గాజా: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో చిధ్రమైన గాజాలో తిండికోసం ఎదురు చూస్తున్న శరణార్థులపై మరో దారుణం జరిగింది. విమానం నుంచి జారవిడిచిన ఆహారపొట్లాలతో కూడిన పారాచూట్ తెరచుకోకపోవడంతో ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులపై భారీ పార్సిళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా 10 మంది దాకా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆల్‌షిఫా ఆస్పత్రికి తరలించారు.
అయితే పారాచూట్ జారవిడిచింది తాము కాదని విమానాల ద్వారా గాజాలో ఆహార పొట్లాలు జార విడుస్తున్న జోర్డాన్, అమెరికాలు స్పష్టం చేశాయి. ఈజిప్ట్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా చేపట్టిన సాయంలో భాగంగానే ఈ ప్రమాదం జరిగనట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై గాజా ప్రభుత్వం స్పందించింది. విమానాల ద్వారా ఆహారపొట్లాలు జారవిడవడం కేవలం ప్రచార ఆర్భాటం కోసం తప్ప ఎందుకు పనికిరాని ప్రయత్నమని మండిపడింది.
గాజాలో పౌరుల ప్రాణాలకు ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఇదివరకే హెచ్చరించినట్లు తెలిపింది. ఇప్పుడు పారాచూట్‌లోని భారీ పార్సిళ్లు పడి ఐదుగురు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం నుంచి జారవిడవడం కంటే రోడ్డు మార్గం ద్వారా గాజాకు ఆహారం పంపేందుకు మరిన్ని ట్రక్కులను అక్కడికి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే కోరింది. పది రోజుల క్రితమే ఆకలితో అలమటిస్తూ ఆహారపొట్లాల కోసం ఎగబడ్డ గాజా వాసులపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో వందల మంది మరణించడం అందరి హృదయాలతను ద్రవింపజేసింది.
కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ దాడి చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాలస్తీనాలోని గాజా, ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్‌పై భీకరదాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో గాజా మొత్తం ధ్వంసమై అక్కడి ప్రజలు చెల్లాచెదురై ఇళ్లు కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment