Business Deals
-
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా ట్వీట్.. నెట్టింట దుమారం
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం క్రమంలో ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా వివాదంలో చిక్కుకున్నారు. పాలస్తీనాకు మద్దతుగా పోస్టు చేసిన నేపథ్యంలో కెనడాకు చెందిన ఓ కంపెనీ ఆమెతో బిజినెస్ డీల్‌ను రద్దు చేసుకుంది. అంతేకాకుండా మియా పోస్టుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దారుణమైన దాడులకు తెగబడ్డారు. ఈ యుద్ధంలో వందలాది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. Can someone please tell the freedom fighters in Palestine to flip their phones and film horizontal — Mia K. (@miakhalifa) October 7, 2023 ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్ దళాలను మియా ఖలీఫా స్వాతంత్య్ర సమరయోధులుగా కీర్తిస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు. ఇది కాస్త నెట్టింట వివాదాస్పదంగా మారింది. ఎంతలా అంటే.. కెనడియన్ బ్రాడ్‌కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ షాపిరో.. మియా ఖలీఫాను వ్యాపార ఒప్పందం నుండి తప్పించారు. This is such a horrendous tweet @miakhalifa. Consider yourself fired effective immediately. Simply disgusting. Beyond disgusting. Please evolve and become a better human being. The fact you are condoning death, rape, beatings and hostage taking is truly gross. No words can… https://t.co/ez4BEtNzj4 — Todd Shapiro (@iamToddyTickles) October 8, 2023 “ఇది చాలా భయంకరమైన ట్వీట్. మియా ఖలీఫా దయచేసి అభివృద్ధి చెందండి. మంచి మనిషిలా మారండి. మీ అజ్ఞానానికి ఏ పదాలు లేవు. ముఖ్యంగా విషాదం ఎదురైనప్పుడు మనుషుల మధ్య శాంతి నెలకొనేలా స్పందించాలి. మీరు మంచి వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. మన బిజినెస్ డీల్ నుంచి మీరు తొలగింపబడ్డారని భావించండి.”అని షాపిరో ఎక్స్‌లో చెప్పారు. I’d say supporting Palestine has lost me business opportunities, but I’m more angry at myself for not checking whether or not I was entering into business with Zionists. My bad. https://t.co/sgx8kzAHnL — Mia K. (@miakhalifa) October 8, 2023 షాపిరో ట్వీట్‌కు స్పందించిన మియా ఖలీఫా.. తన నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రీట్వీట్ చేశారు. 'పాలస్తీనాకు మద్దతు తెలిపి ఓ డీల్‌ను మాత్రమే కోల్పోయాను. కానీ ఏ మాత్రం ఆరా తీయకుండా యుదులకు మద్దతు తెలిపే వ్యక్తితో డీల్ ఏర్పాటుకు సిద్ధమైనందుకు నాపైనే నాకు కోపంగా ఉంది' అంటూ మియా ఖలీఫా ట్వీట్ చేశారు. తన ట్వీట్ హింసను ప్రేరేపించబోదని తెలిపిన మియా ఖలీఫా.. పాలస్తీనా ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. కాబట్టే తాను స్వాతంత్య్ర సమరయోధులు అని పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. I just want to make it clear that this statement in no way shape or form is enticing spread of violence, I specifically said freedom fighters because that’s what the Palestinian citizens are… fighting for freedom every day https://t.co/U9mLwzqnnT — Mia K. (@miakhalifa) October 9, 2023 తన గురించి ఆలోచించే ముందు మీ చిన్న కంపెనీకి ఓ దిశా నిర్దేశం లేదని విచారించండి అంటూ షాపిరోని మియా ఖలీఫా విమర్శించారు. పోరాడే ప్రజల పక్షానే తాను ఉంటానని చెప్పారు. తాను లెబనాన్ నుంచి వచ్చినట్లు పేర్కొన్న మియా ఖలీఫా.. వలసవాదం వైపు ఉంటానని ఎలా ఆశిస్తున్నారని షాపిరోని దుయ్యబట్టారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర పోరు నడుస్తోంది. యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
యాక్సిస్ గూటిలో సిటీ రిటైల్
న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్ బిజినెస్ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్ సిటీ కస్టమర్లను యాక్సిస్ పొందింది. డీల్ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్ మరో 2.5 మిలియన్ క్రెడిట్ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్ బుక్ కలిగిన యాక్సిస్ సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 3 మిలియన్ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్ బ్యాంక్ వినియోగించుకోనుంది. -
‘పది హ్యాట్రిక్కుల’ మొనగాడు.. అదిరిపోయే డీల్
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్‌బాల్ మొనగాడు. యూరోపియన్ క్వాలిఫైయర్స్(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్ తరపున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో లగ్జెంబర్గ్ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్తోనూ వార్తల్లోకెక్కాడు మరి. సింగపూర్ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్) ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ పీటర్ లీమ్కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్‌కు చెందిన మింట్ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్‌ఫామ్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్‌బాల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్బాల్ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ను జాయింట్‌గా రిలీజ్ చేశారు రొనాల్డో-లీమ్. పోర్చ్‌గల్ కెప్టెన్ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్ గోల్స్, పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ గణాంకాలు చెప్తున్నాయి. Unlucky 😢 What a bicycle kick 😭#CristianoRonaldo #CR7 #bicyclekick pic.twitter.com/18EVZ34BWo — Habibulla Sonet (@HabibullaSonet) October 12, 2021 చదవండి: ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
బాయ్‌ఫ్రెండ్‌గా కొనసాగాలంటే..బాండ్ మీద సంతకం చేయాల్సిందే..!
టిండర్ ఈ యాప్ గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా..! టిండర్ ఒక డేటింగ్ యాప్. ఈ యాప్‌తో తమకు నచ్చిన వ్యక్తులను పరిచయం చేసుకోని వారితో డేటింగ్ చేస్తూ వారి అభిరుచులను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌తో కలుసుకున్న జంటలు కొన్ని పెళ్లి వరకు కూడా పోయాయి. మరి కొంత మందికి సరైన జోడి వెతుకులాటలో మోసపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. చదవండి: Apple : మూఢనమ్మకాలను నమ్ముతున్న ఆపిల్..! ఎంతవరకు నిజం..? తాజాగా అమెరికాకు చెందిన యానీ రైట్ అనే మహిళ టిండర్‌లో పరిచయమైన మైక్ హెడ్‌తో మొదటిసారి డేటింగ్ చేశాక తన బాయ్‌ఫ్రెండ్‌గా స్వీకరించడంకోసం విచిత్రమైన ఐడియాతో ముందుకొచ్చింది. గతంలో తనకు జరిగిన పొరపాటును తిరిగి పునరావృతం కాకుండా ఉండడం కోసం పకడ్బందీగా ఒక బిజినెస్ డీల్ లాగా 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి తనకు హమీ ఇవ్వాలని కాబోయే బాయ్‌ఫ్రెండ్‌కు తెలిపింది. బాండ్లో ఉన్న కట్టుబాట్లకు కచ్చితంగా నడుచుకుంటాననే హమీ ఇస్తేనే బాయ్‌ప్రెండ్‌గా స్వీకరించడానికి సిద్ధమని మైక్ హెడ్‌తో పేర్కొంది. తొలుత షాక్‌కు గురైన మైక్ హెడ్ 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి యానీకి బాయ్ ఫ్రెండ్‌గా కొనసాగుతున్నాడు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరువురు నిజాయితీని, ఒకరికొకరికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో, ఇరువురు మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలని ఒప్పందంలో ఉన్నాయి. కాగా ఈ జోడీ ఈ బంధాన్ని బిజినెస్ డీల్‌గానే చూస్తామనడం కొసమెరుపు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
బైజూస్ మెగా డీల్ @7,300 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తాజాగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 1 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7300 కోట్లు) చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనున్నట్లు అభిప్రాయపడ్డాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు డిమాండ్ మరింత పెరగడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఇటీవల నిధుల సమీకరణ చేపట్టిన విషయం విదితమే. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంస్థతోపాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, బాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇంజినీరింగ్, మెడికల్ విద్యా శిక్షణలో పట్టున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కు దేశవ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలున్నాయి. బైజూస్‌తో డీల్‌లో భాగంగా ఆకాష్లో కంపెనీ వ్యవస్థాపకులు చౌధరీ కుటుంబ సభ్యులు వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆకాష్లోగల 37.5 శాతం వాటాకుగాను బైజూస్‌లో కొంత వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. జేఈఈ ప్రిపరేషన్‌కు ‘అమెజాన్ అకాడమీ’ అమెజాన్ ఇండియా ‘అమెజాన్ అకాడమీ’ పేరిట జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు అవసరమైన ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. గూగుల్‌ప్లే స్టోర్‌లో బీటా వర్షన్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా (ఎడ్యుకేషన్) డైరెక్టర్ అమోల్ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. చదవండి: ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం! మొబైల్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ ఆఫర్ -
బైడెన్‌కు షాక్.. వెలుగులోకి కుమారుడి బాగోతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ భారీ వివాదంలో చిక్కుకున్నారు. బైడెన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నప్పుడు అతడి కుమారుడు హంటర్ బైడెన్ విదేశీ పౌరులతో ముఖ్యంగా చైనీయులతో అనుసరించిన వ్యాపార లావాదేవీలకు సంబందించిన ఒక నివేదికను సెనేట్ రిపబ్లికన్లు బుధవారం విడుదల చేశారు. 87 పేజీల ఈ మధ్యంతర నివేదికలో హంటర్ బైడెన్, డెవాన్ ఆర్చర్ చైనా ప్రభుత్వంతో బలమైన సంబంధాలు కలిగి ఉన్న చైనా పౌరులతో అనేక ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు వెల్లడిస్తుంది. వీరిలో ప్రధానంగా సీఈఎఫ్‌సీ చైనా ఎనర్జీ కో లిమిటెడ్ వ్యవస్థాపకుడు, దాని అనుబంధ సంస్థ చైనా ఎనర్జీ ఫండ్ కమిటీ(సీఈ ఫండ్) బోర్డు చైర్మన్ యే జియాన్మింగ్ ఉన్నాడు. అతడితో పాటు యే సహచరుడు, అతని కంపెనీల లావేదేవీల కేర్ టేకర్ గోంగ్వెన్ డాంగ్ కూడా ఉన్నట్లు నివేదిక తెలుపుతుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో యే బలమైన, విస్తృతమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. చైనా ఆర్మీతో కూడా అతడికి గతంలో సంబంధం ఉంది. (చదవండి: బైడెన్‌కే భారతీయుల బాసట) అంతేకాక యే జియాన్మింగ్కు, జో బైడెన్ సోదరుడు జేమ్స్ బైడెన్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. బైడెన్ కుటుంబ సభ్యులకు, చైనీయులకు మధ్య ఆర్థిక లావాదేవీలు, కార్పొరేట్ కనెక్షన్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. యే నుంచి హంటర్ బైడెన్ లక్షలు సంపాదించినట్లు నివేదిక తెలిపింది. హంటర్ బైడెన్, అతని కుటుంబం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ పౌరులు, విదేశీ ప్రభుత్వాలతో భారీ ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. హంటర్ బైడెన్, ఆర్చర్ బురిస్మా కోసం పనిచేస్తున్న సమయంలో అవినీతిపరుడైన ఒలిగార్చ్ మైకోలా జ్లోచెవ్స్కీతో ఆర్థిక వ్యవహారాలు కొనసాగించారని నివేదిక తెలిపింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కాలంలో హంటర్ బైడెన్, ఆర్చర్ యాజమాన్యంలోని సంస్థలు భారీ మొత్తంలో డబ్బు సంపాదించాయని నివేదిక పేర్కొన్నది. (చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు) హంటర్ బైడెన్, అతని కుటుంబం గోంగ్వెన్ డాంగ్ వంటి ఇతర చైనా పౌరులతో కూడా సంబంధం కలిగి ఉంది. ఒక సందర్భంలో, గోంగ్వెన్ డాంగ్, హంటర్ బైడెన్ పేరిట జాయింట్ అకౌంట్ ఒపెన్ చేసిన తరువాత హంటర్, జేమ్స్, సారా బైడెన్లు 100,000 డాలర్లు ఖర్చు చేశారు. హంటర్ బైడెన్ కూడా గోంగ్వెన్ సంస్థల నుంచి కొన్ని మిలియన్ డాలర్లను అందుకున్నట్లు నివేదిక తెలిపింది. ఈ లావాదేవీలలో చాలావరకు నేర ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయని వెల్లడించింది. -
జెఫ్ బెజోస్- కిషోర్ బియానీ డీల్ సిద్ధం?
దేశీయ రీటైల్ మార్కెట్లో తన ఉనికిని మరింత పటిష్టం చేసేందుకు అమెరికన్ రీటైల్‌దిగ్గజం అమెజాన్ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెరికన్ ఆన్లైన్ రిటైలర్ అమెజాన్ దేశీయ కంపెనీ వాటాపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ స్థాపకుడు కిషోర్ బియానీతో ప్రాథమిక చర్చలు నిర్వహిస్తోంది. ఫ్యూచర్స్ రీటైల్ లిమిటెడ్‌లో రూ.2500 కోట్ల మేర దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తోందని ఎకానమిక్స్ టైమ్స్ నివేదించింది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా నిబంధనలు అనుమతినిస్తే 8-9సంవత్సరాల పాటు ఈ పెట్టుడులను పెట్టనుంది. ఫ్యూచర్ రీటైల్లో అమెజాన్ 9.5శాతం వాటాను కొనుగోలుకు సంబంధించి తొలి విడత చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపింది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ వచ్చే నెలలో ఈడీల్ వివరాలను ప్రకటించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఫ్యూచర్ రిటైల్ (స్టాక్-ఎక్స్చేంజ్ డేటా) 46.51వాటా బియానీ, అతని కుటుంబం సొంతం. ఫ్యూచర్ రీటైల్లో బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లు ఉన్నాయి. షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలను సొంతం చేసుకుంది. దీంతోపాటు అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ (మోర్)లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. మరోవైపు దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
త్వరలో జపాన్‌తో 2+2 చర్చలు
టోక్యో: భారత్, జపాన్ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు త్వరలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ మేరకు ఇరు దేశాలూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్–జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై వారు విస్తృత చర్చలు జరిపారు. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు తమతమ దేశాలను వాడుకోకుండా అన్ని దేశాలూ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం మోదీ ‘షింజో అబేతో ఫలప్రదమైన, విస్తృత చర్చలు జరిపాను. మరింత మెరుగైన ఆర్థిక బంధాలు, రక్షణ–భద్రత రంగంలో బలమైన సహకారంపై ప్రధానంగా మేం మట్లాడాం’ అని ట్విట్టర్లో తెలిపారు. భారత్–జపాన్ల బంధం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని అబే పేర్కొన్నారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది. శాంతంగా పరిష్కరించుకోవాలి.. చర్చల అనంతరం ఇండియా–జపాన్ దార్శనిక ప్రకటనను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా విడుదల చేశారు. ప్రపంచ దేశాలు సమస్యలను శాంతితో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప బెదిరింపులకు, బలప్రయోగాలకు దిగకూడదని కోరారు. ఇరుదేశాల పరస్పర అభివృద్ధి కోసం అవరోధాల్లేని వాణిజ్యం, పౌరుల వలసలు, సాంకేతికతను పంచుకోవడం తదితరాలపై భారత్, జపాన్‌లు కలిసి పనిచేయాలని తాము నిర్ణయించామన్నారు. ‘అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అణ్వస్త్ర వ్యాప్తి, అణు ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇద్దరం కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కూల్‌డ్రింక్ కన్నా జీబీ డేటా తక్కువ జపాన్‌లోని భారతీయులతోనూ మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. జపాన్‌లో స్థిరపడిన భారతీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దేశంలో డిజిటల్ మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడ్డాయనీ, ఇప్పుడు చిన్న కూల్‌డ్రింక్ బాటిల్ ఖరీదు కన్నా ఒక జీబీ డేటా ధర తక్కువగా ఉందన్నారు. అనంతరం మోదీ భారత్‌కు బయలుదేరారు. -
‘అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారత దేశంలో ‘ఎస్పీఐ సినిమాస్’ హాళ్లను ‘పీవీఆర్ సినిమాస్’ కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సత్యం సినిమా హాళ్లతో మాకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను ఎలా మరచిపోయేది?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఐ సినిమాస్‌ను సాధారణంగా సత్యం సినిమాస్‌గా వ్యవహరిస్తారు. వెన్న చిలకరించిన వివిధ ఫ్లేవర్ల పాప్‌కార్న్ ఇక తినే భాగ్యం లేదా ? అంటూ ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ఈ సత్యం థియేటర్లలో పాప్‌కార్న్ చాలా పాపులర్. అది అత్యంత రుచికరంగా ఉంటుంది. అది అమెరికాలోని ఓ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో పండిస్తున్న అధికోత్పత్తి రకం పాప్‌కార్న్ కావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుందని ఎస్పీఐ సినిమాస్‌లోని ‘ఎక్స్పీరియన్నెస్ విభాగం’ అధ్యక్షుడు భవేశ్ షా తెలిపారు. భారత్‌లో దొరికే పాప్‌కార్న్ తక్కువ దిగుబడినిచ్చే వంగడం నుంచి వచ్చేదని, ఇది లావుగా ఉండి, కాస్త గట్టిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాప్‌కార్న్ కాస్త సన్నగా, మృదువుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబైలోని ఎస్పీఐ సినిమాస్‌లో 71.7 శాతం వాటాను అంటే, 222,711 ఈక్విటీ వాటాను 633 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్లు దేశంలోనే అతిపెద్ద సినిమా థియేటర్ల చైన్‌ను కలిగిన పీవీఆర్ సినిమాస్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో దేశంలోని 60 నగరాల్లో పీవీఆర్‌కు సినిమా హాళ్ల సంఖ్య 703కు చేరుకుంది. ఎస్పీఐ సినిమాస్ వ్యవస్థాపకులైన కిరణ్ ఎం రెడ్డి, స్వరూప్ రెడ్డిలు తమ వ్యాపారంతో కొనసాగుతారని పీవీర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విక్రయంపై ట్విట్టర్ వినియోగదారులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇది విచారకరమైన వార్త. చెన్నై వాసులకు సత్యం ఒక ఆత్మ, ఒక అనుభూతి... మీరు మీ థియేటర్లను ఎవరికైనా అమ్ముకోండి. వారు వాటికి ఏ పేరైనా పెట్టుకోనియ్యండి, మా దృష్టిలో మాత్రం అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే... పీవీఆర్ అనేది ఓ పేరు మాత్రమే. సత్యం అన్నది మా భావోద్వేగం’ అంటూ కొందరు స్పందించగా ఎక్కువ మంది ‘మా పాప్ కార్న్ జోలికి రాకండి’ అంటూ అది అలాగే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకున్నారు. వారి కోరిక మేరకు సత్యం సినిమా హాళ్లలో పాత ఫుడ్ చైన్‌ను అలాగే కొనసాగిస్తామని పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నితిన్ సూద్ స్పష్టం చేశారు. -
ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండవు : ట్రంప్
అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాలన్నింటిన్నీ వదిలివేస్తానని సంచలన నిర్ణయం ప్రకటించిన అనంతరం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో తాను వైట్‌హోస్‌లో ఉన్నంత వరకు తన వ్యాపారాలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవని ప్రకటించారు. అయితే వటవృక్షంలో విస్తరించి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్‌లను ఎలా నిర్వహించబోతున్నారో అనే దానికి మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేసిన అనంతరం సోమవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. వాయిదా వేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వివాదాలు తనకు చుట్టుముట్టుకోకుండా ఉండేందుకు తీసుకోబోయే ప్లాన్స్‌ను వివరిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆ కాన్ఫరెన్స్‌ను ట్రంప్ వాయిదావేశారు. సమాచార ప్రసార సాధనంగా ఆయన ఎక్కువగా వాడే ట్విట్టర్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. తను అధ్యక్ష పదవి చేపట్టే ముందు వ్యాపారాలన్నింటిన్నీ తన కొడుకులు డాన్, ఎరిక్‌లకు అప్పజెప్పుతానని ప్రకటించారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలను నడిపిస్తారని ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ తన వైట్‌హోస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి కొత్త డీల్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడిగా ఉన్నంతమాత్రానా వ్యాపారాలు చేయకూడదని ఎలాంటి చట్టాలు లేకపోయినా.. తాను మాత్రం పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఉండటానికే కృషిచేస్తానని వాగ్దానం చేశారు. బ్యాంకు రుణాలు, లీజులు వంటి డీల్స్ అవసరమయ్యే తన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆయన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. సీఎన్ఎన్ అనాలిసిస్ ప్రకారం ట్రంప్ మొత్తం 500 కంపెనీలను కలిగి ఉన్నారు. వాటిలో 150 కంపెనీలు టర్కీ, ఖత్తర్, సౌదీ అరేబియా వంటి కనీసం 25 విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. -
నయా కిడ్నాపింగ్ గ్యాంగ్
బిజినెస్ డీల్స్ పేరుతో వ్యాపారులకు ఎర బెంగళూరుకు పిలిచి కిడ్నాప్ నగరానికి చెందిన ముగ్గురిని రక్షించిన పోలీసులు అక్కడి మాజీ కార్పొరేటర్ కుమారుడు సూత్రధారి సిటీబ్యూరో: వ్యాపార లావాదేవీల పేరుతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు ఎర వేయడం... తమ వద్దకు రప్పించి వారిని కిడ్నాప్ చేయడం... కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుని వదిలిపెట్టడం...కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా యథేచ్ఛగా రెచ్చిపోతున్న కిడ్నాపింగ్ గ్యాంగ్ వ్యవహారమిది. వీరి చెరలో చిక్కిన ముగ్గురు నగరవాసుల్ని రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) జోక్యంతో అక్కడి విల్సన్ గార్డెన్ పోలీసులు రెస్క్యూ చేశారు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఠా ఏజెంట్లుగా స్థానికులు... బెంగళూరుకు చెందిన ఓ మాజీ మహిళా కార్పొరేటర్ కుమారుడు సందీప్ ఈ గ్యాంగ్‌కు సూత్రధారి. అక్కడి కోరమంగళ, మదికెరి తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది చిల్లర దొంగల్ని చేరదీసి ముఠాలో చేర్చుకున్నాడు. వీరంతా బెంగళూరులోని లాల్బాగ్ గార్డెన్ వెస్ట్గేట్ ప్రాంతంలో ఉన్న ఓ పాత గోడౌన్‌ను డెన్‌గా చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు చెందిన వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సందీప్ ఆయా ప్రాంతాలకు ఏజెంట్లుగా పెట్టకున్నాడు. ఆయా నగరాల్లో ఉన్న వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, వారి లావాదేవీలు తెలుసుకుని సందీప్‌కు సమాచారం ఇవ్వడం వీరి పని. ఇలా చేసినందుకు ప్రతి కిడ్నాప్‌కు వీరికి కొంత కమిషన్ చెల్లిస్తున్నాడు. ‘తక్కువ’ అంటూ రప్పించి... వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ‘లోకల్ ఏజెంట్లు’ వారి లావాదేవీల పూర్తి వివరాలు సందీప్‌కు అందిస్తారు. వీటి ఆధారంగా వారు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన సరుకు తక్కువ ధరకు ఇస్తామంటూ ఏజెంట్ల ద్వారానే సందీప్ వర్తమానం పంపుతాడు. బెంగళూరు శివార్లలో ఓ కంపెనీ మూతపడుతోందని, అందుకే అతి తక్కువ ధరకు భారీగా సరుకును విక్రయిస్తున్నామంటూ నమ్మబలుకుతాడు. ఇలా తమ వల్లో పడిన వారితో ముందు గా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, బెంగళూరు వచ్చి సరుకు చూసుకున్న తర్వాత నచ్చితేనే లావాదేవీలు కొనసాగిస్తామంటూ వలవేస్తారు. దీనికి ఆశపడిన వ్యాపారస్తులు బెంగళూరు చేరుకున్న వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుని అసలు ‘పని’ ప్రారంభిస్తుందీ గ్యాంగ్. ముగ్గురు ‘సిటీ’జన్ల కిడ్నాప్... నగరానికి చెందిన ముగ్గురు వ్యాపారులకు గత నెల్లో ఈ ముఠా ఎరవేసింది. శ్రీకాంత్ అనే ఏజెంట్ ద్వారా వ్యవహారాలు నడిపింది. ఈ ముగ్గురినీ 15 రోజుల క్రితం బెంగళూరుకు రప్పించింది. అక్కడికి చేరుకున్న ముగ్గురినీ ఓ కారులో కిడ్నాప్ చేసిన గ్యాంగ్ తమ డె న్లో బంధించింది. మారణాయుధాలతో బెదిరించడంతో పాటు తీవ్రంగా గాయపరిచింది. నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. దీంతో నగరానికి చెందిన బాధితుల సంబంధీకులు సీఐడీలోని సైబర్ క్రైమ్ ఎస్పీ యు.రామ్మోహన్‌ను సంప్రదించారు. వెంటనే ఆయన బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీసులను అప్రమత్తం చేశారు. పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారం అందిస్తూ కిడ్నాప్ ముఠాకు చెందిన నలుగురు అరెస్టు అయ్యేలా చేయడంతో పాటు వారి ఆధీనంలో ఉన్న నగరవాసులు ముగ్గుర్నీ రక్షించారు. పరారీలో ఉన్న 12 మంది ముఠా సభ్యుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు.