న్యూయార్క్ అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలి ఫైరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు.. పాలస్తీనియన్లను ఎందుకు ఆహ్వానించట్లేదని మండిపడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ బామా, జో బైడెన్‌ను విమర్శించారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్‌ను దూషించారు.
'పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి? ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు తెరవలేరా..?' అని నిక్కి హేలి అన్నారు.
'పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్ ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఉంచుకుంటుంది? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు రక్షించాలనుకోరు. వారిని తమ దేశాల్లో ఉంచుకోవాలనుకోరు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ను నిందిస్తుంటారు. పశ్చిమాసియా సమస్యలను పరిష్కరించగల సత్తా వారికి ఉంది. కానీ చేయరు. హమాస్‌తో నిత్యం కలిసి పనిచేస్తుంటారు. వారికి నిధులను సమకూరుస్తారు. ఇజ్రాయెల్ దాడులపైనే మాట్లాడుతున్నారు. హమాస్ ఏం చేసిందో మాట్లాడరు. హమాస్ అరాచకాలపై పెదవి విప్పరు.' అని నిక్కి హేలి మండిపడ్డారు.
ఇదీ చదవండి ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
Comments
Please login to add a commentAdd a comment