బెత్లెహాం: క్రిస్‌మస్ వేడుకలు లేకపోవడంతో పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని క్రీస్తు జన్మస్థలం బెత్లెహాం నగరం కళ తప్పింది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు, నగరంలోని మేంజర్ స్క్వేర్‌లో చేసే ప్రత్యేక అలంకారాలు ఏవీ కనిపించడం లేదు. ఎక్కడ చూసిన ముళ్ల కంచెలు, శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా క్రీస్తు జన్మించిన బెత్లెహాం నగరంలో ఈసారి క్రిస్‌మస్ వేడుకలు రద్దు చేశారు.
క్రిస్‌మస్ సందర్భంగా మేంజర్ స్క్వేర్‌లో విదేశీ టూరిస్టులు, వందల మంది యువకులు చేసే మార్చ్ బ్యాండ్‌కు బదులు సైనికులు కవాతు చేస్తున్నారు. ‘ఈ ఏడాది బెత్లెహాంలో క్రిస్‌మస్ చెట్టు లేదు. వెలుగులు లేవు. కేలం చీకట్లే ఉన్నాయి’ అని జెరూసలెంలో ఆరు సంవత్సరాల నుంచి నివసిస్తున్న వియత్నాంకు చెందిన మాంక్ జాన్ విన్ ఆవేదన వ్యక్తం చేశారు.
క్రిస్‌మస్ వేడుకల రద్దు బెత్లెహాం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెత్లెహాం ఆదాయంలో 70 శాతం విదేశీ పర్యాటకుల నుంచే వస్తుంది. ఇది కూడా చాలా వరకు క్రిస్‌మస్ సీజన్‌లో వచ్చే ఆదాయమే. ఇప్పుడు ఈ ఆదాయం లేకపోవడంతో నగరంలోని 70 హోటల్‌లు మూతపడ్డాయి. వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment