేవలకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
వైమానిక యోగా!
బిజీ లైఫ్ స్టైల్లో తీవ్ర ఒత్తిడి, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా, ధ్యానం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోగాలో కూడా కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ఏరియల్ యోగా.. దీన్నే రోప్ యోగా అని కూడా అంటారు. సాధారణంగా కింద కూర్చుని యోగాసనాలు వేయడం కామన్.. కానీ గాల్లో వేలాడుతూ వివిధ యోగాసనాలు చేయడమే ఏరియల్ యోగా స్పెషల్ అన్నమాట. గాల్లో యోగాసనాలు ఎలా వేస్తారనే కదా మీ అనుమానం. దీని గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. ఏరియల్ యోగాలో చీర పరిమాణంలో ఉన్న ఒక వస్త్రాన్ని పైనుంచి ఊయల మాదిరిగా వేలాడదీస్తారు. ఆ వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవాలి. ఇక, వస్త్రాన్ని శరీరానికి చుట్టుకున్న తర్వాత వివిధ యోగాసనాలు వేస్తుంటారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ పరిష్కారంగా నిలుస్తోంది.జీర్ణక్రియకు తోడ్పాటు.. ఏరియల్ యోగాతో జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని సాగతీయడంతో పొత్తికడుపు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పేగు సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కడుపు నొప్పి లేదా గ్యాస్ ఉంటే ఏరియల్ యోగాతో తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది..ఏరియల్ యోగా శరీర కండరాలు సాగేలా చేస్తుంది. గాల్లో ఉంటారు కాబట్టి.. శరీరాన్ని మరింత స్ట్రెచ్ చేసేందుకు వీలు కలుగుతుంది. కొద్ది రోజులకు శరీరం మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వెన్నెముక, భుజం శక్తివంతంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.ఒత్తిడిని తగ్గించే ఆయుధం.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఏరియల్ యోగా చాలా ఉత్తమమైన వ్యాయామం అని చెప్పొచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రవర్తనలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గి స్తుంది. గాల్లో తల్లకిందులుగా వేలాడుతూ.. ధ్యానం చేస్తుంటే మంచి ఆలోచనలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏరియల్ యోగాతో మెదడులో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఆరోగ్యం మన సొంతమయ్యేలా చేస్తుంది.వెన్నునొప్పి హుష్‌కాకి.. వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా వెన్నెముక, దాని సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఏరియల్ యోగా ఎంతో ప్రభావం చూపుతుంది. వస్త్రంలో పడుకుని వెనక్కి అలా వంగి కాసేపు ఆసనం వేస్తే వెన్నెముక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఏరియల్ యోగాతో శరీర తీరుతో పాటు వెన్నెముకను సరిచేసుకోవచ్చు. నడుము నొప్పి కూడా తగ్గుతుంది.బరువు తగ్గిపోతుంది.. ఏరియల్ యోగా బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 50 నిమిషాల పాటు ఏరియల్ యోగా చేస్తే దాదాపు 320 కేలరీలు బర్న్ చేయగలదు. శరీర కొవ్వును బర్న్ చేసేటప్పుడు ఇది టోన్డ్, లీన్ కండరాలను పొందడానికి సహాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.నిపుణుల పర్యవేక్షణలో ..యోగా చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సొంతంగా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎవరైనా గురువు దగ్గర నేర్చుకుని ఆ తర్వాతే అభ్యాసం చేయాలి. కొన్ని యోగాసనాలు చేస్తే పర్వాలేదు. అన్ని ఆసనాలు అందరూ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా క్రమపద్ధతిలో చేయాలి. – శ్రీకాంత్ నీరటి, యోగా ట్రైనర్యోగాతో ఎన్నో ప్రయోజనాలుయోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పతంజలి సూచించిన అష్టాంగ మార్గాల్లోని యమ, నియమను పాటిస్తూ యోగా సనాలు వేయాలి. అప్పుడే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయి. స్థితప్రజ్ఞత సాధించేందుకు యోగా అత్యున్నత మార్గం. – నెతికార్ లివాంకర్, యోగా ట్రైనర్, రామకృష్ణ మఠంకాని్ఫడెన్స్ పెరుగుతుంది.. ఏరియల్ యోగా లేదా యాంటీ గ్రావిటీ యోగా ద్వారా శరీరం చాలా బలంగా తయారవుతుంది. అలాగే మనపై మనకు కాన్ఫిడెన్స్తోపాటు జ్ఞాపకశక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే సాధారణ యోగాలో కొంతకాలం అనుభవం ఉన్న వారు మాత్రమే దీనిని చేయాలి. ముఖ్యంగా గురువుల సమక్షంలో చేస్తే మంచిది. – కొండకళ్ల దత్తాత్రేయ రావు, అద్వైత యోగా సెంటర్ -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే హమాస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. నిన్న రాత్రి జరిగిన వైమానికి దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ వైమానిక విభాగానికి అధిపతిగా పనిచేసిన మురాద్ అబు మురాద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ వైమానిక కార్యకలాపాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోకి గ్లైడర్ల పైనుంచి చొచ్చుకు వచ్చి దాడి చేసే హమాస్ దళాలకు మురాద్ అబు మురాద్ శిక్షణ ఇచ్చేవారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే... పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 600 చిన్నారులతో 1,900 పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: 'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్‌కు మరో ఆర్మీ ' -
17వ శతాబ్దానికి చెందిన " బన్సీలాల్‌పేట మెట్ల బావి " ఏరియల్ వ్యూ
-
ఏరియల్ వ్యూలో మల్లన్నసాగర్‌ను వీక్షించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ వ్యూ ద్వారా మల్లన్నసాగర్ జలాశయాన్ని వీక్షించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రయాన్ని సందర్శించిన అనంతరం ఆయన హెలికాప్టర్ ద్వారా గజ్వేల్‌లోని నివాసానికి బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో మల్లన్నసాగర్‌ను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం వీక్షించారు. -
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..!!
న్యూఢిల్లీ: బటన్ నొక్కగానే ట్యాక్సీలాగా విమానమే ఇంటి ముంగిట్లో వాలితే.. గంటల తరబడి ట్రాఫిక్ జంఝాటాలేమీ లేకుండా క్షణాల్లోనే గమ్యస్థానాలకు ఎగిరిపోగలిగితే.. అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్లా అనిపిస్తోంది కదూ.. అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల దిగ్గజం ఉబెర్ ప్రస్తుతం దీన్ని సాకారం చేసే ప్రయత్నాల్లోనే ఉంది. త్వరలోనే ఎయిర్‌ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎలివేట్ పేరుతో అందించే ఈ సర్వీసుల కోసం భారత్ సహా పలు దేశాల్లో అవకాశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఆరు నెలల్లోగా అనువైన నగరాల ఎంపిక పూర్తి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ముందుగా తొలి విడతలో అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజెలిస్‌లలో ఏరియల్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించాలని.. అంతర్జాతీయంగా మరో నగరాన్ని ఎంపిక చేయాలని ఉబెర్ యోచిస్తోంది. దీనికోసం భారత్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్‌లను షార్ట్ లిస్ట్ చేసింది. వీటిల్లో ఒకదాన్ని అమెరికాకు వెలుపల ఉబెర్ ఎయిర్ సిటీగా ఎంపిక చేయనున్నట్లు ఉబెర్ పేర్కొంది. మార్కెట్ పరిమాణం, అనుకూల పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. 2020 నాటికి ప్రయోగాత్మకంగా పరిశీలన.. ప్రయోగాత్మక ఫ్లయిట్స్‌ను 2020 కల్లా ప్రారంభించాలని, 2023 నాటికి మూడు నగరాల్లో వాణిజ్యపరంగా సేవలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ఉబెర్ ఏవియేషన్ ప్రోగ్రామ్స్ హెడ్ ఎరిక్ అలిసన్ వెల్లడించారు. భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాలన్నా గంటల తరబడి సమయం పట్టేస్తుందని.. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వీసులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఉబెర్ పేర్కొంది. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలిగే వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీవోఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ సేవలకు ఉపయోగించాలని సంస్థ భావిస్తోంది. ఎత్తైన భవంతుల మీద వీటికోసం హెలీప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. పదిహేను నిమిషాల దూరానికి 129 డాలర్లు ఉబెర్ ఎలివేట్ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని మెరీనా, శాన్జోసీకి ఉబెర్ క్యాబ్‌లో వెడితే 1 గంట 40 నిమిషాలు (56.9 మైళ్లు), కాల్ట్రెయిన్లో వెడితే(55.4 మైళ్లు) 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. అయితే, ఉబెర్ ఎలివేట్ ఎయిర్ ట్యాక్సీలో 15 నిమిషాలే (43.3 మైళ్లు) పడుతుంది. ప్రారంభంలో ఇందుకు చార్జీలు 129 డాలర్లు(సుమారు రూ. 9,030)గా ఉన్నా ఆ తర్వాత 43 డాలర్లకు(3,010), దీర్ఘకాలంలో 20 డాలర్లకు(1,400) తగ్గే అవకాశాలు ఉన్నా యి. ప్రస్తుతం ఇదే దూరానికి ఉబెర్ ఎక్స్ క్యాబ్‌కి 111 డాలర్లు(సుమారు రూ. 7,700), ఉబెర్‌పూల్ (షేరింగ్)కి 83 డాలర్లు(రూ. 5,810) అవుతోంది. -
అసోం వరదల్లో 26 మంది మృతి.. హోం మంత్రి సమీక్ష..
గౌహతిః అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో లక్షలమంది జనం ఇక్కట్లు పడుతున్నారు. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే వరదల కారణంగా 26 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు వరద బాధిత ప్రాంతాల్లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్ర మంత్రి జితేంద్రసింగ్ లతో కలసి నష్టాలను అంచనావేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కేంద్రం 4 లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న అసోం రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్రమంత్రి జితేంద్రసింగ్ లతో కలసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వరద పరిస్థితులపై అక్కడి అధికారులతో సమీక్షించిన రాజ్ నాథ్.. సుమారు 60 ఎన్జీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం పరిష్కారం కాదని, రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రాజ్ నాథ్ తెలిపారు. వరద పరిస్థితులను సమీక్షించేందుకు ఉదయం ఢిల్లీనుంచీ గౌహతి బయల్దేరేందుకు ముందుగా ఆయన.. తన పర్యటన వివరాలను ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని సుమారు 36 లక్షలమంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకూ వరదల కారణంగా 26 మంది వరకూ మృతి చెందారని రాజ్ నాథ్ తెలిపారు. ఎడ తెరపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. నదులు పొంగి ప్రవహించడంతో ఈ పరిస్థితి ఏర్పండిందన్నారు. లఖింపూర్, గోలాఘాట్, బొంగాయిగాన్, జోర్హాట్, ధీమాజీ, బర్పేటా, గావాల్పర్, ధుబ్రీ, దర్రాంగ్, మోరిగావ్, సోనిత్పూర్ జిల్లాలు అత్యధికంగా వరదల వల్ల నష్టపోయినట్లు 'అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ' (ఏఎస్డీఎమ్ఏ) వెల్లడించింది. అలాగే శివసాగర్, కోక్రజ్హర్, దిబ్రుఘర్, గోల్పారా, తిన్షుకియా,బిశ్వనాథ్, నల్బారీ, బక్సా, ఉదల్ గ్లురీ, కామ్రప్ (ఎం) ఛిరాంగ్ జిల్లాలు కూడా వరద ముంపునకు గురైనట్లు ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. గౌహతి, నేమాతిఘట్, తేజ్‌పూర్, గోల్పారా, ధుబ్రీల్లోని బ్రహ్మపుత్రానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 27 అగ్నిమాపక కేంద్రాలతో కలసి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి, ఆహారం, మందులు సైతం అందిస్తున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఏరియల్ కొత్త ‘షేర్ ద లోడ్’ ప్యాక్ ను ఆవిష్కరిస్తున్న ఇర్ఫాన్ ఖాన్
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన సతీమణితో కలిసి ల్యాండ్రీ క్యాలెండర్‌తో కూడిన ఏరియల్ కొత్త ‘షేర్ ద లోడ్’ ప్యాక్‌ను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. -
లోహ విహంగాల మృత్యు హేల
అమెరికా దాదాపు గత పదిహేనేళ్లుగా సాగిస్తున్న మానవ రహిత వైమానిక యుద్ధంలోని ఇద్దరు పౌరుల మరణాలకు అసాధారణమైన రీతిలో ఆ దేశాధ్యక్షుడు ఈ నెల 23న క్షమాపణలు చె ప్పుకోవాల్సి వచ్చింది. దీంతో యుద్ధరంగంలో ద్రోన్లుగా పిలిచే మానవ రహిత విమానాల ప్రయోగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2001 నుంచి అమెరికా, అఫ్గానిస్తాన్ యుద్ధంలో ‘ప్రిడేటర్ల’నే ద్రోన్లతో ‘హెల్ఫైర్’ క్షిపణులను ప్రయోగిస్తోంది. అప్పటి నుంచి ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు బలైపోతూనే ఉన్నారు. ఈ పౌర మరణాలపైనేగాక, అసలు ఈ ద్రోన్ల యుద్ధమే అంతర్జాతీయ యుద్ధ నియమాలకు, మానవ హక్కుల ప్రకటనకు విరుద్ధమనే తీవ్ర విమర్శలను అమెరికా ఇంటాబయటా ఎదుర్కొంటోంది. అఫ్గాన్, పాకిస్థాన్, యెమెన్, సిరియా, సోమాలియా తదితర దేశాల్లో అమెరికా చేసిన, చేస్తున్న ద్రోన్ దాడుల మృతుల్లో అత్యధికులు పౌరులేనంటూ అంతర్జాతీయ మీడియా పలు కథనాలను వెలువరిస్తోంది. ఆత్మరక్షణ కోసం చేసే యుద్ధాన్ని లేదా దాడులను మాత్రమే అంతర్జాతీయ చట్టాలు న్యాయసమ్మతంగా పరిగణిస్తాయి. పాక్‌పై అమెరికా యుద్ధం ప్రకటించలేదు. అయినా అక్కడా ద్రోన్ దాడులు సాగుతూనే ఉన్నాయి. 2014 అక్టోబర్‌లో అమెరికా పాక్‌లో జరిపిన 400వ ద్రోన్ దాడిని పురస్కరించుకొని వేడుకను కూడా జరుపుకుంది. పాక్‌లో ద్రోన్ దాడుల మృతుల సంఖ్య 2,379 అని అది ప్రకటించింది. వారిలో 12 శాతం మాత్రమే మిలిటెంట్లుగా సీఐఏ గుర్తించిన వారని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. వేల మంది పౌరులు మరణిస్తున్నా పట్టించుకోనిది ఇద్దరి మృతికి అమెరికా అధ్యక్షుడంతటి వాడే క్షమాపణ చెప్పడం పెద్ద వార్తయింది. ఆ ఇద్దరూ తాలిబన్ల చేతుల్లో బందీలుగా ఉన్న అమెరికా, ఇటలీ జాతీయులైన సహాయ కార్యకర్తలు. డాక్టర్ వారెన్ వీన్‌స్టీన్ అనే అమెరికన్ 2011 నుంచి, గివొన్ని లో పోర్టో అనే ఇటాలియన్ 2012 నుంచి బందీలుగా ఉన్నారు. అఫ్గాన్ సరిహద్దుల్లోని పాక్ భూభాగం ఉత్తర వజీరిస్తాన్‌లో జనవరి 15న వారిద్దరూ ద్రోన్ దాడిలో మృతి చెందినట్టు అప్పట్లోనే పాక్ పాత్రికేయులు తెలిపారు. రెండున్నర నెలలకు ఆ వార్తను ధృవీకరించారు. దేశ సర్వసేనానిగా ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తున్నానంటూ బరాక్ ఒబామా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, హృదయపూర్వక క్షమాపణలను తెలిపారు. మరోవంక ఆ దాడి ‘‘అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ సమాచారం’’పై ఆధారపడి జరిగినదేననీ స్పష్టం చేశారు. మిగతా సమాచారమంతా ప్రభుత్వ రహస్యమన్నారు. కాగా ఆ దాడి జరిపిన చోట కచ్చితంగా ఎవరున్నారో తెలియదనీ, అల్‌కాయిదా నేతలు వచ్చిపోతుండే ఆవరణ అనే సమాచారంతోనే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సీనియర్ అధికారి ఒకరు ఆ దాడికి ఆదేశించారని శ్వేతసౌధమే తెలిపింది. కచ్చితంగా లక్ష్యాలపైనే జరిగే ‘ప్రిసిషన్’ దాడులుగా పిలిచే ద్రోన్ దాడులు ఎంత గుడ్డిగా సాగుతున్నాయో స్పష్టమే. ‘‘ఏ ఒక్క ద్రోన్ దాడిలోనూ ఎవరిని చంపుతున్నారనేది తెలీనే తెలియదు’’అని అమెరికా పౌర హక్కుల సంఘం అంటోంది. అమెరికా సాగిస్తున్నది ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ యుద్ధం కాబట్టి అది ఎక్కడ దాడి చేస్తే అది యుద్ధ ప్రాంతం, అక్కడి పౌర మరణా లన్నీ అనివార్యమైనవే అనే తర్కమే ఈ దాడులకు మార్గదర్శకత్వం వహిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. పాక్ ప్రభుత్వాలు లాంఛనంగా తమ భూభాగంపై అమెరికా ద్రోన్ దాడులను ఖండిస్తున్నా అవి పాక్ తాలిబన్లు లక్ష్యంగా సాగుతున్నవి కాబట్టి మౌనంగా మద్దతు పలుకుతున్నాయి. అయినా ఈ నెల 7న పాక్‌లోని ఒక క్రిమినల్ న్యాయస్థానం ద్రోన్ దాడిలో ఒక పాత్రికేయుడ్ని, ఒక ఉపాధ్యాయుడ్ని, అతని కుమారుడ్ని చంపిన కేసులో ఇద్దరు అమెరికన్ అధికారులు దోషులని తీర్పు చెప్పింది. 2009 నాటికి పాక్‌లోని సీఐఏ అత్యున్నతాధికారులుగా ఉన్న ఆ ఇద్దరూ 2010లోనే అమెరికాకు చేరారు. అమెరికా వారిని పాక్‌కు అప్పగించేది లేదని తేల్చేసింది. ఇలాంటి చిక్కులు వస్తాయనే అమెరికా తన ద్రోన్ స్థావరాలను ఇతర మిత్ర దేశాలకు మార్చేసింది. జర్మనీలోని రమ్‌స్టీన్‌లోని అలాంటి స్థావరం ఇటీవల రచ్చకెక్కింది. జర్మనీ చట్టాలు తమ భూభాగం నుంచి ఎవరు యుద్ధ నేరాలకు పాల్పడినా విచారించే హక్కును అక్కడి కోర్టులకు కల్పిస్తాయి. చట్టాలకు దొరక్కుండా నేరగ్రస్త ముఠాలు అనుసరించే పద్ధతుల్లో రమ్‌స్టీన్‌లోని ద్రోన్ల కమాండ్ సెంటర్లను అమెరికాలో ఏర్పాటు చేశారు. రమ్స్టీన్ నుంచి అఫ్గాన్, పాక్, యెమెన్లలో దాడులు జరుపుతున్న ద్రోన్ల పైలట్లు ఉండేది అమెరికాలో. కాబట్టి వారు జర్మన్ చట్టాలకు అతీతులు. చట్టాలను వంచించే ఇలాంటి పద్ధతులు మరింతగా అమెరికా ప్రతిష్టను దిగజారుస్తున్నాయనే విమర్శలను ఒబామా లెక్క చేయడం లేదు. ‘‘గుండెలు చెదిరిపోయేలా చేసే పౌర మరణాలకు కారణమౌతున్నా మన కాల్బలాలను దించడం కంటే ద్రోన్ దాడులే సురక్షిత ప్రత్యామ్నాయం’’ అని ఆయన 2013లోనే స్పష్టం చేశారు. సురక్షితమంటే తమ సైన్యం మరణాలను జీరో స్థాయికి తగ్గించడమనే అర్థం. కాబట్టి ఇకపై అమెరికా ఉగ్రవాదులున్న ప్రాంతంగా భావించిన ఎక్కడైనా ఈ ‘‘సురక్షిత ప్రత్యామ్నాయా’’న్నే అనుసరిస్తుంది. ఇంతవరకు తనకే పరిమితం చేసుకున్న ఈ ‘‘సురక్షిత ప్రత్యామ్నా యాన్ని’’ మిత్ర దేశాలకు కూడా అందించాలని ఫిబ్రవరిలో అది నిర్ణయించింది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియా నుంచి ఈజిప్ట్ వరకు పలు దేశాలకు అమెరికా ప్రిడేటర్లు అందుతాయి. నేడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న ఆయుధాలన్నీ ఇరాక్ సేనలకు అమెరికా అందించినవే. అల్‌కాయిదా ఆయుధాలన్నీ అఫ్గాన్ ముజాహిదీన్లకు అది సమకూర్చినవే. కాబట్టి ఈ ‘‘సురక్షిత ప్రత్యామ్నాయం’’ ఉగ్రవాద మూకలకు అందదనుకోవడం హాస్యాస్పదం. అమెరికా ఆడుతున్న ఈ ప్రమాద కరమైన ఆట మొత్తంగా ప్రపంచ పౌరులందరికీ, ప్రత్యేకించి సీమాంతర ఉగ్ర వాదమనే పెను ముప్పును ఎదుర్కొంటున్న మనకు మరింత ప్రమాదకరం. అందుకే ద్రోన్ల వ్యతిరేక అంతర్జాతీయ పోరాటం నేటి ఆవశ్యకత.