Nushrratt Bharucha
-
'ఎటు చూసిన బాంబుల శబ్ధమే.. 36 గంటల నరకం': నటి ఎమోషనల్ వీడియో
హమాస్ ఉగ్రదాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో వందలమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ వారి కోసం దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో భారత్‌కు చెందిన బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆమె ఎక్కడ ఉందో తెలియకపోవడంతో భయపడ్డారు. కానీ ఎట్టకేలకు సురక్షితంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా అక్కడ ఎదురైన భయాకన పరిస్థితులను వివరించారు. (ఇది చదవండి: హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!) నుస్రత్ బరుచ్చా మాట్లాడుతూ.. 'రెండు రోజుల క్రితం నేను ఇజ్రాయెల్‌లోని ఓ హోటల్లో ఉన్నా. 36 గంటలు ప్రత్యక్ష నరకం చూశా. ఆ సమయంలో మా చుట్టూ ఉన్న ప్రాంతంలో బాంబుల శబ్దం వినిపించింది. దీంతో మేం తీవ్ర భయాందోళనకు గురయ్యాం. మాకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి నాకెప్పుడు ఎదురుకాలేదు. ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చా. ఇప్పుడు సేఫ్‌గా ఉన్నా. ఇది చూశాక నాకు ఓ విషయం స్పష్టంగా అర్థమైంది. మనం ఎంత సురక్షితమైన దేశంలో ఉన్నామో తెలిసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అదే విధంగా ఇండియన్ ఎంబసీ, ఇజ్రాయెల్ ఎంబసీకి నా ధన్యవాదాలు. నా దేశానికి సేఫ్‌గా తీసుకొచ్చారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియో రిలీజ్ చేసింది. కాగా.. ఆమె ఇజ్రాయెల్‌లో జరుగుతున్న హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లింది. View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) -
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న హీరోయిన్.. ఎట్టకేలకు క్షేమంగా..
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా క్షేమంగా భారత్‌కు తిరిగి వచ్చింది. హైఫా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఆమె అకస్మాత్తుగా మొదలైన యుద్ధం కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ భీకర యుద్ధం కొనసాగుతున్న క్రమంలో టీమ్‌తో తనకు కమ్యూనికేషన్ సంబంధాలు కూడా తెగిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. క్షేమంగా భారత్‌కు తర్వాత నుస్రత్ తిరిగి తన టీమ్‌తో టచ్‌లోకి వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి అన్ని అడ్డంకులను అధిగమించి నుస్రత్ ఆదివారం నాడు(అక్టోబర్ 8న) సురక్షితంగా ముంబైకి వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడున్న పాత్రికేయులు తనను మాట్లాడించేందుకు ప్రయత్నించగా ఇప్పుడేం మాట్లాడలేనని, తనకు కాస్త సమయం కావాలని కోరింది. కాగా నుస్రత్ 2010లో తెలుగులో ‘తాజ్ మహాల్’ అనే చిత్రంలో కనిపించింది. ఇటీవల హిందీ ఛత్రపతి మూవీలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం చోరీ 2 మూవీ చేస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం యుద్ధానికి దిగింది. దీంతో పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. VIDEO | "I need some time," says Bollywood actor Nushrratt Bharuccha after arriving in Mumbai from Israel. She was in Israel when Hamas launched sudden attacks on the country.#IsraelPalestineConflict pic.twitter.com/lE3xmlxEu8 — Press Trust of India (@PTI_News) October 8, 2023 చదవండి: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి..! తాళి కడితే తీసి పారేశారు.. కుళ్ల బొడిచి గెంటేశారు.. సీనియర్ నటుడు రాజ్ కుమార్ లవ్‌స్టోరీ! -
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నుస్రత్ బరుచ్చా ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ భామ ఆ దేశంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం అక్కడ భీకర యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో కమ్యునికేషన్ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఎక్కడో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఆమె నిన్న మధ్యాహ్నం చివరిసారిగా తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ.. ఓ బేస్మెంట్లో దాక్కున్నట్లు తెలిపింది. నుస్రత్ బరుచ్చా చివరిసారిగా అకెలీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె 2021లో విడుదలైన చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చోరీ- 2 అనే హారర్ చిత్రంలో నటిస్తోంది. నుస్రత్ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్ మహాల్’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రంలో నటించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు ప్రస్తుతం హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దీంతో హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం యుద్ధానికి దిగింది. దీంతో పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. కాగా.. ఈ దాడుల్లో ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు.