Israel-Palestine
-
బోయిమ్, అవ్వాద్‌లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్ బరెన్‌బోయిమ్, అలీ అబు అవ్వాద్‌లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. అర్జెంటినాలో జని్మంచిన సంగీత కళాకారుడు బరెన్‌బోయిమ్, పాలస్తీనాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు. వీరిద్దరికీ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయు«దీకరణ, సామాజికాభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ చెప్పారు. వీరిద్దరూ మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసించింది. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ అంశంతో మరోసారి ఆచితూచి వ్యవహరించింది. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటువేసింది. ఇక, తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. వివరాల ప్రకారం.. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థంగా ఓటు వేశాయి. మరోవైపు.. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్‌ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరోవైపు, ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. దీనిలో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. 🔥🔥BIG UPDATE 🔥🔥 India Supports UN Resolution Condemning Israeli Settlements In Palestine This comes weeks after India abstained from a vote on a UN resolution calling for "immediate, durable and sustained humanitarian truce" in Gaza Strip. India has voted in favour of a… pic.twitter.com/fttSp5xiWq — Resonant News🌍 (@Resonant_News) November 12, 2023 గాజాలో దారుణ పరిస్థితులు.. ఇదిలా ఉండగా.. గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనా అధికారులు శుక్రవారం మాట్లాడుతూ.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన వైద్యసేవలు.. కరెంటు సరఫరా లేకపోవడంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. ఇది కూడా చదవండి: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
ఇద్దరు అమెరికన్లను విడుదల చేసిన హమాస్.. త్వరలోని మరికొందరు!
తమ వద్ద బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను విడుదల చేశామని హమాస్ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం ప్రకటించారు. మానవతా దృక్పథంతో అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు జుడిత్ తై రానన్(59), నటాలీ శోషనా రానన్ను(17) వదిలేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారిని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు రెండు వారాల తర్వాత విడుదల హమాస్ మిలిటెంట్ల స్థావరం నుంచి వీరిద్దరూ శుక్రవారం రాత్రికి ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఒట్టావా ప్రభుత్వం తెలిపింది. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలోనినహాల్ ఓజ్ కిబ్బట్స్నుంచి తల్లి కూతుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఇజ్రాయెల్‌లో హాలీడ్ నిమిత్తం ఉన్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు మహాస్ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లు విడుదలైన అనంతరం గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ రాయబారి కలుసుకున్నారు. సెంట్రల్ ఇజ్రాయ్లోని సైనిక స్థావరానికి తీసుకెళ్లి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. చాలా సంతోషం: బైడెన్ ఇద్దరు అమెరికన్ల విడుదలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఈ వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. విడుదలైన తర్వాత ఇద్దరు మహిళలతో బిడెన్ ఫోన్లో మాట్లాడారు. తల్లీకూతుళ్లు సురక్షితంగా విడుదలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నటాలీ రానన్ చాలా బాగుందని, చాలా సంతోషంగా కనిపిస్తుందని ఇల్లినాయిస్లోని ఆమె తండ్రి యురి రానన్ పేర్కొన్నారు. కుమార్తెతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. హమాస్ వద్ద బందీలుగా ఇంకా అనేకమంది ఉన్నారని, వారి విడుదల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. చదవండి: భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ ఇదిలా ఉండగా హమాస్ మరింతమంది బందీలను విడిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాళ్ల పౌరులను వదిలిపెట్టేందుకు ఖతార్, ఈజిస్ట్తో కలిసి పనిచేస్తున్నట్లు హమాస్ పేర్కొంది. అయితే హమాస్ అధీనంలో దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలు ఉన్నారు. కాగా హమాస్ మిలిటెంట్లు ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. 20 నిమిషాల్లోనే అయిదు వేల రాకేట్లతో విరుచుపడింది. వెంటనే ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. గత 15 రోజులుగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు తీవ్రంగా సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 4,137 మంది మృతిచెందగా.. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా బలయ్యారు. -
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్
హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ నేతలు, వారి స్థావరాలనే తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతుండగా.. హమాస్ సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 5000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.ఒక్క గాజాలోనే 1,524 మంది చిన్నారులతో సహా 3,700 మంది మృత్యువాతపడ్డారు హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్యజరుగుతున్న యుద్ధంపై ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే దాడులను ఆపేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్లో మాట్లాడారు. గాజాలోని అల్పై అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడిలో సంభవించిన ప్రాణ నష్టంపై సంతాపం ప్రకటించారు. యుద్ధం కొనసాగుతన్న వేళ.. పాలస్తీనా ప్రజలకు భారత్‌ను మానవతా సాయం అందించడం కొనసాగుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. పాలస్తీనియన్ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్లో మాట్లాడాను. . గాజాలోని ఆసుపత్రిపై దాడిలో బాధితులకు నా సంతాపాన్ని తెలియజేశాను. పాలస్తీనా ప్రజల కోసం మానవతా సహాయం పంపడం కొనసాగిస్తాం. పాలస్తీనాలో తీవ్రవాదం, హింస క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారత్ తన దీర్ఘకాల సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. చదవండి: ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్ Spoke to the President of the Palestinian Authority H.E. Mahmoud Abbas. Conveyed my condolences at the loss of civilian lives at the Al Ahli Hospital in Gaza. We will continue to send humanitarian assistance for the Palestinian people. Shared our deep concern at the terrorism,… — Narendra Modi (@narendramodi) October 19, 2023 ఇదిలా ఉండగా.. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌లో పర్యటించి..ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ముక్త కంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఇరు దేశాల అగ్రనేతలు వెల్లడించారు. ఈ క్రమంలో మోదీ పాలస్తీనా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు
గాజాలోని ఆసుప్రతిపై దాడి అనంతరం హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 900 మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా హాస్పిటల్ ఘటనపై తాము బాధ్యులం కాదని చెబుతూ.. రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తుండగా.. దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని, తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది. ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని పాలస్తీనా మిలిటెంట్లను నిందించింది. చదవండి: ఇజ్రాయెల్‌కు మా పూర్తి మద్దతు: బైడెన్ ఈ మేరకు ప్రమాదానికి ముందు.. ఆ తర్వాత ఆసుపత్రి ఆవరణకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగం గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిని తాకింది. ఈ రాకెట్ ప్రయోగానికి ముందు ఆ తరువాత ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతం’ అని ఐడీఎఫ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. A failed rocket launch by the Islamic Jihad terrorist organization hit the Al Ahli hospital in Gaza City. IAF footage from the area around the hospital before and after the failed rocket launch by the Islamic Jihad terrorist organization: pic.twitter.com/AvCAkQULAf— Israel Defense Forces (@IDF) October 18, 2023 కాగా ఇజ్రాయెల్- హమాస్ ఉగ్రవాదుల మధ్య ఘర్షణ 12వ రోజుకు చేరింది. హమాస్ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. భారీగా రాకెట్లు ప్రయోగిస్తుంది. ఈ దాడులో పదలు సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. -
ఇజ్రాయెల్‌కు మా పూర్తి మద్దతు: బైడెన్
హమాస్ మిలిటెంట్ల దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అధ్యక్షులు యుద్ధ పరిస్థితిపై, మానవతా సాయంపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆసుప్రతిపై దాడి ఇజ్రాయెల్ జరిపింది కాదు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. గాజాలో అల్ అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్ జరిపినది కాదని, వేరే వైపు నుంచి వచ్చినదిగా కనిపిస్తుందని చెప్పారు. 10 రోజులుకు పైగా జరుపుతున్న ఉగ్రవాద సంస్థ హమాస్ దాడుల్లో 1300 మంది ఇజ్రాయిల్స్తోపాటు 31 మంది అమెరికన్లు మరణించినట్లు పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలతో సహా అనేకమందిని బందీలుగా ఉంచారని విమర్శించారు. ఐసిస్ ఉగ్రవాదులకు మించి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని పునరుద్ఘాటించారు. విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నందుకు బైడెన్ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ సమయంలో తమ దేశంలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ నిలిచారని అంటూ పేర్కొన్నారు. ఇది ఇజ్రాయెల్, యూదుల భవిష్యత్తు పట్ల తనకున్న వ్యక్తిగత నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మరవలేమని పేర్కొన్నారు. తమ ఓపికను పరీక్షించవద్దనే స్పష్టమైన సందేహాన్ని హమాస్‌కు తెలియజేసినందకు ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్ఐఎస్ను. నాజీలను ఓడించడానికి ప్రపంచం ఏకం అయినట్లే.., హమాస్‌ను ఓడించడానికి కూడా విశ్వమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచంలో శాంతి, భద్రత కోసం ఇది జరగాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: గాజా ఆసుపత్రి ఘటన: ప్రధానిమోదీ తీవ్ర దిగ్భ్రాంతి #WATCH | US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict. Israel PM Benjamin Netanyahu and President Isaac Herzog receive him at Ben Gurion Airport. (Video Source: Reuters) pic.twitter.com/KD7qsp6VGw— ANI (@ANI) October 18, 2023 అయితే ఇజ్రాయెల్ పర్యటన తర్వాత బైడెన్ జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్ నేతలతోసమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. కానీ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆసుపత్రిపై దాడి ఘటనతో అనూహ్యంగా బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైంది. కాగా హమాస్ ఉగ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన మద్దతును ప్రకటించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది. #WATCH | US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict. (Video Source: Reuters) pic.twitter.com/KsGvCbOTcu — ANI (@ANI) October 18, 2023 గాజా ఆసుపత్రి ఘటన.. హమాస్ పనే.. గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపై వైమానిక దాడి జరగడంతో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 500 మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తుండగా.. దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని, తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. -
‘మహిళలపై అత్యాచారాలు, చిన్నారుల హత్యలు.. అయినా ఇజ్రాయెల్ వెళ్తాం’
‘హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భయంకరమైనది, క్రూరమైనది. దీనిని మేము ఊహించలేదు. హమాస్ బాంబ్ దాడికి ఇజ్రాయెల్‌లోని మా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లో మ్యూజిక్ఫెస్టివల్కు హాజరైన 260 మందిని చంపడం బాధాకరం. ఉగ్రవాదులు మహిళలపై అత్యాచారం చేశారు. పిల్లలను కిరాతకంగా చంపుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో మా వాళ్ల భద్రతపై ఆందోళనగా ఉంది.’ ఈ మాటలు భారత్‌లోని ఇజ్రాయెల్ పౌరులు చెబుతున్నవి. ఇండియాలో తాము సురక్షితంగానే ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వెళ్లి విపత్కర సమయంలో శుత్రవులతో పోరాడాలనుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. 3 వేల మంది మృతి ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి మారణహోమం సృష్టిస్తోంది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై రాకెట్లతో దాడికి పాల్పడుతోంది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల దాడిలో ఇప్పటి వరకు పౌరులతో సహా 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ గ్రూపు పేర్కొంది. ఇటు హమాజ్ దాడిలో 1300 మంది బలవ్వగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తమ వారి క్షేమంపై ఆందోళన గత ఆరురోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా మిలిటెంట్ల భీకరపోరు ప్రభావం కేవలం ఇజ్రాయెల్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ దేశ పౌరులపై కూడా చూపుతోంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో యుద్ధ ప్రభావిత పాంత్రంలోని తమ సొంతవారి భద్రతపై ఇతర దేశాల్లో నివసించే పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Israelis from around the world have travelled home to join their army units. This was the scene at 2am in Israel’s airport. Citizens came to welcome them home.pic.twitter.com/AgtPv4KeR0 — Aviva Klompas (@AvivaKlompas) October 11, 2023 దేశ సైన్యానికి సాయం చేస్తా.. హమాస్ అకస్మిక దాడిపై భారత్‌లోని ఇజ్రాయిల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ పౌరుల్లో కొంతమంది చాలాకాలంగా ఇక్కడే నివిస్తున్నవారు ఉండగా మరికొంతమంది పర్యటనల కోసం ఇండియాకు వచ్చినవారు ఉన్నారు. అయితే వీలైనంత త్వరగా టూరిస్టులు తమ దేశానికి వెళ్లాలని భావిస్తున్నారు. కులులోని ఇజ్రాయెల్ టూరిస్ట్ అయిన షీరా.. తిరిగి స్వదేశానికి వెళ్లి హమాస్ ఉగ్రవాదుతో పోరాడుతున్న తమ దేశ సైన్యానికి సాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఇజ్రాయెల్కుభారత్ మద్దతుగా ఉండటంపై కృతజ్ఞత తెలియజేస్తూ.. ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యం తమ పౌరులను రక్షించుకోవడమేనని, ఇతరులకు హాని చేయడం కాదని పేర్కొంది. ‘మా తమ్ముడు ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నాడు. అతనితో టచ్‌లో ఉన్నాను. అయినా నాకు భయంగా ఉంది. మా అత్తయ్య దక్షిణ ఇజ్రాయెల్‌లో నివిసిస్తుంది. ఆమె ఇల్లు కూడా పాలస్తీనా ఉగ్రవాదుల బాంబ్ దాడిలో కూలిపోయింది. మా బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. భారత్‌లో మేము సురక్షితంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. ఇజ్రాయెల్‌లో ఉన్న నా కుటుంబంపై ఆందోళనగా ఉంది. నాకు ఇజ్రాయెల్ వెళ్లేందుకు భయంగా ఉంది. ఇప్పటి వరకు నా దేశానికి తిరిగి వెళ్లడానికి నేను ఎప్పుడూ భయపడలేదు.’ అని హిమాచల్ ప్రదేశ్ఓని కులు జిల్లాలో నివసిస్తున్న కెనెరియత్ తెలిపారు. These young Israelis going back to defend their country should put those celebrating Hamas’ atrocities safely in the West to shame. pic.twitter.com/BNduZhVxEl — Bella Wallersteiner 🇺🇦 (@BellaWallerstei) October 11, 2023 యుద్ధ భూమిలో పోరాడుతా.. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఇజ్రాయెల్ పర్యాటకుడైన అమత్ తన దేశానికి తిరిగి వెళ్లి ఇజ్రాయెల్ రక్షణ దళాలతో కలిసి యుద్ధభూమిలోకి దిగాలనుకుంటున్నట్లు తెలిపాడు.మహిళలు, పిల్లలు, సైనికులపై హమాస్ వికృత దాడుల కారణంగా తాను సైన్యంలోచేరి పోరాడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అక్టోబరు 15న ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పాడు. మినీ ఇజ్రాయెల్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మెక్లియోడ్గంజ్లోని ధరమ్‌కోట్ గ్రామాన్ని 'మినీ ఇజ్రాయెల్' అని కూడా పిలుస్తారు, అక్కడ ఇజ్రాయెల్‌ల జనసాంద్రత ఎక్కుగవగా ఉండటం కారణంగా అలా పిలుస్తారు. ఇజ్రాయెల్‌లోని తమ బంధువుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందదని భావిస్తూ అక్కడి కెమెరాల ముందుకు రావడం లేదు. ఈ సంక్షోభ సమయంలో తమ దేశానికి సేవ చేసేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. -
ఇజ్రాయెల్-గాజా యుద్ధం.. రంగంలోకి భారత్, ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభం
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2200 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,200, గాజాలో 1,055 మంది బలయ్యారు. 20 మందికిపైగా అమెరికన్ల మృతి ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో ఇరుదేశాలకు చెందిన పౌరులతోపాటు విదేశీయులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 20 మందికి పైగా ఈ దాడుల్లో మరణించారు.తమ దేశ పౌరులు ఇజ్రాయెల్‌లో ప్రాణాలుకోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. హమాస్ ఉగ్రవాదులు చిన్నారులను పొట్టనబెట్టుకుంటున్న ఫోటోలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాద దాడిని ఘోరమైన క్రూరత్వంగా అభివర్ణించారు. చదవండి: వారంలోనే అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం ఇజ్రాయెల్‌లోని పౌరుల కోసం భారత్ చర్యలు ఇజ్రాయెల్ దేశంలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. దాదాపు 18000 మంది ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాంతంలో చిక్కకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ అజయ్’పేరుతో దేశ పౌరుల తరలింపు ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఆపరేషన్ అజయ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు’ బుధవారం ట్విటర్లో ప్రకటించారు. భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని తమ పౌరుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు.. ఆపరేషన్‌లో అజయ్‌లో మొదటి బ్యాచ్ భారతీయులను గురువారం ప్రత్యేక విమానంలో ఇజ్రాయెల్ నుంచి తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్‌లో స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయ పౌరులకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యలయం ఈ మెయిల్ చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనాలోని యద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులకు సమాచారం, సాయం అందిచడానికి ఢిల్లీలోని కంట్రోల్ రూంకంట్రోల్ రూం ప్రత్యేక అత్యవసర హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ►ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 1800118797 (టోల్ ఫ్రీ), 91-11 23012113, 91-11-23014104, 91-11-23017905, 919968291988.. ► మెయిల్ ఐడీ: gov.mea ID e-mail in the e-mail -
ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు అంతర్జాతీయ సమాజాన్ని క్రమంగా రెండుగా విడదీస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటివి ఇజ్రాయెల్‌కు, ఇరాన్ పాలస్తీనాకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాయి. చైనా కాస్త ఇజ్రాయెల్ వైపు, ఇస్లామిక్ దేశాలు పాలస్తీనాకేసి మొగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కల్లోలం భారత్‌కు దౌత్యపరంగా అగ్నిపరీక్షే కానుంది. పశ్చిమాసియాతో మనకున్న సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం. మధ్యప్రాచ్యంలో మరింత క్రియాశీల పాత్ర పోషించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితుల్లో వచ్చి పడ్డ ఈ పోరు మన దౌత్య చాణక్యానికి విషమ పరీక్షే కానుంది. అధికారికంగా మౌనమే.. ఈ కల్లోలంపై విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా ఏమీ స్పందించకపోయినా, ‘దాడులను చూసి ఎంతగానో చలించిపోయా. కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటా’మని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ఇజ్రాయెల్‌కే తమ మద్దతని పరోక్షంగా చెప్పినట్టే అయింది. కాకపోతే ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు బాహాటంగా పూర్తిస్థాయి మద్దతివ్వడం మన ప్రయోజనాల రీత్యా శ్రేయస్కరం కాదనే వాదనలే వినిపిస్తున్నాయి. ఇందుకు పలు కారణాలున్నాయి. అరబ్ లీగ్‌లో కీలకమూ, అతి పెద్దదీ అయిన సౌదీ అరేబియాతో భారత సంబంధాలు ప్రస్తుతం దూకుడు మీదున్నాయి. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పాలస్తీనా అనుకూల సౌదీతో మన సంబంధాలను అది ప్రభావితం చేయగలదంటున్నారు. అంతేగాక మధ్యప్రాచ్యంలో చైనాకు పూర్తిగా చెక్ పెట్టి అక్కడి రాజకీయ, వ్యూహాత్మక అంశాల్లో నిర్ణాయక పాత్ర పోషించేందుకు కొన్నేళ్లుగా భారత్ ప్రయత్నిస్తూ వస్తోంది. పైగా ఇటీవలే మరో కీలక పరిణామమూ జరిగింది. భారత్– మధ్యప్రాచ్య–యూరప్ ఆర్థిక కారిడార్ ఏర్పాటుకు ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్రంలో నిర్ణయం జరిగింది. చైనా దూకుడుగా వెళ్తున్న బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు చెక్ పెట్టడం వంటివి కూడా దీని వెనక భారత్ లక్ష్యాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం తప్పటడుగు పడ్డా అరబ్ దేశాలతో ఇన్నేళ్లుగా నిర్మించుకుంటూ వస్తున్న సత్సంబంధాలకు విఘాతం కలిగే ఆస్కారముంది. ఇప్పటిదాకా ఇలా.. స్వాతంత్య్రానంతరం నుంచీ ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో భారత వైఖరి కాస్త సంక్లిష్టంగానే ఉంటూ వచ్చింది. ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా 1950లో అన్యమనస్కంగానే భారత్ గుర్తించింది. అనంతరం కూడా చాలా ఏళ్లపాటు ఆ దేశంతో దూరమే పాటిస్తూ వచ్చింది. అదే సమయంలో పాలస్తీనా విముక్తి సంస్థ నేత యాసర్ అరాఫత్ పట్ల సానుభూతి ప్రదర్శించింది. ఇందిరా, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాలు కూడా దీన్నే కొనసాగించాయి. కానీ ఇండో చైనా యుద్ధ సమయంలో అరబ్ దేశాలు భారత్‌కు మద్దతివ్వకుండా తటస్థంగా వ్యవహరించడం, అనంతరం పాక్‌తో జరిగిన యుద్ధాల్లో ఆ దేశానికే దన్నుగా నిలవడంతో మన పాలస్తీనా అనుకూల విధానంపై స్వదేశంలోనే పెద్దపెట్టున విమర్శలొచ్చాయి. అనంతరం కువైట్‌ను ఇరాక్ ఆక్రమించడం, అలీన విధానం తెరమరుగు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి బాగా మారింది. ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. వాజ్‌పేయి హయాంలో ఈ బంధం సుదృఢమైంది. కార్గిల్ యుద్ధ సమయంలో అత్యవసర ఆయుధ సరఫరాల ద్వారా ఇజ్రాయెల్ మనకు నమ్మదగ్గ మిత్రునిగా మారిపోయింది. అయినా 2014 దాకా కూడా అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనాకు మన మద్దతు కొనసాగుతూనే వచ్చింది. పాలస్తీనా పోరుకు పూర్తిగా మద్దతిస్తున్నట్టు నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తామంటూ ముక్తాయించారు. ఆచితూచి అడుగేయాలి.. ప్రస్తుత కల్లోలం నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో ఏదో ఒకదానికి భారత్ మద్దతు ప్రకటించక తప్పదన్న అభిప్రాయాలు గట్టిగా విన్పిస్తున్నాయి. కానీ మధ్యప్రాచ్యంతో మన వర్తక, వ్యూహాత్మక బంధాలు, అవసరాల రీత్యా అదంత శ్రేయస్కరం కాదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎవరి పక్షమూ వహించని విషయం తెలిసిందే. అమెరికా తదితర దేశాలు ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఉక్రెయిన్‌కు మద్దతిచ్చి వ్యూహాత్మకంగా మనకు అత్యంత కీలకమైన రష్యాను దూరం చేసుకునేందుకు ససేమిరా అంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వాటికి సూచిస్తూ వస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతులు తదితరాలను నిర్నిరోధంగా కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలోనూ అదే వైఖరిని కొనసాగించడం ప్రస్తుతానికి మేలన్నది పరిశీలకుల భావన. ‘మధ్యప్రాచ్యంతో మన సంక్లిష్ట బంధాల దృష్ట్యా కూడా ఇదే మేలు. ఎందుకంటే సౌదీ అరేబియా మనకు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. మరోవైపు ఇజ్రాయెల్‌కు మనం అతి పెద్ద ఆయుధ వినియోగదారులం’ అని వారు గుర్తు చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫలిస్తున్న ఇజ్రాయెల్ ప్లాన్.. హమాస్‌కు ఊహించని షాక్!
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం గజగజ వణుకుతోంది. గాజాపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు విద్యుత్, ఇంధనం ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్.. మరోవైపు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం కారణంగా వేలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు గాజాపై హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే బందీలను చంపేస్తామని హమాస్ బెదిరిస్తోంది. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. ఐదోరోజు యుద్ధంలో భాగంగా గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ గ్రూపు నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని, ఇరువైపులా వేలాది మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ నివేదించింది. అంతే కాకుండా గాజా ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ సాధించింది. నిన్న సాయంత్రం కూడా ఇజ్రాయెల్ దాడులను వేగవంతం చేసినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌లో దాదాపు 3000 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. Late night attacks on Gaza Strip by IDF#IsraelPalestineWar #Israel #Gaza #غزة_الآن #طوفان_الأقصى #Palestina #HamasMassacre #FreePalastine #PalestineUnderAttack #Palestina #HamasTerrorism #Israel_under_attack #FreePalaestine #Palestine #GazaUnderaAttack pic.twitter.com/p9odltWxS5 — Cctv media (@Cctv__viral) October 11, 2023 ఇక, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం వల్ల గాజా నగరంలో వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. గాజాలోని రెండు వందల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్రువీకరించింది. వీటిలో మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్టుమెంట్ భవనం ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను అధికారిక వైబ్సైట్లో ఉంచింది. Listen in as an IDF Spokesperson LTC (res.) Jonathan Conricus provides a situational update on all fronts, as the war against Hamas continues. https://t.co/uuen9lQa0F — Israel Defense Forces (@IDF) October 11, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను కలిసి సమాచారం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం అధికారులను పంపింది. దాదాపు వంద కుటుంబాల వద్దకు ఈ అధికారులు వెళ్లి వారి ఆత్మీయులు గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన వారి సంఖ్య వంద నుంచి 150 మధ్యలో ఉంటుందని భద్రతా దళాలు ఇప్పటికీ అనుమానిస్తున్నాయి. బందీలను హతమారిస్తే హమాస్ ఉనికి లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, పాలస్తీనా వాసులు వీలైనంత త్వరగా ఈజిప్టుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాకు ఈజిప్టుకు నుంచి సాయం అందుతోంది. 2 టన్నుల ఔషధాలను పంపింది. . We want Clean Hamas Form World. Carry on Israel. #GazaUnderAttack #IsraelPalestineWar #Gaza #Palestine #Israel #FreePalastine #طوفان_القدس #Hamas #HamasTerrorists #IStandWithIsrael pic.twitter.com/I89mwce9R5 — Khushi Tiwari 💖 (@Khushitiwari0) October 10, 2023 ఇది కూడా చదవండి: బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి.. -
Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం
గాజా సిటీ: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది. భద్రత అనేదే లేదిక్కడ ‘ మేం చూస్తుండగానే మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వెంటనే అపార్ట్మెంట్ మెట్లు దిగి అపార్ట్మెంట్ వాసులమంతా బయటికొచ్చాం. ఏడుపులు, భయాందోళనలతో పరిస్థితి దారుణంగా ఉంది. గాజాలో ఎక్కడా భద్రత అనేదే లేదు’ అని సమాహ్ హబౌ అనే మహిళ ఏడుస్తూ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉగ్రసంస్థ గాజా సిటీ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్ బసీమ్ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడారు. ‘ మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
శాంతియుత పరిష్కారం కావాలి
ఇజ్రాయెల్ - పాలస్తీనా విభేదాలపై ప్రణబ్, అబ్బాస్ పిలుపు రమల్లా: ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య విభేదాలను అంతర్జాతీయంగా అంగీకరించిన సూత్రాల ప్రాతిపదికగా చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, పాలస్తీనాలు పిలుపునిచ్చాయి. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పాలస్తీనా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమై చర్చించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న హింసపై మాట్లాడారు. తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనాకు భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలియజేశారు. ఇజ్రాయెల్ సరసన పాలస్తీనా శాంతియుతంగా మనుగడ సాగించాలని భారత్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం.. ప్రత్యేకించి ఐఎస్ఐఎస్, అల్‌ఖైదాల అంశమూ ఈ అగ్రనేతల మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పాలస్తీనా అథారిటీకి భారత్ రూ. 32.3 కోట్ల చెక్కును బడ్జెటరీ మద్దతుగా అందించింది. అలాగే.. పాలస్తీనా భూభాగంలో రమల్లాలో టెక్నాలజీ పార్కు సహా ఐదు ప్రాజెక్టుల కోసం రూ. 115 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు జోర్డాన్ పర్యటన ముగించుకుని రమల్లా చేరుకున్న ప్రణబ్.. పాలస్తీనా నేత అరాఫత్ సమాధి వద్ద నివాళులర్పించారు.