గాలి పటాలు ఎగరేస్తున్న పాలస్తీనియన్లు, గాలి పటాల కారణంగా తగల బడ్డ అడవి
జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రజలు గాలి పటాలను చూస్తే భయపడి పోతున్నారు. గాల్లో ఎగిరే గాలి పటాలు ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా పరిగెడుతున్నారు. గాలి పటాలు చక్కగా ఎగరేయాలి గానీ భయపడటం దేనికి? అనుకుంటున్నారా. అవి మామూలు గాలి పటాలు కాదు మరి.. అడవులను, ఊర్లను తగలపెట్టే నిప్పు పటాలు. అసలు సంగతేంటంటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈ రెండు దేశాలు బాంబులతో, మిసైల్‌లతో, పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ పాలస్తీనాకు ఇప్పుడు వినూత్నంగా గాలి పటాలను రంగంలోకి దింపింది.
చిన్న, భారీ సైజులో ఉండే ఈ గాలి పటాల తోకల చివర నిప్పుపెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి ఎగరేసింది. అంతే అలా ఆ గాలి పటాలు అడవులను, ఊర్లను తగుల బెట్టుకుంటూ పోయాయి. గాలి పటాల వల్ల అటవీ ప్రాంతాలు, ఊర్లు తగలబడటం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కేవలం గాలి పటాలనే కాదు బెలూన్లను సైతం ఇజ్రాయెల్ దేశంలోకి వదిలింది పాలస్తీనా. వీటి కారణంగా శనివారం ఒక్క రోజే పది చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ఈ దాడులకు ప్రతిగా పాలస్తీనా ప్రధాన నాయకుడి కారును పేల్చిసింది.
Comments
Please login to add a commentAdd a comment