ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా ట్వీట్.. నెట్టింట దుమారం | Mia Khalifa Post On Hamas Attacks In Israel Costs Her Business Deal With Canadian Broadcaster - Sakshi
Sakshi News home page

Mia Khalifa Post On Israel War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా ట్వీట్.. నెట్టింట దుమారం

Published Tue, Oct 10 2023 1:11 PM | Last Updated on Tue, Oct 10 2023 1:46 PM

Mia Khalifa Post On Attacks In Israel Costs Business Deal - Sakshi

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం క్రమంలో ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా వివాదంలో చిక్కుకున్నారు. పాలస్తీనాకు మద్దతుగా పోస్టు చేసిన నేపథ్యంలో  కెనడాకు చెందిన ఓ కంపెనీ ఆమెతో బిజినెస్ డీల్‌ను రద్దు చేసుకుంది. అంతేకాకుండా మియా పోస్టుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దారుణమైన దాడులకు తెగబడ్డారు. ఈ యుద్ధంలో వందలాది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్ దళాలను మియా ఖలీఫా స్వాతంత్య్ర సమరయోధులుగా కీర్తిస్తూ ట్విట్టర్‌(ఎక్స్‌)లో పోస్టు చేశారు. ఇది కాస్త నెట్టింట వివాదాస్పదంగా మారింది. ఎంతలా అంటే.. కెనడియన్ బ్రాడ్‌కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ షాపిరో.. మియా ఖలీఫాను వ్యాపార ఒప్పందం నుండి తప్పించారు.

“ఇది చాలా భయంకరమైన ట్వీట్. మియా ఖలీఫా దయచేసి అభివృద్ధి చెందండి. మంచి మనిషిలా మారండి.  మీ అజ్ఞానానికి ఏ పదాలు లేవు. ముఖ్యంగా విషాదం ఎదురైనప్పుడు మనుషుల మధ్య శాంతి నెలకొనేలా స్పందించాలి. మీరు మంచి వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. మన బిజినెస్ డీల్‌ నుంచి మీరు తొలగింపబడ్డారని భావించండి.”అని షాపిరో ఎక్స్‌లో చెప్పారు.

షాపిరో ట్వీట్‌కు స్పందించిన మియా ఖలీఫా.. తన నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రీట్వీట్ చేశారు. 'పాలస్తీనాకు మద్దతు తెలిపి ఓ డీల్‌ను మాత్రమే కోల్పోయాను. కానీ ఏ మాత్రం ఆరా తీయకుండా  యుదులకు మద్దతు తెలిపే వ్యక్తితో డీల్‌ ఏర్పాటుకు సిద్ధమైనందుకు నాపైనే నాకు కోపంగా ఉంది' అంటూ మియా ఖలీఫా ట్వీట్ చేశారు. తన ట్వీట్ హింసను ప్రేరేపించబోదని తెలిపిన మియా ఖలీఫా.. పాలస్తీనా ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. కాబట్టే తాను స్వాతంత్య్ర సమరయోధులు అని పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.

తన గురించి ఆలోచించే ముందు మీ చిన్న కంపెనీకి ఓ దిశా నిర్దేశం లేదని విచారించండి అంటూ షాపిరోని మియా ఖలీఫా విమర్శించారు. పోరాడే ప్రజల పక్షానే తాను ఉంటానని చెప్పారు. తాను లెబనాన్ నుంచి వచ్చినట్లు పేర్కొన్న మియా ఖలీఫా.. వలసవాదం వైపు ఉంటానని ఎలా ఆశిస్తున్నారని షాపిరోని దుయ్యబట్టారు.

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర పోరు నడుస్తోంది. యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్‌ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్‌ ప్రకటించింది.

ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement