హమాస్ ఉగ్రదాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో వందలమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ వారి కోసం దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో భారత్‌కు చెందిన బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆమె ఎక్కడ ఉందో తెలియకపోవడంతో భయపడ్డారు. కానీ ఎట్టకేలకు సురక్షితంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా అక్కడ ఎదురైన భయాకన పరిస్థితులను వివరించారు.
(ఇది చదవండి: హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!)
నుస్రత్ బరుచ్చా మాట్లాడుతూ.. 'రెండు రోజుల క్రితం నేను ఇజ్రాయెల్‌లోని ఓ హోటల్‌లో ఉన్నా. 36 గంటలు ప్రత్యక్ష నరకం చూశా. ఆ సమయంలో మా చుట్టూ ఉన్న ప్రాంతంలో బాంబుల శబ్దం వినిపించింది. దీంతో మేం తీవ్ర భయాందోళనకు గురయ్యాం. మాకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి నాకెప్పుడు ఎదురుకాలేదు. ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చా. ఇప్పుడు సేఫ్‌గా ఉన్నా. ఇది చూశాక నాకు ఓ విషయం స్పష్టంగా అర్థమైంది. మనం ఎంత సురక్షితమైన దేశంలో ఉన్నామో తెలిసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అదే విధంగా ఇండియన్ ఎంబసీ, ఇజ్రాయెల్ ఎంబసీకి నా ధన్యవాదాలు. నా దేశానికి సేఫ్‌గా తీసుకొచ్చారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియో రిలీజ్ చేసింది. కాగా.. ఆమె ఇజ్రాయెల్‌లో జరుగుతున్న హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment