ఢిల్లీ: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో విమానం 235 మందితో ఢిల్లీ చేరుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 212 మంది భారతీయులతో శుక్రవారమే మొదటి విమానం చేరుకున్న విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై బాధితులు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా మొదటగా రిజస్టర్ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. రెండో విమానం రాత్రి 11.02కు ఢిల్లీ చేరుకుంది. ఆదివారం కూడా ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎంబసీలో రిజస్టర్ చేసుకున్నవారికి నేడు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. నేడు కూడా మరో విమానం భారత్ చేరనుంది.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి.
ఇదీ చదవండి: 212 మంది భారతీయుల తరలింపు
Comments
Please login to add a commentAdd a comment