గాజాలోని ఆసుప్రతిపై దాడి అనంతరం హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 900 మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
తాజాగా హాస్పిటల్ ఘటనపై తాము బాధ్యులం కాదని చెబుతూ.. రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తుండగా.. దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని, తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది. ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని పాలస్తీనా మిలిటెంట్లను నిందించింది.
చదవండి: ఇజ్రాయెల్‌కు మా పూర్తి మద్దతు: బైడెన్
ఈ మేరకు ప్రమాదానికి ముందు.. ఆ తర్వాత ఆసుపత్రి ఆవరణకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగం గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిని తాకింది. ఈ రాకెట్ ప్రయోగానికి ముందు ఆ తరువాత ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతం’ అని ఐడీఎఫ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
A failed rocket launch by the Islamic Jihad terrorist organization hit the Al Ahli hospital in Gaza City.
IAF footage from the area around the hospital before and after the failed rocket launch by the Islamic Jihad terrorist organization: pic.twitter.com/AvCAkQULAf— Israel Defense Forces (@IDF) October 18, 2023
కాగా ఇజ్రాయెల్- హమాస్ ఉగ్రవాదుల మధ్య ఘర్షణ 12వ రోజుకు చేరింది. హమాస్ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. భారీగా రాకెట్లు ప్రయోగిస్తుంది. ఈ దాడులో పదలు సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment