ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం.. రంగంలోకి భారత్‌, ‘ఆపరేషన్‌ అజయ్‌’ ప్రారంభం | Operation Ajay: First Batch Of Indians To Fly Out Of Israel Today - Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం.. రంగంలోకి భారత్‌, ‘ఆపరేషన్‌ అజయ్‌’ ప్రారంభం

Published Thu, Oct 12 2023 9:59 AM | Last Updated on Thu, Oct 12 2023 12:57 PM

Operation Ajay: First Batch of Indians to fly Out Of Israel Today - Sakshi

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది.  ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్‌ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్‌, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్‌ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2200 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,200, గాజాలో 1,055 మంది బలయ్యారు.

20 మందికిపైగా అమెరికన్ల మృతి
ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధంలో ఇరుదేశాలకు చెందిన పౌరులతోపాటు విదేశీయులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 20 మందికి పైగా ఈ దాడుల్లో మరణించారు.తమ దేశ పౌరులు ఇజ్రాయెల్‌లో ప్రాణాలుకోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా స్పందించారు. హమాస్‌ ఉగ్రవాదులు చిన్నారులను పొట్టనబెట్టుకుంటున్న ఫోటోలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్  ఉగ్రవాద దాడిని ఘోరమైన క్రూరత్వంగా అభివర్ణించారు. 
చదవండి: వారంలోనే అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం 

ఇజ్రాయెల్‌లోని పౌరుల కోసం భారత్‌ చర్యలు
ఇజ్రాయెల్‌ దేశంలో  భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. దాదాపు 18000 మంది ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాంతంలో చిక్కకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ అజయ్‌’పేరుతో దేశ పౌరుల తరలింపు ప్రక్రియను గురువారం ప్రారంభించింది.

ఆపరేషన్‌ అజయ్‌
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ‘ఆపరేషన్ అజయ్‌’ను ప్రారంభిస్తున్నట్లు’ బుధవారం ట్విటర్‌లో ప్రకటించారు. భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని తమ పౌరుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు..

ఆపరేషన్‌లో అజయ్‌లో మొదటి బ్యాచ్ భారతీయులను గురువారం ప్రత్యేక విమానంలో ఇజ్రాయెల్ నుంచి తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. ఫస్ట్‌ బ్యాచ్‌లో స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయ పౌరులకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యలయం ఈ మెయిల్‌ చేసింది. ఇజ్రాయెల్‌, పాలస్తీనాలోని యద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులకు సమాచారం, సాయం అందిచడానికి ఢిల్లీలోని కంట్రోల్‌ రూంకంట్రోల్ రూం ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది.

►ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 1800118797 (టోల్ ఫ్రీ), 91-11 23012113, 91-11-23014104, 91-11-23017905, 919968291988.. 

► మెయిల్‌ ఐడీ: gov.mea ID e-mail in the e-mail 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement