
జెరూసలెం : పాలస్తీనాకు చెందిన ఓ సొరంగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో తాము దానిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవహారాల అధికారిక ప్రతినిధి జోనాథన్ కాంక్రియస్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ హమాస్‌లో పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ ఉద్యమ సమయంలో ఆ సొరంగాన్ని ఏర్పాటు చేశారని, దాని సాయంతోనే స్మగ్లింగ్‌ను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు కుట్రలు చేసేవారని అన్నారు.
గతంలో ఇలాంటి సొరంగ మార్గాలన్నింటినీ కూడా దాడులు చేసేందుకే ఉపయోగించేవారని చెప్పారు. ఈ సొరంగం గాజా స్ట్రిప్ నుంచి తమ దేశం మీదుగా ఈజిప్టు వరకు ఉందని తెలిపారు. తాము నిర్వహించిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే, ఈ సొరంగం ఇప్పటికీ కొనసాగతున్నట్లు వెల్లడించారు. గ్యాస్‌పైప్ లైన్ మాదిరిగా ఈ సొరంగ నిర్మాణం భారీ గోడలతో జరిగినట్లు వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందే వారు వైమానిక దాడులు జరపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment