ఇటలీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభరణాల ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఇజ్రాయెల్ ఎగ్జిబిటర్లకు నిరసన సెగ తగిలింది. ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇటలీలోని విసెంజాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ దిగారు. స్మోక్ బాంబులు అంటించి గందరగోళం సృష్టించారు. పోలీసులు నిరసనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ‘పాలస్తీనాను వదిలేయండి.. గాజాపై బాంబుల దాడి ఆపేయండి’ అని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
40 దేశాల నుంచి సుమారు1300 మంది ఎగ్జిబీటర్లు విసెంజాలో జరుగుతున్న అభరణాల ప్రదర్శన వచ్చారని ఎగ్జిబిషన్ నిర్వాకులు తెలిపారు. నిరసన కూడా ఎగ్జిబిషన్‌కు చాలా దూరంలో జరిగిందని.. నిరసన ప్రభావం ఎగ్జిబిషన్‌పై పడలేదని అన్నారు. ఎగ్జిబిషన్‌లో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎగ్జిబిటర్లు ఉన్నారా అన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు.
🚨 ITALY TODAY: Pro-Hamas Protestors & Police Clash🚨
— Shirion Collective (@ShirionOrg) January 20, 2024
⚠️ WATCH: Don’t miss the ending!
Violence erupts at an anti-Israel protest during Italy’s jewelry fair. Pro-Hamas demonstrators face a harsh reality check in the streets.
👍 Like and share if Italy’s approach inspires you… pic.twitter.com/jdxP4iS2HB
ఈ నిరసనలను విసెంజా మేయర్ గియాకోమో పోస్సామై తీవ్రంగా ఖండించారు. హింస చెలరేగే విధంగా నిరసన తెలపటాన్ని పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లుగా సమర్థించలేమన్నారు. శాంతి, కాల్పుల విరమణ కోసం నిరసనల ద్వారా హింసను ప్రేరేపించటం సరి కాదన్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న చేసిన మెరుపుదాడుల్లో 1140 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇంకా 132 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నారు. అక్టోబర్ 7 అనంతరం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బీకరంగా దాడుల ప్రారంభించింది. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో 24,973 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు.
చదవండి: Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి
Comments
Please login to add a commentAdd a comment