‘హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భయంకరమైనది, క్రూరమైనది. దీనిని మేము ఊహించలేదు. హమాస్ బాంబ్ దాడికి ఇజ్రాయెల్‌లోని మా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లో మ్యూజిక్‌ఫెస్టివల్‌కు హాజరైన 260 మందిని చంపడం బాధాకరం. ఉగ్రవాదులు మహిళలపై అత్యాచారం చేశారు. పిల్లలను కిరాతకంగా చంపుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో మా వాళ్ల భద్రతపై ఆందోళనగా ఉంది.’ ఈ మాటలు భారత్‌లోని ఇజ్రాయెల్ పౌరులు చెబుతున్నవి. ఇండియాలో తాము సురక్షితంగానే ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వెళ్లి విపత్కర సమయంలో శుత్రవులతో పోరాడాలనుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
3 వేల మంది మృతి
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి మారణహోమం సృష్టిస్తోంది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై రాకెట్లతో దాడికి పాల్పడుతోంది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల దాడిలో ఇప్పటి వరకు పౌరులతో సహా 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ గ్రూపు పేర్కొంది. ఇటు హమాజ్ దాడిలో 1300 మంది బలవ్వగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమ వారి క్షేమంపై ఆందోళన
గత ఆరురోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా మిలిటెంట్ల భీకరపోరు ప్రభావం కేవలం ఇజ్రాయెల్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ దేశ పౌరులపై కూడా చూపుతోంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో యుద్ధ ప్రభావిత పాంత్రంలోని తమ సొంతవారి భద్రతపై ఇతర దేశాల్లో నివసించే పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Israelis from around the world have travelled home to join their army units.
— Aviva Klompas (@AvivaKlompas) October 11, 2023
This was the scene at 2am in Israel’s airport. Citizens came to welcome them home.pic.twitter.com/AgtPv4KeR0
దేశ సైన్యానికి సాయం చేస్తా..
హమాస్ అకస్మిక దాడిపై భారత్‌లోని ఇజ్రాయిల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ పౌరుల్లో కొంతమంది చాలాకాలంగా ఇక్కడే నివిస్తున్నవారు ఉండగా మరికొంతమంది పర్యటనల కోసం ఇండియాకు వచ్చినవారు ఉన్నారు. అయితే వీలైనంత త్వరగా టూరిస్టులు తమ దేశానికి వెళ్లాలని భావిస్తున్నారు. కులులోని ఇజ్రాయెల్ టూరిస్ట్ అయిన షీరా.. తిరిగి స్వదేశానికి వెళ్లి హమాస్ ఉగ్రవాదుతో పోరాడుతున్న తమ దేశ సైన్యానికి సాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఇజ్రాయెల్‌కుభారత్ మద్దతుగా ఉండటంపై కృతజ్ఞత తెలియజేస్తూ.. ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యం తమ పౌరులను రక్షించుకోవడమేనని, ఇతరులకు హాని చేయడం కాదని పేర్కొంది.
‘మా తమ్ముడు ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నాడు. అతనితో టచ్‌లో ఉన్నాను. అయినా నాకు భయంగా ఉంది. మా అత్తయ్య దక్షిణ ఇజ్రాయెల్‌లో నివిసిస్తుంది. ఆమె ఇల్లు కూడా పాలస్తీనా ఉగ్రవాదుల బాంబ్ దాడిలో కూలిపోయింది. మా బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. భారత్‌లో మేము సురక్షితంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. ఇజ్రాయెల్‌లో ఉన్న నా కుటుంబంపై ఆందోళనగా ఉంది. నాకు ఇజ్రాయెల్ వెళ్లేందుకు భయంగా ఉంది. ఇప్పటి వరకు నా దేశానికి తిరిగి వెళ్లడానికి నేను ఎప్పుడూ భయపడలేదు.’ అని హిమాచల్ ప్రదేశ్‌ఓని కులు జిల్లాలో నివసిస్తున్న కెనెరియత్ తెలిపారు.
These young Israelis going back to defend their country should put those celebrating Hamas’ atrocities safely in the West to shame. pic.twitter.com/BNduZhVxEl
— Bella Wallersteiner 🇺🇦 (@BellaWallerstei) October 11, 2023
యుద్ధ భూమిలో పోరాడుతా..
రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఇజ్రాయెల్ పర్యాటకుడైన అమత్ తన దేశానికి తిరిగి వెళ్లి ఇజ్రాయెల్ రక్షణ దళాలతో కలిసి యుద్ధభూమిలోకి దిగాలనుకుంటున్నట్లు తెలిపాడు.మహిళలు, పిల్లలు, సైనికులపై హమాస్ వికృత దాడుల కారణంగా తాను సైన్యంలోచేరి పోరాడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అక్టోబరు 15న ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పాడు.
మినీ ఇజ్రాయెల్..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మెక్‌లియోడ్‌గంజ్‌లోని ధరమ్‌కోట్ గ్రామాన్ని 'మినీ ఇజ్రాయెల్' అని కూడా పిలుస్తారు, అక్కడ ఇజ్రాయెల్‌ల జనసాంద్రత ఎక్కుగవగా ఉండటం కారణంగా అలా పిలుస్తారు. ఇజ్రాయెల్‌లోని తమ బంధువుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందదని భావిస్తూ అక్కడి కెమెరాల ముందుకు రావడం లేదు. ఈ సంక్షోభ సమయంలో తమ దేశానికి సేవ చేసేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment