బీరుట్: సిడాన్ దక్షిణ పోర్టు నగరంలో పాలస్తీనా శరణార్ధులున్న శిబిరంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. ఇస్లాం ఉగ్రవాది మహమ్మద్ ఖలీల్‌ను హతమార్చే క్రమంలో అతని అనుచరుడిని చంపడంతో అల్లర్లు చెలరేగాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుండి వలస వచ్చిన 55,000 మంది పాలస్తీనీయులు ఉంటున్న ఈ శరణార్థుల శిబిరంలో ఒక్కసారిగా తుపాకులతోను, గ్రెనేడ్లతోనూ కాల్పులు జరిగాయి.
మిలిటెంట్లకు మిలటరీ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడ్డారని అధికారులు అన్నారు. చనిపోయినవారిలో ఐక్యరాజ్యసమితి తరపున శరణార్ధుల యోగక్షేమాలు చూడటానికి వచ్చిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు, ఫతాహ్ గ్రూపుకు చెందిన పాలస్తీనా మిలటరీ జనెరల్ తోపాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: ట్విట్టర్ పేరు మార్పు నా చావుకొచ్చింది.. ఆ రోజు నుండి నిద్ర లేదు..
Comments
Please login to add a commentAdd a comment