జెరూసలేం : పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. గాజాలోని వెస్ట్ బ్యాంక్ వద్ద పాలస్తీనియన్ ఉద్యమ నేత అయిన ఇబ్రహీం అబు తురాయను శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం కాల్చి చంపటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వీల్ చైర్‌లో ఉన్న అబును ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాల్చటంపై పాలస్తీనీయులను మండిపడుతున్నారు.
ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే...
పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే తిరిగి ఆందోళనలు మొదలయ్యాయి. చేపలు పట్టుకుని జీవించే తురాయా 2008లో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడుల్లో తన రెండు కాళ్లు కోల్పోయి వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు. అయినా కార్లు తుడుచుకుంటూ ఆయన హక్కుల పోరాటంలో పాల్గొనేవారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రతీ ప్రదర్శనలోనూ ఆయన ముందుంటారు. అప్పుడు కాళ్లు మాత్రమే కోల్పోయిన ఆయన.. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో ఏకంగా ప్రాణమే పొగొట్టుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రగులుతున్న పాలస్తీనా...
తురాయ మరణ వార్త తెలుసుకోగానే మొత్తం పాలస్తీనీయులు భగ్గుమన్నారు. ఆయనను కాల్చి చంపిన వీడియోలు కొన్ని సోషల్ మీడియలో వైరల్ కావటంతో ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుకున్నాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహణకు పెద్ద ఎత్తున్న ప్రజలు హాజరయ్యారు. రెండు రోజుల నుంచి రోడ్లపై ఆందోళన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన రెండు రోజుల ముందు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పాలస్తీనీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ‘‘ఇది(జెరూసలేం) మన భూమి.. వదిలే ప్రసక్తే లేదు. అమెరికా తన ప్రకటన వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన మరణం ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించకపోవటం విశేషం.
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదంలో మరో మలుపు
Comments
Please login to add a commentAdd a comment