ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి..! | Bollywood Actress Nushrratt Bharuccha goes MISSING in Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి..!

Published Sun, Oct 8 2023 9:43 AM | Last Updated on Sun, Oct 8 2023 3:45 PM

Bollywood Actress Nushrratt Bharuccha goes MISSING in Israel - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నుస్రత్ బరుచ్చా ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ భామ ఆ దేశంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం అక్కడ భీకర యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో కమ్యునికేషన్‌ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఎక్కడో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.

అయితే ఆమె నిన్న మధ్యాహ్నం చివరిసారిగా తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ..  ఓ బేస్‌మెంట్‌లో దాక్కున్నట్లు తెలిపింది. నుస్రత్ బరుచ్చా చివరిసారిగా అకెలీ  చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె 2021లో విడుదలైన చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చోరీ- 2 అనే హారర్ చిత్రంలో నటిస్తోంది. నుస్రత్‌ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్‌ మహాల్‌’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రంలో నటించింది.

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు

ప్రస్తుతం హమాస్ దాడులతో ఇజ్రాయెల్‌ అట్టుడికిపోతోంది. దీంతో హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం యుద్ధానికి దిగింది. దీంతో పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. కాగా.. ఈ దాడుల్లో ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement