జయశంకర్ భూపాలపల్లి: చిట్యాల మండలంలోని నైన్‌పాక శివారు మోరంచవాగు బ్రిడ్జి నిర్మాణానికి కూలీలుగా పని చేస్తున్న ఆరుగురు కార్మికులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి స్థానిక జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎస్సై రమేష్‌లు ఎమ్మెల్యే, కలెక్టర్‌లకు సమాచారం అందించారు.
దీంతో స్పందించిన వారు రెండు హెలికాప్టర్లను పంపించి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. వరదల్లో చిక్కుకున్న బీకే ఆరుంగ్, బీపిన్ అరుణ్, గానో, ఉత్తమ్, మున్న, రోహిత్‌లు అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన కార్మికులు బ్రిడ్జి పనులు చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వారితోపాటు మరో 20 మంది కార్మికులు రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పడుకున్నారు.
ఈక్రమంలో తెల్లవారు జామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కొంత మంది అప్రమత్తమై పరుగులు తీసుకుంటూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఆరుగురు మాత్రం అక్కడే ఉండిపోయారు. దీంతో వరద పెరగడంతో జేసీబీపై కూర్కొని ఆర్తనాదాలు పెట్టారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment