జెరూసలెం: ఇజ్రాయెల్‌లో సూపర్ నోవాగా పేరుగాంచిన బహిరంగ మ్యూజికల్ ఫెస్టివల్‌లో హమాస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. వందలాది మంది సాధారణ ప్రజలు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ఆనందంగా జరగాల్సిన మ్యూజిక్ ఈవెంట్‌లో క్షతగాత్రుల ఆర్తనాదాలతో మరణమృదంగం వినిపించింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉన్న వివాదంతో హమాస్ దాడులు చేయగా.. ఇరువైపుల దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..? ఎందుకు దాన్నే టార్కెట్‌గా ఉగ్రదాడులు జరిగాయి..?
సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్‌లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టెబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది. గత శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అయింది.
పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్‌లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్‌లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది.
ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం
Comments
Please login to add a commentAdd a comment